ఖురేషి అబ్‌రామ్ యొక్క చీకటి ప్రపంచంలోకి అడుగు పెట్టండి: మార్చి 20న మలయాళ సూపర్‌స్టార్, కంప్లీట్‌యాక్టర్ మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబోలో తెరకెక్కుతోన్న భారీ చిత్రం ‘L2E: ఎంపురాన్’ థియేట్రికల్ ట్రైలర్…
మలయాళ సూపర్‌స్టార్, కంప్లీట్ యాక్టర్ మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన భారీ చిత్రం ‘L2E: ఎంపురాన్’. ప్రపంచ వ్యాప్తంగా మార్చి 27న రిలీజ్ అవుతుంది. సినిమా రిలీజ్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయినప్పటినుంచి అభిమానులు, ప్రేక్షకులు సినిమాను చూడటానికి ఎంతో ఎగ్జయిట్‌మెంట్‌తో ఎదురు చూస్తున్నారు. ఈ ఎక్స్‌పెక్టేషన్స్‌ను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళుతూ L2E: ఎంపురాన్ ట్రైలర్‌ను మార్చి 20 మధ్యాహ్నం గం1.08నిమిషాలకు విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. పృథ్వీరాజ్ సుకుమార్ సృష్టించిన అద్భుతమైన ప్రపంచాన్ని చూడటానికి ప్రేక్షకులు సిద్ధం కావచ్చు. ఐనాక్స్ మెగాప్లెక్స్, ఇనార్బిట్ మాల్, మలాడ్, ముంబై వేదికలుగా మలయాళ చిత్రసీమలోనే కాదు, మలయాళ సినీ ఇండస్ట్రీ చరిత్రలోనే తొలిసారిగా ఐమ్యాక్స్ వెర్షన్‌లో ట్రైలర్‌ను విడుదల చేస్తుండటం విశేషం
2019లో విడుదలై బ్లాక్‌బస్టర్ అయిన లూసిఫర్‌కు ఇది సీక్వెల్. మూడు భాగాలుగా రానున్న ఈ సినిమాకు చెందిన రెండో భాగమే L2E: ఎంపురాన్. మోహన్ లాల్ ఖురేషి-అబ్రామ్ అలియా స్టీఫెన్ నెడుంపల్లిగా మరోసారి మాస్ అవతార్‌లో మెప్పించబోతున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో పృథ్వీరాజ్ సుకుమారన్, టోవినో థామస్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్ జెరోమ్ ఫ్లిన్, అభిమన్యు సింగ్, ఆండ్రియా తివాదర్, సూరజ్ వెంజరమూడు, ఇంద్రజిత్ సుకుమారన్, మంజు వారియర్, సానియా అయ్యప్పన్, సాయికుమార్, బైజు సంతోష్, ఫాజిల్, సచిన్ ఖేదేకర్, నైలా ఉష, గిజు జాన్, నందు, శివాజీ గురువాయూర్, ఎస్ మణికుట్టన్, మణికుట్టన్, మణికుట్టన్ ఉన్నారు. ఓ’నెల్, ఎరిక్ ఎబౌనీ, మిఖాయిల్ నోవికోవ్, కార్తికేయ దేవ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలను పోషించారు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్ జెరోమ్ ఫ్లిన్ ఈ మూవీతో ఇండియన్ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు.
మలయాళ చిత్రసీమలోనే అత్యంత భారీ చిత్రంగా ‘L2E: ఎంపురాన్’ చిత్రాన్ని ఆశీర్వాద్ సినిమాస్, శ్రీ గోకులం మూవీస్ బ్యానర్లపై ఆంటోనీ పెరుంబవూర్, గోకులం గోపాలన్ నిర్మించారు. మురళీ గోపి కథను అందించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని దిల్‌రాజుకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ విడుదల చేస్తోంది.
‘L2E: ఎంపురాన్’ చిత్రాన్ని మలయాళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, తమిళ భాషల్లో మార్చి 27న రిలీజ్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని దిల్‌రాజుకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ విడుదల చేస్తుండగా హిందీలో అనీల్ తడానీకి చెందిన ఏఏ ఫిల్మ్స్ నార్త్ ఇండియాలో డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. కర్ణాటకలో ప్రముఖ సంస్థ హోంబలే ఫిల్మ్స్ రిలీజ్ చేస్తోంది. తమిళనాడులో గోకులం గోపాలన్ కి చెందిన శ్రీ గోకులం మూవీస్ ద్వారా విడుదల. మలయాళ చిత్రసీమ నుంచి ఐమ్యాక్స్‌లో రిలీజ్ అవుతున్న తొలి చిత్రంగా ‘L2E: ఎంపురాన్’ ప్రపంచ ప్రేక్షకులను మెప్పించనుండటం విశేషం.
ఐమ్యాక్స్ ఫార్మేట్‌లో ట్రైలర్ విడుదల చేయటమే కాదు, మీడియాకు కూడా ఇదే తరహాలో ప్రత్యేకమైన షోను ప్రదర్శించనుండటం విశేషం.
Megastar Chiranjeevi has yesterday ( 19 March 2025 ) added another jewel to his crown……
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘జాక్ - కొంచెం క్రాక్’. వైష్ణవి…
టాలీవుడ్‌లో నిర్మాతగా దిల్ రాజుకి ఉన్న బ్రాండ్ అందరికీ తెలిసిందే. దిల్ రాజు ప్రొడక్షన్స్ నుంచి ఓ సినిమా వస్తుందంటే…
American actor Kyle Paul took to his social media to share his thoughts about starring…
రాకింగ్ స్టార్ యష్.. లేటెస్ట్ సెన్సేషనల్ పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్’ గురించి అమెరికన్…
Star boy Siddhu Jonnalagadda's upcoming film "Jack - Konchem Krack" directed by Bommarillu Bhaskar is…