మాస్ మహరాజ్ రవితేజ తమ్ముడు రఘు కొడుకు మాధవ్ హీరోగా నటిస్తోన్న సినిమా “మిస్టర్ ఇడియట్”. ఈ చిత్రంలో సిమ్రాన్ శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. జేజేఆర్ ఎంటర్ టైన్ మెంట్స్ ఎల్ఎల్ పీ పతాకంపై శ్రీమతి యలమంచి రాణి సమర్పణలో నిర్మాత జె జే ఆర్ రవిచంద్ “మిస్టర్ ఇడియట్” సినిమాను నిర్మిస్తున్నారు. గౌరీ రోణంకి దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ లో ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన “మిస్టర్ ఇడియట్” ట్రైలర్, ‘కాంతార కాంతార..’ లిరికల్ సాంగ్ హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ధృవ ఫ్యాషన్ టెక్నాలజీ కాలేజ్ లో విద్యార్థుల కేరింతల మధ్య “మిస్టర్ ఇడియట్” ట్రైలర్, ‘కాంతార కాంతార..’ సాంగ్ సక్సెస్ సెలబ్రేషన్స్ జరిపారు. ఈ కార్యక్రమంలో మూవీ టీమ్ పాల్గొని తమ హ్యాపీనెస్ స్టూడెంట్స్ తో షేర్ చేసుకున్నారు. డైరెక్టర్ గౌరీ రోణంకి బర్త్ డేను కూడా ఇదే వేదిక మీద సెలబ్రేట్ చేశారు. ఈ సందర్భంగా
‘రంగస్థలం’ మహేష్ మాట్లాడుతూ – ఎంతోమందిని స్టైలిష్ గా మార్చే ఫ్యాషన్ డిజైనర్స్ మీరంతా. మీలో ఒకరి గురించే “మిస్టర్ ఇడియట్” సినిమా ఉంటుంది. నా ఫ్రెండ్స్ కూడా ఫ్యాషన్ డిజైనర్స్ ఉన్నారు. “మిస్టర్ ఇడియట్” సినిమా సక్సెస్ కావాలి ఎందుకంటే ఈ సినిమా నిర్మాతకు సినిమా అంటే ఇష్టం. అన్నారు.
సింగర్ రాహుల్ సిప్లిగంజ్ మాట్లాడుతూ – “మిస్టర్ ఇడియట్” సినిమాలో కాంతార కాంతార పాట పాడే అవకాశం రావడం హ్యాపీగా ఉంది. ఈ పాట మీకు నచ్చిందని అనుకుంటున్నా. పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో “మిస్టర్ ఇడియట్” సినిమా కూడా అంతే పెద్ద సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ – మీ కాలేజ్ కు వచ్చి మీ అందరి సమక్షంలో కాంతార కాంతార సాంగ్ సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకోవడం ఆనందంగా ఉంది. “మిస్టర్ ఇడియట్” సినిమాకు మంచి ఆల్బమ్ చేసే అవకాశం వచ్చింది. దర్శకురాలు గౌరీ గత సినిమా పెళ్లి సందడి మంచి విజయం సాధించింది. ఆమెకు “మిస్టర్ ఇడియట్” కూడా సక్సెస్ ఫుల్ సినిమాగా మారాలని కోరుకుంటున్నా. మా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. అన్నారు.
నిర్మాత జె జే ఆర్ రవిచంద్ మాట్లాడుతూ – ఈ రోజు మా మూవీ ఈవెంట్ ఇంత బాగా జరగడానికి కారణం ధృవ కాలేజ్ ఛైర్మన్, నా ఫ్రెండ్ వెంకట్ రెడ్డి. ఆయనకు మా “మిస్టర్ ఇడియట్” మూవీ టీమ్ తరుపున థ్యాంక్స్ చెబుతున్నాం. మా మూవీ ట్రైలర్ 2 మిలియన్ వ్యూస్ తెచ్చుకుంది. అలాగే కాంతారా కాంతారా సాంగ్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. చిన్న సినిమా ట్రైలర్ కు ఇన్ని వ్యూస్ రావడం హ్యాపీగా ఉంది. ఈ కాలేజ్ లోనే మా మూవీ షూటింగ్ చేశాం. యాజమాన్యం బాగా సపోర్ట్ చేసింది. “మిస్టర్ ఇడియట్” సినిమాకు అనుభవం ఉన్న టెక్నీషియన్స్ వర్క్ చేశారు. మా హీరోయిన్ సిమ్రాన్ శ్రీలీల కంటే పెద్ద హీరోయిన్ అవుతుంది. ఈ మూవీలో అంత బాగా తను పర్ ఫార్మ్ చేసింది. ఈ రోజు మా దర్శకురాలు గౌరీ పుట్టినరోజు. ఆమెకు బర్త్ డే విశెస్ చెబుతున్నాం. అనూప్ గారు మొత్తం ఐదు బ్యూటిఫుల్ సాంగ్స్ ఇచ్చారు. ఇండస్ట్రీలో చాలా మంది వారసులు వచ్చి స్టార్స్ గా ఎదిగారు. కానీ వారసత్వమే వారిని స్టార్స్ ను చేయలేదు. వారసత్వం కాస్తే పనిచేస్తుంది. టాలెంట్ హార్డ్ వర్క్ మాత్రమే స్టార్స్ గా నిలబెడుతుంది. మాధవ్ లో ఆ కష్టపడే తత్వం ఉంది. అర్థరాత్రి దాటినా షూటింగ్ చేసేవాడు. అతనికి మంచి భవిష్యత్ ఉంది. మహేశ్ బాబు, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్..ఇలా ప్రతి హీరో ఫ్యాన్ మా “మిస్టర్ ఇడియట్” సినిమాను సపోర్ట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నా. అన్నారు.
