టాలీవుడ్

మైత్రీ మూవీ మేకర్స్ తో తెలుగులో లాంచ్కావడం నా అదృష్టం: అతుల్యరవి

‘మీటర్’ లో మాస్ ఎంటర్‌ టైన్‌ మెంట్ తో పాటు బలమైన ఎమోషన్స్ వుంటాయి. మైత్రీ మూవీ మేకర్స్ తో తెలుగులో లాంచ్ కావడం నా అదృష్టం: అతుల్య రవి

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్‌ టైనర్  ‘మీటర్’. నూతన దర్శకుడు రమేష్ కడూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని క్లాప్ ఎంటర్‌ టైన్‌ మెంట్ నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన మీటర్ టీజర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సమ్మర్ స్పెషల్‌ గా ఏప్రిల్ 7న సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన అతుల్య రవి విలేఖరుల సమావేశంలో ‘మీటర్’  విశేషాలని పంచుకున్నారు.

‘మీటర్’తో తెలుగు పరిశ్రమలోకి రావడం ఎలా అనిపిస్తోంది ? 

తెలుగు పరిశ్రమలోకి రావాలని బలంగా కోరుకున్నారు. దేవుడి దయ వలన  మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ లాంటి ప్రముఖ సంస్థ నిర్మిస్తున్న పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ సినిమాలో అవకాశం రావాడం చాలా ఆనందంగా వుంది. కథ చెప్పినప్పుడే చాలా నచ్చింది. అంతకుమందే కిరణ్ అబ్బవరం గారి ఎస్ ఆర్ కళ్యాణ మండపం సినిమా కూడా చూశాను. చాలా నచ్చింది.

కథలో మీకు నచ్చిన ఎలిమెంట్స్ ఏమిటి ?

మీటర్ పక్కా కమర్షియల్ మూవీ. ఇందులో అద్భుతమైన ఎమోషన్స్ కూడా వున్నాయి. ఒక కమర్షియల్ సినిమాలో ఎమోషన్స్ వున్నపుడు అందరూ కనెక్ట్ అవుతారు. పాటలు కూడా చాలా బావుంటాయి. భారీ సెట్ లో ఒక సాంగ్ చేశాం. డ్యాన్సులు కూడా బావుంటాయి. మాస్ ఫైట్స్ రోమాన్స్ లవ్ ఇలా అన్ని ఎలిమెంట్స్ తో పాటు ఫాదర్ సెంటిమెంట్ కీలకంగా వుంటుంది.

తెలుగు ఎప్పుడు నేర్చుకున్నారు ?

మీటర్ చేస్తున్నప్పుడే (నవ్వుతూ). సినిమాలు చూస్తూ.. టీంతో మాట్లాడుతున్నపుడు అలా వచ్చేసింది. ఇంకా చక్కగా నేర్చుకోవాలి.

మీటర్ లో మీ పాత్రలో ఎలా వుంటుంది ?

ఇందులో నా పాత్ర చాలా డిఫరెంట్ గా వుంటుంది. అబ్బాయిలు అంటే ఇష్టం లేని పాత్రలో కనిపిస్తాయి. నా పాత్ర సీరియస్ గా వుంటుంది. కానీ అందులో నుంచే కామెడీ జనరేట్ అవుతుంది. నా పాత్ర ఫస్ట్ హాఫ్ లో చాలా కామెడీ వుంటుంది.

చమ్మక్ చమ్మక్ పోరి పాటలో డ్యాన్స్ చాలా బాగా చేశారు కదా ?

నాకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. కానీ ఇంట్లో వాళ్ళు నేర్పించలేదు. అయితే డ్యాన్స్ అంటే చాలా ఆసక్తి. ఎవరైన నేర్పితే మాత్రం ఎలాంటి మూమెంట్స్ అయిన చాలా త్వరగా నేర్చుకుంటాను.

ఈ పాత్ర మీ నిజ జీవితానికి దగ్గరగా వుంటుందా ?

లేదండీ. ఇది పూర్తిగా భిన్నం.

ఇది మీకు కొత్త పరిశ్రమ కదా.. దీనికి అలవాటు పడటానికి ఎంత సమయం పట్టింది ?

