మోహనకృష్ణ ఇంద్రగంటి సినిమాకు ‘సారంగపాణి జాతకం’ టైటిల్ ఖరారు

శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్ లో ఇదివరకే ‘జెంటిల్‌మన్’, ‘సమ్మోహనం’ లాంటి చక్కటి విజయవంతమైన సినిమాలు వచ్చాయి. తాజాగా వాళ్లిద్దరి కలయికలో ప్రియదర్శి కథానాయకుడిగా మరో చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాకు ‘సారంగపాణి జాతకం’ అనే టైటిల్ ఖరారు చేయగా, ఈ రోజు టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు.

చిత్రనిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ… ”మనిషి భవిష్యత్తు అతని చేతి రేఖల్లో ఉంటుందా? లేదా అతను చేసే చేతల్లో ఉంటుందా? అనే ప్రశ్నకు జవాబు ఇచ్చే ఓ పరిపూర్ణ హాస్యరస చిత్రం ‘సారంగపాణి జాతకం’. ప్రారంభం నుంచి ముగింపు వరకు నవ్వించే ఓ పూర్తిస్థాయి జంధ్యాల గారి తరహా వినోదాత్మక సినిమా ఇది. మోహనకృష్ణ ఇంద్రగంటి ఈ కథ చెప్పగానే చాలా నచ్చేసింది. ఆయనతో మా సంస్థలో మూడో చిత్రమిది. ప్రియదర్శి, ‘వెన్నెల’ కిశోర్, వైవా హర్ష, నరేష్ విజయకృష్ణ, తనికెళ్ళ భరణి, శ్రీనివాస్ అవసరాల వంటి హేమాహేమీలు ఈ కథలో భాగం అయ్యారు. హీరోయిన్ రూప కొడువాయూర్, వడ్లమాని శ్రీనివాస్, రూపాలక్ష్మి, కల్పలత లు కూడా మంచి పాత్రలు చేశారు. ఈ సినిమా సాంకేతికంగా ఉన్నత స్థాయిలో ఉంటుంది. ఇందులో నాలుగు పాటలు ఉన్నాయి. వివేక్ సాగర్ అద్భుతమైన బాణీలు అందించారు. సంగీతానికి సినిమాలో మంచి ప్రాముఖ్యం ఉంది. మా సంస్థలో 15వ చిత్రమిది. ‘జెంటిల్‌మన్’, ‘సమ్మోహనం’, ‘యశోద’ – హ్యాట్రిక్ విజయాల తర్వాత ఈ సినిమాతో ప్రేక్షకులకి మరో మంచి సినిమా అందివ్వబోతున్నాం. 90 శాతం చిత్రీకరణ పూర్తి అయ్యింది. హైదరాబాద్, రామోజీ ఫిల్మ్ సిటీ, విశాఖలో ఇప్పటి వరకు నాలుగు షెడ్యూల్స్ పూర్తి చేశాం. నేటి నుండి సెప్టెంబరు 5 వరకి రెండు పాటలు, మిగితా సన్నివేశాలు చిత్రీకరణతో సినిమాని పూర్తి చేస్తున్నాం” అని అన్నారు. 

సారంగపాణి జాతకం’ ఫస్ట్ లుక్ విడుదల చేసిన సందర్భంగా దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి మాట్లాడుతూ… ”నమ్మకం మనిషికి బలాన్ని ఇస్తుంది. కానీ, మూఢ నమ్మకం బుద్ధిమంతుడిని కూడా బలహీనుడిని చేసి నవ్వుల పాలు చేస్తుంది. అలా నవ్వుల పాలైన ఓ మధ్య తరగతి మంచి అబ్బాయి కథే ‘సారంగపాణి జాతకం’. తన నమ్మకం, తను ఇష్టపడిన అమ్మాయి ప్రేమ మధ్య కొట్టుమిట్టాడి రెండిటికి చెడ్డ రేవడయిపోయాడా? లేదా బయట పడ్డాడా? అనే కథాంశాన్ని ఉత్కంఠభరితంగా కడుపుబ్బా నవ్వించే హాస్యంతో చెప్పాం. హీరో పాత్రలో భావోద్వేగాలను, వినోదాన్ని ప్రియదర్శి తనదైన శైలిలో అద్భుతంగా పండించగా… అచ్చ తెలుగు అమ్మాయి రూప కడువయూర్ తన అభినయంతో కట్టి పడేస్తుంది. సకుటుంబ సపరివార సమేతంగా హాయిగా చూడగలిగే ఒక హాస్య సంబరం ఈ సినిమా. ఉన్నత సాంకేతిక ప్రమాణాలు అందించే శ్రీదేవి మూవీస్ సంస్థ ఈ సినిమా నిర్మాణంలోనూ ఎక్కడా రాజీ పడలేదు. పీజీ విందా ఛాయాగ్రహణం, వివేక్ సాగర్ సంగీతం, మార్తాండ్ కె వెంకటేష్ కూర్పు, రవీందర్ కళా దర్శకత్వం ప్రేక్షకులు అందరినీ ఆకట్టుకుంటాయి” అని చెప్పారు.

