వి.కె.మూవీస్ పతాకంపై యుజిఓస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సగర్వ సమర్పణలో అశ్విన్ కామరాజ్ కొప్పల దర్శకత్వంలో ఉమాశంకర్‌రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘వృషభ’. నిర్మాత ఉమాశంకర్‌రెడ్డి కథను అందించిన ఈ చిత్రంలో జీవన్, అలేఖ్య హీరో, హీరోయిన్‌లు.
బుధవారం ఫిలింఛాంబర్‌లో ఈ చిత్రం ట్రైలర్, పోస్టర్‌లాంచ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్, నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్నకుమార్, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, గౌతమ్‌రాజు తనయుడు హీరో కృష్ణ తదితరులు పాల్గొన్నారు. సి. కల్యాణ్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.
అనంతరం సి. కల్యాణ్ మాట్లాడుతూ…
ట్రైలర్ అద్భుతంగా ఉంది. దర్శక, నిర్మాతలు శివుణ్ణి నమ్ముకున్నారు. శివుడి ఆజ్ఞలేనిదే చీమైనా కుట్టదు అంటారు. ఆయన మిమ్మల్ని కరుణించి మీకు మంచి లాభాలు, పేరు తెచ్చిపెట్టాలి. ఈ సినిమాలో శివుడి పాత్ర చాలా ఉన్నట్టుగా ట్రైలర్ చూస్తే అనిపిస్తోంది. మంచి ఎమోషన్ ఉంది. చక్కటి లొకేషన్స్‌లో రిస్క్ అయినా లెక్కచేయకుండా చేసినట్లు ట్రైలర్ చూస్తే అర్ధమౌతోంది. నిర్మాత ఉమాశంకర్‌రెడ్డి భవిష్యత్తులో నిర్మాతగా, కథకుడిగా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను అన్నారు.
ప్రసన్నకుమార్ మాట్లాడుతూ…
ట్రైలర్ చాలా బాగుంది. ఇటీవల అఘోరాల కథతో వచ్చిన ‘అఖండ’ మూవీ ఎంత హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈసినిమా కూడా శివుడు, అఘోరాల బ్యాక్‌డ్రాప్‌లో మంచి కంటెంట్‌తో వస్తోంది. తప్పకుండా సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాను. హీరో, హీరోయిన్‌ల నటన కూడా చాలా నేచురల్‌గా ఉంది. ఇవాళ పాన్ ఇండియా, పాన్ వరల్డ్ సినిమాల గురించి మాట్లాడుకుంటున్నాం. అలాంటి సమయంలో కూడా ‘వృషభ’ వంటి చిన్న సినిమాల గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇలాంటి చిన్న సినిమాలు కూడా పాన్ ఇండియా రేంజ్‌కు వెళతాయి. యూనిట్ అందరికీ ఆల్‌ది బెస్ట్ అన్నారు.
తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ…
ట్రైలర్, టైటిల్ ప్రేక్షకులని థియేటర్‌కు రప్పిస్తాయి. ఆ రెండూ చిత్రానికి బాగా ప్లస్ అయ్యాయి. మంచి రా టైపు కంటెంట్‌తో నేచురల్‌గా ఉంది. ఈ ట్రైలర్ చూసిన ప్రేక్షకుడు తప్పకుండా మార్నింగ్‌షోకే థియేటర్‌కు వచ్చేస్తాడు. యూనిట్ అందరికీ మంచి సక్సెస్ ఇస్తుందనే నమ్మకం ఉంది అన్నారు.
ప్రముఖ నిర్మాత, సంతోషం అధినేత సురేష్ కొండేటి మాట్లాడుతూ…
ఈ టైటిల్ నాకు చెప్పగానే అద్భుతంగా ఉంది అన్నాను. కొన్ని సినిమాల ట్రైలర్, ఫస్ట్‌లుక్‌లు చూడగానే ఈ సినిమా సక్సెస్ అవుతుంది అని చెప్పేయవచ్చు. ఆ కోవకు చెందినదే ఈ సినిమా. తప్పకుండా ఇది మంచి పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా అన్నారు.
