హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘ప్రేమ్ కుమార్’ నుంచి ‘సుంద‌రీ’ సాంగ్ రిలీజ్‌

‘ సుంద‌రీ..
ఓ క‌న్నే.. నీ వైపే న‌న్నే
లాగింది చూపుల దార‌మే
నీ క‌న్నుల్లోనే దాగింది మిన్నే..’’ అనుకుంటూ మనసుకి న‌చ్చిన అమ్మాయి గురించి ‘ప్రేమ్ కుమార్’ పాడుకుంటుంటాడు. అసలు ఇంత‌కీ ప్రేమ్ కుమార్ ఎవ‌రు? అత‌ని మ‌న‌సుకు న‌చ్చిన అందాల ముద్దుగుమ్మ ఎవ‌రు? అనే విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే అని అంటున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.

కెరీర్ స్టార్టింగ్ నుంచి డిఫ‌రెంట్ మూవీస్‌తో త‌న‌దైన స్థానాన్ని సంపాదించుకున్న హీరో సంతోష్ శోభ‌న్ తాజా చిత్రం ‘ప్రేమ్ కుమార్’. ల‌వ్ అండ్ ఎంట‌ర్‌టైనింగ్ ఎలిమెంట్స్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా రిలీజ్‌కి సిద్ధ‌మ‌వుతోంది. రైట‌ర్‌ అభిషేక్ మహర్షి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సారంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై శివ ప్రసాద్ పన్నీరు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాశీ సింగ్, రుచిత సాదినేని హీరోయిన్లు . కృష్ణ చైతన్య, కృష్ణ తేజ, సుదర్శన్, అశోక్ కుమార్, శ్రీ విద్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. బుధ‌వారం ఈ సినిమా నుంచి ‘సుంద‌రీ..’ అనే లిరిక‌ల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఎస్‌.అనంత్ శ్రీక‌ర్ సంగీత సార‌థ్యం వహిస్తున్న ఈ సినిమాలో ‘సుంద‌రీ..’ పాట‌ను కిట్టు విస్సాప్ర‌గ‌డ రాయ‌గా, కార్తీక్ పాడారు.

పెళ్లి చేసుకోవాల‌నుకునే హీరోకి ఎదురయ్యే ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితులను ఎంట‌ర్‌టైనింగ్‌గా ‘ప్రేమ్ కుమార్’ చిత్రంలో ఆవిష్క‌రించారు ద‌ర్శ‌కుడు అభిషేక్ మహర్షి. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌, ట్రైల‌ర్‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. గ్యారీ బి హెచ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డీఓపీగా రాంపీ నందిగం పనిచేస్తున్నారు.

‘ప్రేమ్ కుమార్’ పాట‌లు ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్‌లోకి విడుద‌ల‌వుతున్నాయి

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

1 week ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

1 week ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

1 week ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

1 week ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

1 week ago