‘గాంఢీవధారి అర్జున’ నుంచి మెలోడీ సాంగ్ ‘నీ జతై..’ విడుదల

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ హీరోగా న‌టిస్తోన్న హై వోల్టేజ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ‘గాంఢీవధారి అర్జున’. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నారు. సాక్షి వైద్య హీరోయిన్‌. ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా ఆగ‌స్ట్ 25న భారీ రేంజ్‌లో విడుద‌ల చేస్తున్నారు నిర్మాత‌లు. 

రీసెంట్‌గా ‘గాంఢీవధారి అర్జున’ సినిమా నుంచి టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌గా..అప్ప‌టికే ఉన్న అంచ‌నాల‌ను ఇది రెట్టింపు చేసింది. తాజాగా మేక‌ర్స్ ఈ సినిమా నుంచి ‘నీ జతై…’ అనే రొమాంటిక్ సాంగ్‌ను విడుద‌ల చేశారు. వ‌రుణ్ తేజ్‌, సాక్షి వైద్య‌ల మ‌ధ్య సాగే పాట ఇది. 

మిక్కీ జె.మేయ‌ర్ సంగీత సార‌థ్యంలో వ‌స్తోన్న ‘గాంఢీవధారి అర్జున’ చిత్రంలో నీ జతై.. మెలోడీ సాంగ్‌ను ఎల్వ్యా, న‌కుల్ అభ‌యంక‌ర్ పాడారు. పాట విన సొంపుగా ఉంది. క‌చ్చితంగా ఈ సీజ‌న్‌లో ఇది ట్రెండింగ్ సాంగ్ అవుతుంద‌ని అంద‌రూ అంటున్నారు. 

స‌రికొత్త యాక్ష‌న్ సీక్వెన్సుల‌తో ఇన్‌టెన్స్  యూనిక్ స్టోరీ లైన్‌తో సినిమా అంద‌రినీ మెప్పించ‌డానికి సిద్ధ‌మ‌వుతోంది. ఇందులో వ‌రుణ్ తేజ్‌తో పాటు సాక్షి వైద్య కూడా స్పెష‌ల్ ఏజెంట్‌గా క‌నిపించ‌నుంది. సీనియ‌ర్ న‌టుడు నాజ‌ర్ ఇందులో కీల‌క పాత్ర‌లో న‌టించారు. సినిమాలోని యాక్ష‌న్ స‌న్నివేశాలు మేజ‌ర్ హైలైట్‌గా నిల‌వ‌నున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు చూడ‌ని స‌రికొత్త లుక్‌లో వ‌రుణ్ తేజ్ కనిపించ‌బోతున్నారు. 

వ‌రుణ్‌తేజ్ కెరీర్‌లో అత్యంత భారీ చిత్రంగా.. యూరోపియ‌న్ దేశాల‌తో పాటు యు.ఎస్‌.ఎలోనూ షూటింగ్‌ను హ్యూజ్ బ‌డ్జెట్‌తో  ఎస్వీసీసీ ప‌తాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్‌, బాపినీడు ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ముఖేష్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జె.మేయ‌ర్ సంగీతాన్ని, అవినాష్ కొల్ల ఆర్ట్ వ‌ర్క్‌ను అందిస్తున్నారు.

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

14 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

14 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

15 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago