టాలీవుడ్

‘కమిటీ కుర్రోళ్ళు’ టీమ్ ప‌డ్డ క‌ష్టం తెర‌పై క‌నిపించింది మెగాస్టార్ చిరంజీవి

నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’.  సీనియ‌ర్ న‌టీన‌టుల‌తో పాటు 11 మంది హీరోలు, న‌లుగురు హీరోయిన్స్‌ను పరిచయం చేస్తూ ఈ చిత్రానికి య‌దు వంశీ దర్శకత్వం వహించారు.ఆగస్ట్ 9న ఈ చిత్రం విడుదల అవ్వగా. డిఫరెంట్ కంటెంట్‌తో అన్ని వర్గాల వారిని ఆకట్టుకుని వసూళ్లను రాబడుతోంది. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు విమ‌ర్శ‌కుల ప్ర‌శ‌సంలను అందుకున్న ఈ సినిమాకు సెల‌బ్రిటీల నుంచి ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి. ఇప్ప‌టికే సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌, గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి, స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్‌, క్రిష్‌, దేవిశ్రీప్ర‌సాద్ ఇలా చాలా మంది క‌మిటీ కుర్రోళ్ళు టీమ్‌ను అభినందించారు.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి ‘క‌మిటీ కుర్రోళ్ళు’ సినిమాను ప్ర‌త్యేకంగా వీక్షించి ఎంటైర్ టీమ్‌ను ప్ర‌త్యేకంగా క‌లుసుకున్నారు. నిర్మాత నిహారిక కొణిదెల‌, ద‌ర్శ‌కుడు య‌దువంశీతో పాటు చిత్రంలోని న‌టీన‌టులంద‌రూ చిరంజీవిని క‌లుసుకున్నారు. వారంద‌రితో చిరంజీవి ప్ర‌త్యేకంగా ముచ్చ‌టిస్తూ స‌క్సెస్‌లో భాగ‌మైన ప్ర‌తీ ఒక్క‌రిని ఆయ‌న అభినందించారు. ఈ సంద‌ర్భంగా ..

చిరంజీవి మాట్లాడుతూ మా నిహారిక నిర్మించిన ‘‘క‌మిటీ కుర్రోళ్ళు’ సినిమాను చూశాను.. చాలా చ‌క్క‌గా ఉంది. అంద‌రూ కొత్త కుర్రాళ్లే. చాలా బాగా చేశారు. సినిమా చూస్తున్న‌ప్పుడు కొత్త‌వాళ్లు యాక్ట్ చేస్తున్నార‌నే విష‌యాన్ని మ‌ర‌చిపోయాను. ఎమోష‌న‌ల్ సీన్స్ చాలా చ‌క్క‌గా పండాయి. న‌టీన‌టులంద‌రూ క‌థానుగుణంగా మేకోవ‌ర్ అయిన తీరు అద్భుతం.

సినిమాను నేచుర‌ల్‌గా చిత్రీకరించ‌టం ఎంటైర్ టీమ్ ప‌డ్డ క‌ష్టం గురించి ఎంత చెప్పినా త‌క్కువే, అది తెర‌పై క‌నిపించింది. రీజ‌న‌బుల్ బ‌డ్జెట్‌లో సినిమాను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు య‌దువంశీకి ప్ర‌త్యేక‌మైన అభినంద‌నలు. ద‌ర్శ‌కుడిగా త‌ను చ‌క్క‌టి ప్లానింగ్‌తో సినిమాలోని ప్ర‌తీ స‌న్నివేశాన్నిముందుగా డిజైన్ చేసుకోవటం వ‌ల్ల బాగా తెర‌కెక్కించ‌గ‌లిగారు. రీసెంట్‌గా విడుద‌లైన సినిమాల్లో క‌మిటీకుర్రోళ్లు ముందంజ‌లో ఉంటూ మంచి వ‌సూళ్ల‌ను రాబ‌డుతుంది. ఎంటైర్ టీమ్‌కు అభినంద‌న‌లు’’ అన్నారు.

Tfja Team

Recent Posts

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ…

3 hours ago

ఫిబ్రవరి 6, 2026న‌ ‘యుఫోరియా’ గ్రాండ్ రిలీజ్‌

బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమ‌తి రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో గుణ…

4 days ago

కోయంబత్తూరులోని ఈ యోగ కేంద్రం వద్దనున్న లింగ భైరవి సన్నిధిలో, పవిత్రమైన ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్న సమంత ప్రభు, రాజ్ నిడిమోరు

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…

4 days ago

తల్లి చేతుల మీదుగా అవార్డులను అందుకున్న మధుర క్షణాల్ని గుర్తు చేసుకున్న సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్

సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…

3 weeks ago

“రాజు వెడ్స్ రాంబాయి” మీ హృదయాన్ని తాకే అందమైన ప్రేమ కథ – ట్రైలర్ లాంఛ్ లో హీరో అడివి శేష్

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…

3 weeks ago

‘దేవగుడి’ రియల్ స్టోరి.. కచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది – టీజర్ లాంచ్ వేడుకలో హీరో శ్రీకాంత్

కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…

3 weeks ago