‘వాల్తేరు వీరయ్య’ 115 సెంటర్లలో 50 రోజులు పూర్తి

మెగాస్టార్ చిరంజీవితో కలసి మాస్ మహారాజా రవితేజ నటించిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘వాల్తేరు వీరయ్య’ టాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది.

సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ సాధించడంతో పాటు రోజురోజుకు కలెక్షన్లు పెరిగాయి. ఇదిలావుండగా, ఈ సినిమా ఈరోజుతో 70 డైరెక్ట్ సెంటర్లలో,  ఓవరాల్ గా 115 సెంటర్లలో 50 రోజుల రన్ పూర్తి చేసుకుంది. ఇది ఖచ్చితంగా గొప్ప విజయమే, ఏ సినిమా అయినా లాంగ్ రన్ ఇవ్వడం ఛాలెజింగ్ టాస్క్.

వింటేజ్ మెగాస్టార్ ని చూపించడంతో పాటు, రవితేజను ఇంటెన్స్ క్యారెక్టర్‌లో ప్రజంట్ చేసి అందరి మనసుని గెలిచుకున్నాడు దర్శకుడు బాబీ కొల్లి. ఈ సినిమాలో శ్రుతి హాసన్ కథానాయికగా నటించింది.

మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని మెగా బడ్జెట్‌తో రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్, టాప్ క్లాస్ టెక్నికల్ స్టాండర్డ్స్‌తో నిర్మించారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది.

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

17 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

17 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

17 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago