మెగాస్టార్ చిరంజీవి చిత్రం మెగా156 ఈరోజు అనౌన్స్ చేశారు.

Must Read

మెగాస్టార్ చిరంజీవి, సుస్మిత కొణిదెల, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, మెగా156 అనౌన్స్ మెంట్

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజుని పురస్కరించుకుని స్వచ్ఛంద సేవా, రక్తదానం వంటి సేవా కార్యక్రమాలు చేస్తూ మెగా బర్త్ డేని జరుపుకునే అభిమానులకు ఇది ఒక పండగ లాంటి రోజు. మెగా అభిమానులను మరింత ఆనందపరిచే విధంగా, మెగాస్టార్ చిరంజీవి తదుపరి చిత్రం మెగా156 ఈరోజు అనౌన్స్ చేశారు.

మెగా156 చిత్రాన్ని చిరంజీవి ఖైదీ నంబర్ 150వ చిత్రం నుండి స్టైలిస్ట్‌గా వ్యవహరిస్తున్న సుస్మిత కొణిదెల భారీ స్థాయిలో నిర్మించనున్నారు. గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మెగా156 రూపొందనుంది. త్వరలోనే చిత్ర దర్శకుడిని అనౌన్స్ చేస్తారు.

‘నాలుగు దశాబ్దాలుగా వెండితెరను ఏలుతున్న లెగసీ. భావోద్వేగాలను కలిగించే అపారమైన వ్యక్తిత్వం. తెరపైన, బయట పండగ లాంటి వ్యక్తి. 155 చిత్రాల తర్వాత, ఇప్పుడు #MEGA156 మెగారాకింగ్ ఎంటర్టైనర్ అవుతుంది. చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు” అని ప్రొడక్షన్ హౌస్ ట్వీట్ చేసింది.

సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తారు.  

తారాగణం: మెగాస్టార్ చిరంజీవి

సాంకేతిక విభాగం:
నిర్మాత: సుస్మిత కొణిదెల
బ్యానర్: గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్

Latest News

‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ ,క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న సినిమా విడుదల

ల‌వ్‌, ఎమోష‌న్, డ్రామా వంటి క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తోపాటు చ‌క్క‌టి సోష‌ల్ మెసేజ్‌తో రూపొందిన చిత్రం ‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న సినిమా విడుదల వైవిధ్యమైన...

More News