డైరెక్టర్ గౌరీ రోణంకి మాట్లాడుతూ – “మిస్టర్ ఇడియట్” సినిమా షూటింగ్ ఇదే ధృవ కాలేజ్ లో చేశాం. ఆ టైమ్ లో స్టూడెంట్స్ మాకు చాలా సపోర్ట్ చేశారు. మమ్మల్ని డిస్ట్రబ్ చేయకుండా ఉండేందుకు మేము షూటింగ్ చేస్తున్న వైపు అస్సలు వచ్చేవారు కాదు. ఛైర్మన్ వెంకట్ రెడ్డి గారు సహకారం అందించారు. మీ అందరి సపోర్ట్ ఉంటే మా “మిస్టర్ ఇడియట్” మూవీ తప్పకుండా పెద్ద సక్సెస్ అవుతుంది. అన్నారు.
హీరోయిన్ సిమ్రాన్ మాట్లాడుతూ – మా “మిస్టర్ ఇడియట్” సినిమా ఈవెంట్ మీ అందరి మధ్య చేసుకోవడం సంతోషంగా ఉంది. ఈ ఈవెంట్ లో మీరు చూపిస్తున్న ఉత్సాహం, ఎనర్జీ మరే ఈవెంట్ లో చూడలేదు. ఈ చిత్రంలో నేను ఫ్యాషన్ డిజైనర్ క్యారెక్టర్ లో కనిపిస్తా. మాధవ్ తో కలిసి వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. నవంబర్ లో మా “మిస్టర్ ఇడియట్” సినిమా రిలీజ్ అవుతోంది. తప్పకుండా థియేటర్స్ లో చూడండి. అన్నారు.
హీరో మాధవ్ మాట్లాడుతూ – ధృవ ఫ్యాషన్ టెక్నాలజీ స్టూడెంట్స్ అందరికీ హాయ్. ఈరోజు మా ఈవెంట్ లో మీరంతా పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్స్. మీరు చూపిస్తున్న ఈ ఎంకరేజ్ మెంట్ మా టీమ్ కు ఎంతో ఎనర్జీని ఇస్తోంది. మా మూవీ ట్రైలర్, కాంతార కాంతారా సాంగ్ మీకు నచ్చాయనే నమ్ముతున్నాం. ఇదే కాలేజ్ లో మా సినిమా షూటింగ్ చేశాం. ఇక్కడ షూటింగ్ చేయడం మంచి ఎక్సీపిరియన్స్ ఇచ్చింది. నవంబర్ లో మా “మిస్టర్ ఇడియట్” మూవీ రిలీజ్ కు తీసుకొస్తున్నాం. మా సినిమాను మీరంతా ఆదరించాలని కోరుకుంటున్నా. అన్నారు.
నటీనటులు – మాధవ్, సిమ్రాన్ శర్మ, తదితరులు
టెక్నికల్ టీమ్
డైలాగ్స్ – శ్యామ్, వంశీ
సంగీతం అనూప్ రూబెన్స్
లిరిక్స్ – శివశక్తి దత్తా, భాస్కరభట్ల, కాసర్ల శ్యామ్
కొరియోగ్రఫీ – భాను, జిత్తు, వెంకట్, పృథ్వీ
స్టంట్స్ – రాజేశ్ లంక
సినిమాటోగ్రఫీ – రామ్ రెడ్డి
ఆర్ట్ – కిరణ్ కుమార్ మన్నె
ఎడిటింగ్ – విప్లవ్ నైషధం
పీఆర్వో – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
నిర్మాత – జేజేఆర్ రవిచంద్
రచన, దర్శకత్వం – గౌరి రోణంకి
సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడి కిమ్స్ హస్పటల్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ రోజు…
Renowned producer Allu Aravind visited actor Sri Tej, who is currently receiving treatment at KIMS…
Dharma and Aishwarya Sharma are playing the lead roles in the movie Drinker Sai, with…
ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "డ్రింకర్ సాయి". బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ…
The first trailer for Karate Kid: Legends has dropped, featuring the return of Jackie Chan…
VB Entertainments 's Boppana Vishnu presented the Bulli Tera Awards 2023-2024 .On this occasion, a…