హీరో కృష్ణ (గౌతమ్‌రాజు తనయుడు) మాట్లాడుతూ…
మా దర్శకుడు కామరాజ్ గారు తనలోని ఆవేశం అంతా ఈ ట్రైలర్‌లో చూపించారు. అలాగే నిర్మాత ఉమాశంకర్‌రెడ్డి గారు మంచి కథను అందించారు. ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతూ అందరికీ ఆల్‌ది బెస్ట్ అన్నారు.
చిత్ర హీరో జీవన్ మాట్లాడుతూ…
అందరం చాలా కష్టపడి చేశాం. ఇంకా క్లైమాక్స్ ఫైట్ చిత్రీకరించాల్సి ఉంది. ఈ చిన్న సినిమాను పెద్ద సినిమాగా భావించి ప్రమోట్ చేయాలని మీడియా మిత్రులను కోరుతున్నా అన్నారు.
చిత్ర దర్శకుడు మాట్లాడుతూ…
మంచి కంటెంట్‌తో, డిఫరెంట్ జోనర్‌ను టచ్ చేశాం. డివోషనల్‌గా వెళుతూనే పశువులకు, మనుషులకు మధ్య ఎంత బాండిరగ్ ఉంటుంది అనేది చూపించే ప్రయత్నం చేశాం. ఈ సినిమా 19661990 మధ్య జరిగే కథ. యూనిట్ అందరూ బాగా సపోర్ట్ చేశారు. ఈ ట్రైలర్‌ని అందరూ మెచ్చుకుంటున్నారు. సినిమాలో ఇంకా అద్భుతాలు ఉన్నాయి అన్నారు. నిర్మాత ఉమాశంకర్‌రెడ్డి మాట్లాడుతూ... ఓ మారుమూల పల్లెలోని ఒక చిన్న గుడిలో ఈ కథ నా మదిలో పుట్టింది. మూడు సంవత్సరాల పాటు దాన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చాను. దాదాపు 70 శాతం షూటింగ్ అయిపోయింది. ఇంకా ఫైనల్ షెడ్యూల్ బ్యాలెన్స్ ఉంది. ఆగష్ట్‌లో అది కూడా పూర్తి చేస్తాం. మా హీరో జీవన్‌రెడ్డి అయితే చాలా సాహసాలే చేశారు ఈ సినిమా కోసం. మురళీమోహన్ గారు ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు. అలేఖ్య కూడా చాలా బాగా చేసింది. నటీనటులు, టెక్నీషియన్స్ తమ స్వంత సినిమాగా ఫీలయ్యి చేశారు. అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అన్నారు. ఇంకా హీరోయిన్ అలేఖ్య, సంగీత దర్శకుడు ఎం.ఎల్. రాజా, జబర్‌దస్త్ టీం తదితరులు సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. నటీ నటులు: జీవన్, అలేఖ్య, మురళీకృష్ణ, నవీన్, లక్ష్మి, జబర్దస్త్ నటులు గెడ్డం నవీన్, ఫిమా, రియాజ్, బాబీ, రాజమౌళి, నాగు, సుధీర్ తదితరులు. సాంకేతిక నిపుణులు : డీఓపీ: యుఎస్ విజయ్, ఎడిటర్: మహేంద్రనాథ్, సంగీతం: ఎం.ఎల్. రాజా, లిరిక్స్: రామాంజనేయులు, ఎం.ఎల్. రాజా, డైలాగ్స్: అనీల్ ప్రతాప్ మడికి, ఎస్.ఎఫ్.ఎక్స్: వెంకటేష్ కె., 5.2: విష్ణువర్ధన్, డిజైన్స్: మనోజ్, మనోజ్, పి.ఆర్.ఓ : సురేష్ కొండేటి, కోప్రొడ్యూసర్: డి. నాగభూషణ్‌రెడ్డి, కథ, నిర్మాత: ఉమాశంకర్‌రెడ్డి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అశ్విన్ కామరాజ్ కొప్పాల.
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…