మెగస్టార్ చిరంజీవి హిట్లర్ జనవరి 1న థియేటర్స్ లో గ్రాండ్ రీ రిలీజ్ !!!

Must Read

హిట్లర్ చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ప్రత్యేక స్థానం ఉంటుంది. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలోని చెల్లెళ్ళ సెంటిమెంట్ కి కంటతడి పెట్టని ప్రేక్షకులు ఉండరు. అలాంటి చిత్రం నూతన సంవత్సరం కానుకగా జనవరి 1న రీరిలీజ్ అవుతోంది. దీనితో చిత్ర యూనిట్ రీరిలీజ్ కి ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

ప్రీ రిలీజ్ ఈవెంట్ కి దర్శకుడు ముత్యాల సుబ్బయ్య, సంగీత దర్శకుడు కోటి, కమెడియన్ బాబు మోహన్ హాజరయ్యారు. అదే విధంగా డైరెక్టర్ మోహన్ రాజా, యువ హీరో సత్యదేవ్ అతిథులుగా హాజరయ్యారు. ఎడిటర్ మోహన్ కూడా హిట్లర్ రీ రిలీజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. 

ఎడిటర్ మోహన్ మాట్లాడుతూ.. హిట్లర్ తో పాటు మరో రెండు చిత్రాలని కూడా తాను రీ రిలీజ్ చేస్తానని మోహన్ తెలిపారు. క్షేమంగా వెళ్లి లాభంగా రండి, హనుమాన్ జంక్షన్ చిత్రాలని కూడా రి రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు. హిట్లర్ చిత్రాన్ని తెలుగులో తెరకెక్కించాలి అనుకున్నప్పుడు నేను డిసైడ్ అయింది చిరంజీవితోనే చేయాలి అని. చిరంజీవి తప్ప ఇంకెవరూ ఈ పాత్రకి న్యాయం చేయలేరు అని భావించినట్లు మోహన్ తెలిపారు. 

దర్శకుడు ముత్యాల సుబ్బయ్య మాట్లాడుతూ.. ఇండస్ట్రీకి వచ్చిన తక్కువ సమయంలోనే చిరంజీవి గారితో సినిమా చేసే అవకాశం రావడం తన అదృష్టం అని తెలిపారు. హిట్లర్ సినిమా ప్రారంభానికి ముందే కొందరు ఫ్యాన్స్ నాకు లెటర్స్ రాశారు. సినిమా బాగా రావాలి.. ఏమైనా తేడా వస్తే ఊరుకోము అంటూ లెటర్స్ పంపారు. దేవుడా ఇదెక్కడి గొడవ అని అనుకున్నట్లు సుబ్బయ్య సరదాగా తెలిపారు. ఈ చిత్రంలో సెంటిమెంట్ సీన్లు, హాబీబి సాంగ్ అన్నీ విపరీతంగా నచ్చాయి. చివరికి సెంటిమెంట్ సాంగ్స్ కూడా సూపర్ హిట్ అని సుబ్బయ్య గుర్తు చేసుకున్నారు. 

బాబు మోహన్ మాట్లాడుతూ.. ఎడిటర్ మోహన్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఒక కథ ఎంచుకున్నారు అంటే అది తప్పకుండా హిట్ అవుతుంది. హిట్లర్ రీ రిలీజ్ అవుతున్నట్లు లేదు.. ఇప్పుడే ఫస్ట్ రిలీజ్ అవుతున్నట్లు హంగామా ఉంది. డ్యాన్స్ లో చిరు అన్నని మించిన వాళ్ళు లేరు. చిరంజీవి ఈ చిత్రంలో చాలా సింపుల్ కాస్ట్యూమ్స్ తో కనిపించారు. రాముడు మంచి బాలుడు అన్నట్లుగా ఉంటారు. మరోసారి హిట్లర్ చిత్రం మీ అందరిని అలరిస్తుంది అని బాబు మోహన్ అన్నారు. 

హీరో సత్యదేవ్ మాట్లాడుతూ.. మోహన్ రాజా సార్ నన్ను ఈ ఈవెంట్ కి ఇన్వైట్ చేశారు. నేను గెస్టుగా రాలేదు.. ఫ్యాన్ బాయ్ గా వచ్చాను అని తెలిపారు. నా చిన్నతనంలో హిట్లర్ చిత్రానికి మా అమ్మానాన్న నన్ను తీసుకెళ్లారు. ఇప్పుడు రీ రిలీజ్అవుతుంది కాబట్టి వాళ్ళిద్దరిని నేను సినిమాకి తీసుకెళతా అని సత్యదేవ్ తెలిపారు.

Latest News

Prabhas comes forward to support the ‘Anti-Drug Awareness Program

Pan India Rebel Star Prabhas has always been eager to support initiatives aimed at the welfare of society. He...

More News