తారాగణం:
ప్రియదర్శి, రూప కొడువాయూర్, నరేష్ విజయకృష్ణ, తనికెళ్ళ భరణి, శ్రీనివాస్ అవసరాల, ‘వెన్నెల’ కిశోర్, ‘వైవా’ హర్ష, శివన్నారాయణ, అశోక్ కుమార్, రాజా చెంబోలు, వడ్లమాని శ్రీనివాస్, ప్రదీప్ రుద్ర, రమేష్ రెడ్డి, కల్పలత, రూప లక్ష్మి, హర్షిణి, కె.ఎల్.కె, మణి, ‘ఐమ్యాక్స్’ వెంకట్.

సాంకేతిక నిపుణులు:
మేకప్ చీఫ్: ఆర్.కె వ్యామజాల, కాస్ట్యూమ్ చీఫ్: ఎన్. మనోజ్ కుమార్, కాస్ట్యూమ్ డిజైనర్స్: రాజేష్ కామర్సు – అశ్విన్, మార్కెటింగ్: టాక్ స్కూప్, పీఆర్వో: పులగం చిన్నారాయణ, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్: కె. రామాంజనేయులు (అంజి బాబు) – పి రషీద్ అహ్మద్ ఖాన్, కో డైరెక్టర్: కోట సురేష్ కుమార్, పాటలు: రామ జోగయ్య శాస్త్రి, స్టంట్స్: వెంకట్ – వెంకటేష్, ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్, ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: పీజీ విందా, సంగీతం: వివేక్ సాగర్, లైన్ ప్రొడ్యూసర్: విద్య శివలెంక, నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్, రచన – దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి.

Tfja Team

Recent Posts

వైభవంగా యూనిక్ పొలిటికల్ ఎంటర్ టైనర్ ‘ధర్మస్థల నియోజకవర్గం’ మూవీ ప్రెస్ మీట్

సెప్టెంబర్ 4న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న ‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా మూవింగ్ డ్రీమ్స్ ఇండియా…

5 hours ago

“కింగ్డమ్” ఫేమ్ వెంకటేష్.వి.పి. హీరోగా రుద్రాంశ్ సెల్యులాయిడ్ నిర్మాణంలో ధీరజ్ న్యాతి ఆధ్వర్యం లో సురేష్ తేజ్ దర్శకత్వంలో ప్రొడక్షన్ నెం.3 మూవీ అనౌన్స్ మెంట్

"కె ర్యాంప్" వంటి కమర్షియల్ సక్సెస్ తర్వాత రుద్రాంశ్ సెల్యులాయిడ్ సంస్థ మరో కొత్త చిత్రాన్ని నిర్మిస్తోంది. సక్సెస్ ఫుల్…

5 hours ago

కీరవాణి గారి లేథోవిస్ మ్యూజిక్ లేబుల్ నుండి రానున్న మరొక సంచలన గీతం – ఈ నెల 28న విడుదల

ఇండిపెండెంట్ ఆర్టిస్టులను ప్రోత్సహించే తరుణంలో ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి గారు ఇటీవల లేథోవిస్ అనే మ్యూజిక్ లేబుల్ ప్రారంభించడం…

6 hours ago

పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ‘విలేజ్ స్టార్స్’ సినిమా

హైదరాబాద్: తెలుగు తెరపైకి మరో బ్యూటిఫుల్ ఎంటర్టైన్మెంట్ రాబోతొంది. ఎన్‌ఎస్‌వీ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై తెరకెక్కనున్న నూతన చిత్రం ‘విలేజ్ స్టార్స్’…

6 hours ago

కల్ట్ ప్రొడ్యూసర్ SKN గారి చేతుల మీదగా మిస్సింగ్ మేఘన మూవీ టీజర్ లాంచ్*

ఫస్ట్ కాపీ మూవీస్, కేడి & కో బ్యానర్ పై పంచుమర్తి నరేష్ బాబు ప్రొడ్యూసర్ గా, వాచస్పతి దర్శకత్వంలో…

7 hours ago

‘అమీర్ లోగ్’ లాంటి చిత్రం ఇప్పటి వరకు రాలేదు.. ఇది కచ్చితంగా హిట్టు బొమ్మ.. ప్రెస్ మీట్‌లో దర్శకుడు రమణా రెడ్డి సోమ

'అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్' బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మించిన తొలి చిత్రం ‘అమీర్ లోగ్’. ఈ మూవీకి రమణా…

8 hours ago