‘మిస్టర్ సెలెబ్రిటీ’ ఆడియెన్స్‌కు కనెక్ట్‌ అయ్యే సబ్జెక్ట్‌తో తీసిన చిత్రం..

సుదర్శన్ పరుచూరి హీరోగా మిస్టర్ సెలెబ్రిటీ అనే సినిమాను ఎన్. పాండురంగారావు, చిన్నరెడ్డయ్య సంయుక్తంగా ఆర్‌పి సినిమాస్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. ఈ మూవీకి చందిన రవి కిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో వరలక్ష్మీ శరత్ కుమార్, శ్రీ దీక్ష, నాజర్, రఘుబాబు వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేశారు. సోమవారం నాడు టీజర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు.

‘రామాయణం కాలంలో చాకలి వాడు అన్న పుకార్ల మాటలకు సీతాదేవీ అరణ్య వాసం, అగ్ని ప్రవేశం చేయాల్సి వచ్చింది.. కాలం మారింది కానీ ఈ పుకారు మాటల వల్ల పోయే ప్రాణాలు ఇంకా పోతూనే ఉన్నాయి’ అంటూ ప్రారంభమైన ఈ టీజర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలన్నీ కూడా ఇందులో ఉన్నాయని అర్థం అవుతోంది. సుదర్శన్ యాక్టింగ్, యాక్షన్ కూడా ఈ టీజర్‌లో హైలెట్ అవుతోంది. రూమర్లు, పుకార్లను బేస్ చేసుకుని ఈ కథను ప్రజెంట్ ట్రెండ్‌కు తగ్గట్టుగా దర్శకుడు రవి కిషోర్ తెరకెక్కించినట్టుగా కనిపిస్తోంది. టీజర్ లాంచ్ అనంతరం ఈ కార్యక్రమంలో..

పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ‘నేను, మా తమ్ముడు కలిసి ఈ సినిమాను చూశాం. మా తమ్ముడు చాలా మంచి విమర్శకుడు. సుదర్శన్ బాగున్నాడని, సినిమా బాగుందని మెచ్చుకున్నారు. హీరోల కొడుకులు హీరోలు అవుతుంటారు.. కానీ మా మనవడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. పగ తీర్చుకోవడానికి ఈ జన్మ ఎత్తాను.. ప్రేమ కోసం ఇంకో జన్మ ఎత్తుతాను అని ఖైదీ కథను సింగిల్ లైన్‌లో చెప్పాం. ప్రేక్షకుడు ఊహించింది జరగాలి.. కానీ ఊహించని టైంలో జరగాలి. ఇవన్నీ ఈ మూవీలో జరుగుతాయి. సెలెబ్రిటీల మీద బయట వచ్చే రూమర్లను బేస్ చేసుకుని ఈ కథను రాసుకున్న దర్శకుడు రవి కిషోర్ సినిమాను బాగా తీశారు. గిరిబాబుతో మాకు విడదీయలేని బంధం ఉంది.రఘు బాబు తెరపై అద్భుతంగా నవ్విస్తాడు. సాయి మాధవ్ బుర్రా చాలా మంచి రచయిత. మ్యాటర్ ఉన్న డైలాగ్ రైటర్. ఆడియెన్స్ కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్‌తో తీసిన ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలి’ అని అన్నారు.

పరుచూరి సుదర్శన్ మాట్లాడుతూ.. ‘మిస్టర్ సెలెబ్రిటీతో ఇండస్ట్రీలోకి పరిచయం అవుతుండటం ఆనందంగా ఉంది. నేను హీరో అవుతానని చెప్పగానే మా తాత గారు నాకు కొన్ని పరీక్షలు పెట్టారు. ఎవ్వరికీ నా గురించి చెప్పకుండా జూనియర్ ఆర్టిస్ట్‌గా పని చేశాను. సినిమా కష్టాలన్నీ దగ్గరగా చూశాను. ఈ కథ నన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఆ విషయాన్ని మా తాత గారికి చెప్పాను. ఒళ్లు దగ్గర పెట్టుకుని నటించు అని చెప్పారు. రఘుబాబు గారి కామెడీతో సెట్‌లో సీన్ చేస్తున్నప్పుడు చాలా నవ్వేవాడ్ని. సాయి మాధవ్ గారంటే నాకు చాలా ఇష్టం. గొప్ప రచయితే కాకుండా మంచి వ్యక్తి. అందరూ మా సినిమాను చూసి మా టీంను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

డైరెక్టర్ రవి కిషోర్ మాట్లాడుతూ.. ‘మిస్టర్ సెలెబ్రిటీ కథ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఓ ప్రయోగాత్మక కథ. సుదర్శన్ గారికి ఈ కథను చెప్పినప్పుడు చాలా బాగుందని అన్నారు. పరుచూరి గారికి స్క్రిప్ట్ చూపించాం. చిన్న చిన్న కరెక్షన్స్ చేశారు. మా హీరో సుదర్శన్ సెట్‌లో అందరి కంటే ముందు వచ్చేవారు. ఎంతో ఒదిగి ఉండేవారు. నిర్మాత గారు మాకు ఏం కావాలో అది ఇచ్చారు.. ఎంత పెద్ద ఆర్టిసుల్ని అయినా మాకు ఇచ్చారు. సాధారణ వ్యక్తి నుంచి సెలెబ్రిటీల వరకు ఇబ్బంది పడే ఇష్యూని సినిమాలో చూపించాను. చిన్న సమస్యలే కదా? చిన్న మాటలే కదా? అనిపించొచ్చు. కానీ ఎంత ప్రభావం చూపిస్తుందో ఈ సినిమాలో ఉంటుంది. ఈ మూవీకి క్లైమాక్స్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. మా సినిమా అందరికీ నచ్చుతుంది’ అని అన్నారు.

చిన్న రెడ్డయ్య మాట్లాడుతూ.. ‘సుదర్శన్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. పరుచూరి వారి ఇంటి నుంచి హీరోని పరిచయం చేస్తుండటం ఆనందంగా ఉంది. ఈ జనరేషన్‌కు తగ్గ కంటెంట్‌తో సినిమాను తీశాం. ఈ మూవీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

ఎడిటర్ శివ శర్వాణి మాట్లాడుతూ.. ‘ఈ చిత్రానికి ఎడిటర్‌గా నాకు ఛాన్స్ ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. సినిమా చాలా బాగా వచ్చింది. మమ్మల్ని ఆశీర్వదించేందుకు వచ్చిన పరుచూరి వెంకటేశ్వరరావు గారికి థాంక్స్. ఈ మూవీ అందరినీ ఆకట్టుకుంటుంది’ అని అన్నారు.

రఘుబాబు మాట్లాడుతూ.. ‘సుదర్శన్ అద్భుతంగా నటించాడు. మొదటి సినిమానే అయినా అన్నీ సింగిల్ టేక్‌లోనే చేసేశారు. తెలుగుని చాలా స్పష్టంగా పలికారు. పరుచూరి గారి మనవడు అంటే ఆ మాత్రం ఉంటుంది. నేను ఈ చిత్రంలో మంచి పాత్రను పోషించాను. సినిమా చాలా బాగా వచ్చింది. అందరూ చూడండి’ అని అన్నారు.

సాయి మాధవ్ బుర్రా మాట్లాడుతూ.. ‘మిస్టర్ సెలెబ్రిటీ అనే టైటిల్‌లోనే చాలా పాజిటివిటీ ఉంది.. తెలిసింది మాట్లాడితే స్వేచ్చ.. తెలియంది మాట్లాడితే నేరం.. తెలిసింది నిజం అనుకుని మాట్లాడటం పొరపాటు.. తెలుసు అనుకుని మాట్లాడటం మహా పాపం.. చాలా మంచి పాయింట్‌తో సినిమాను తీశారు. సుదర్శన్ మంచి నటుడు. నా గురువు గారి మనవడు. నేను కూడా సుదర్శన్‌తో ఒక సినిమా చేస్తున్నాను. త్వరలోనే దానికి సంబంధించిన ప్రకటన వస్తుంది. దర్శకుడు ఈ మూవీని బాగా తీశాడనిపిస్తుంది. ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

తారాగణం: వరలక్ష్మి శరత్ కుమార్, సుదర్శన్ పరుచూరి, శ్రీ దీక్ష, నాజర్, రఘుబాబు తదితరులు

సాంకేతిక వర్గం
బ్యానర్ – RP సినిమాస్
నిర్మాత -చిన్న రెడ్డయ్య, ఎన్.పాండురంగారావు
రచయిత, దర్శకుడు – చందిన రవి కిషోర్
కెమెరామెన్ – శివ కుమార్ దేవరకొండ
సంగీతం – వినోద్ యజమాన్య
పాటలు – గణేష్, రాంబాబు గోసాల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – వెంకట్ రెడ్డి
ఎడిటర్ – శివ శర్వాణి
పీఆర్వో – సాయి సతీష్

Tfja Team

Recent Posts

*పాన్ ఇండియా ఫీచర్ ఫిల్మ్‌గా రాబోతున్న ‘వనజీవి రామయ్య’-

▪️ వాస్విక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 'వనజీవి రామయ్య' మూవీ టీమ్ సమక్షంలో ఘనంగా వనజీవి 90 వ జయంతి సందర్భంగా…

2 hours ago

ఘనంగా ప్రారంభమైన ‘నిమ్మకాయ.. నీకెందుకు భయం’ చిత్రం

హైదరాబాద్:ఆధునిక కాలంలోనూ మూఢనమ్మకాలను ఎండగట్టే ఉత్కంఠ రేపుతూ ఆసక్తికరంగా సాగే కథనంతో తెలుగు తెరపైకి ఓ సినిమా రాబోతుంది. రాజేష్…

1 day ago

ఏఐ ఫీచర్ ఫిల్మ్‌గా రాబోతున్న ‘అంబ’s రివెంజ,

▪️తెలుగు సినీ పరిశ్రమలో తొలి పూర్తి స్థాయి AI మూవీ▪️విడుదలకు సిద్ధమవుతూ ప్రచార పర్వం ప్రారంభంహైదరాబాద్‌: తెలుగు సినీ పరిశ్రమలో…

1 day ago

మురళీ శర్మ ఓటీటీ ఎంట్రీ.. నెట్‌ఫ్లిక్స్ తొలి తెలుగు ఒరిజినల్ ‘సూపర్ సుబ్బు’తో ప్రేక్షకుల ముందుకు

జూలై 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్న కామెడీ-డ్రామాలో కుక్కుటేశ్వరరావు పాత్రలో మురళీ శర్మ మూడు దశాబ్దాలకుపైగా హిందీ, తెలుగు,…

1 day ago

ఎన్టీఆర్ జీవితాన్ని పాఠ్యగ్రంథంగా చేర్చాలి, టీడీ జనార్ధన్ ఓ అరుదైన నిబద్ధత కలిగిన రాజకీయ నాయకుడు – మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు.

ఆంధ్రుల ఆరాధ్య దైవంగా వెండితెరపై మూడున్నర దశాబ్దాల పాటు వెలిగి తెలుగువారి గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించిన నందమూరి తారక…

1 day ago

బిలియన్ వ్యూస్ సాధించి చరిత్ర సృష్టించిన బోయపాటి శ్రీను బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా జయ జానకి నాయక.

భద్ర సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన జయ జానకి నాయక చిత్రం సంచలనం…

2 days ago