మెర్సీ కిల్లింగ్ సినిమాలో నటించిన బేబి హారిక కు ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డ్ !!!

Must Read

తెలంగాణ ప్రభుత్వం తెలుగు చిత్ర పరిశ్రమకు అందిస్తున్న ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డ్స్ లో మెర్సీ కిల్లింగ్ లో నటించిన బేబి హారిక ఉత్తమ చైల్డ్ ఆర్టిస్టులుగా గద్దర్ అవార్డ్స్ కు ఎంపికయ్యారు.

సాయి సిద్ధార్ద్ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కిన సినిమా “మెర్సీ కిల్లింగ్” సాయి కుమార్, పార్వతీశం, ఐశ్వర్య, బేబి హారిక ప్రధాన పాత్రల్లో సిద్ధార్ద్ హరియల, మాధవి తాలబత్తుల నిర్మించిన ఈ సినిమాకు శ్రీమతి వేదుల బాల కామేశ్వరి సమర్పించారు. సూరపల్లి వెంకటరమణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు జి.అమర్ సినిమాటోగ్రాఫి అందించగా ఎం.ఎల్.రాజా సంగీతం సమకూర్చారు.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఆధారంగా తెరకెక్కిన చిత్రం మెర్సీ కిల్లింగ్ . స్వేచ్ఛ అనే అనాధ బాలిక తనకు న్యాయం జరగాలంటూ ఈ కథ ప్రారంభం అవుతుంది. గత ఏడాది ఏప్రిల్ 12న థియేటర్స్ లో విడుదలై మంచి విజయం సాధించింది.

ఎమోషనల్ కథ కథనాలను సమాజంలో జరిగే కొన్ని సంఘటనలను తీసుకొని చేసిన మెర్సి కిల్లింగ్ సినిమా ప్రస్తుతం అహలో స్ట్రీమింగ్ అవుతోంది.

Latest News

హీరో సుడిగాలి సుధీర్ “సుధీర్స్ జోకర్” సినిమా నుంచి వెర్సటైల్ యాక్టర్ మురళీశర్మ బర్త్ డే పోస్టర్ రిలీజ్

-"సుధీర్స్ జోకర్" చిత్రంలో డిటెక్టివ్ జీవన్ పాత్రలో ఆకట్టుకోనున్న మురళీశర్మ సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "సుధీర్స్ జోకర్". బిగ్ బాస్ ఫేమ్ అయేషా...

More News