నాకు అలాంటి ఫీలే లేదండీ. కథ విన్నప్పుడే చాలా కంఫర్ట్ బుల్ అనిపించింది. లుక్ టెస్ట్ అయిన తర్వాత నేరుగా షూటింగ్ కి వెళ్ళాం. కిరణ్ గారు కూడా చాలా ఫ్రండ్లీ. తనలాగే నేను కూడా షార్ట్ ఫిలిమ్స్, ఇండిపెండెంట్ మూవీ చేసే వచ్చాను. ఆ కామన్ కనెక్షన్ మొదటి నుంచి వుంది. మేము ఎప్పుడూ సినిమా గురించే మాట్లాడుకుంటాం.

ఇందులో కిరణ్ – మీ పాత్ర కెమిస్ట్రీ ఎలా వుంటుంది?

కిరణ్ – నాకు వున్న కాంబినేషన్ సీన్స్ చాలా సరదాగా వుంటాయి. హీరోయిన్ ఫాలో చేసి టీజ్ చేయడం, ప్రేమించడం.. ఇలా హిలేరియస్ గా ఉంటుంది. మరో కోణంలో ఎమోషన్స్ ఫైట్స్ మాస్ వుంటుంది. పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ వున్న ఈ సినిమాని కిరణ్ అద్భుతంగా చేశారు. ఎమోషన్స్ చాలా బాగా వర్క్ అవుట్ అయ్యాయి.

ఎలాంటి జోనర్స్ సినిమాలు చేయాలని వుంది ?

ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్ చేయాలని వుంది. అలాగే రస్టిక్ సినిమాలు కూడా చేయాలని వుంది. ప్రయోగాత్మక పాత్రలు కూడా చేయాలనే ఆసక్తివుంది.

తెలుగులో ఏ హీరోలతో కలిసిపని చేయాలని వుంది ?

పవన్ కళ్యాణ్ గారు, బాలయ్య గారు, చిరంజీవి గారు,, మహేష్ బాబు గారు, అల్లు అర్జున్ గారు, జా.ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు , రామ్ గారు, నితిన్ గారు.. ఇలా చాలా పెద్ద లిస్టే వుంది(నవ్వుతూ).

మీటర్ ప్రమోషన్స్ రెస్పాన్స్ ఎలా వుంది ?

ప్రేక్షకులు చూపిస్తున్న అభిమానికి చాలా అనందంగా వుంది. ఇంత అభిమానం ఊహించలేదు. ఎక్కడికి వెళ్ళిన ప్రేక్షకులు ప్రేమాభిమానాలు కురిపించడం గొప్ప అనుభూతి. వారికి మనస్పూర్తిగా కృతజ్ఞతలు.

మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌ టైన్‌మెంట్ తో కలసి పని చేయడం ఎలా అనిపించింది ?

మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణంలో తెలుగు లో లాంచ్ కావడం నా అదృష్టం. నవీన్ గారు, రవి గారు, చెర్రీ గారికి జీవితాంతం రుణపడి వుంటాను

కొత్తగా చేయబోతున్న సినిమాలు ?

తమిళ్ లో హరీష్ కళ్యాణ్ తో డీజల్ సినిమా చేస్తున్నా. ఇంకొన్ని చర్చల దశలో వున్నాయి.

అల్ ది బెస్ట్

థాంక్స్

Tfja Team

Recent Posts

అమరన్ టీంని ప్రశంసించిన సూపర్ స్టార్ రజనీకాంత్

నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి, సిస్టర్ నిఖిత రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగులో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ ద్వారా గ్రాండ్…

40 mins ago

“Jhansi IPS” Set for Release on November 22nd

Produced by Dr. Pratani Ramakrishna Goud under the RK Films banner and directed by Guruprasad,…

1 hour ago

నవంబర్ 22న విడుదలకు సిద్దమైన “ఝాన్సీ ఐపీఎస్”

ఆర్ కె ఫిలిమ్స్ పతాకంపై డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ నిర్మాతగా, తెలుగులో మెగాస్టార్ లాంటి లెజండ్ సరసన నటించిన బ్యూటీ…

1 hour ago

సురేష్ కొండేటికి మరో బాధ్యత

సినీ జర్నలిస్ట్, సంతోషం సంస్థల అధినేత, నిర్మాత సురేష్ కొండేటినీ మరో పదవి వివరించింది. ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్…

2 hours ago

2 రోజుల్లో రూ.13.11 కోట్ల గ్రాస్ వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న “క” మూవీ

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లెటెస్ట్ మూవీ "క" బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ప్రేక్షకుల నుంచి "క"…

2 hours ago

blockbuster film “KA” grosses 13.11 CR at worldwide box office in just 2 days

Young hero Kiran Abbavaram's latest film, "KA," is making waves at the box office. The…

2 hours ago