ఏఆర్‌ రెహమాన్‌ కాన్సర్ట్‌ లో సందడి చేసిన మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌, ‘పెద్ది’ టీం- ప్రపంచవ్యాప్తంగా 13 దేశాల్లో టాప్ ట్రెండింగ్‌ లో చికిరి సాంగ్

Must Read

మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌, అస్కార్ విన్నర్ ఏఆర్‌ రెహమాన్‌ కాన్సర్ట్‌ లో సందడి చేశారు. రెహమాన్‌ కాన్సర్ట్‌  రామోజీ ఫిల్మ్‌ సిటీలో అట్టహాసంగా జరిగింది. అతిథులుగా హాజరైన రామ్‌చరణ్‌, జాన్వీ కపూర్‌, బుచ్చిబాబు సానా ఆడియన్స్ లో మరింత జోష్‌ నింపారు. ‘పెద్ది’ సినిమాలోని చికిరి చికిరి లైవ్ పెర్ఫామెన్స్‌ ని ఆడియన్స్ నుంచి అద్భుతమై రెస్పాన్స్ వచ్చింది. ఈ ఈవెంట్‌కు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.. రెహమాన్‌ గారి సంగీతంలో భాగమవ్వాలనేది నా చైల్డ్‌హుడ్‌ డ్రీం. అది నా ప్రాజెక్ట్ ‘పెద్ది’ తో నెరవేరినందుకు చాలా ఆనందంగా వుంది.  

జాన్వి కపూర్ మాట్లాడుతూ.. పెద్ది సినిమాలో భాగమయ్యే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. మా ఫస్ట్ సింగిల్ మీకు బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ సినిమాతో మీకు ఒక డిఫరెంట్, యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాం.

చికిరి పాట ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. మొత్తం 13 దేశాల్లో టాప్ ట్రెండింగ్‌ లో వుంది

పాట విడుదలైనప్పటి నుండి అన్ని ప్లాట్‌ఫామ్‌లలో కొత్త రికార్డ్స్ నెలకొల్పుతోంది. రెహమాన్ స్వరపరిచిన చికిరి చికిరి ఎమోషన్స్, మాస్ అప్పీల్‌ తో చేసే ఆడియో-విజువల్  ఫీస్ట్ గా నిలిచింది. బాలాజీ అద్భుతమైన సాహిత్యం, మోహిత్ చౌహాన్ మ్యాజికల్ వోకల్స్ తో సాంగ్ దేశంలోని ప్రతి మూల నుండి ప్రేక్షకులకు ఇన్స్టంట్ గా కనెక్ట్ అయ్యింది. రామ్ చరణ్  పవర్ ఫుల్ స్క్రీన్ ప్రజెన్స్ తో చికిరి వైరల్ తుఫాను గా మారింది. రూరల్  బీట్స్, ఎనర్జిటిక్ మ్యూజిక్‌, అద్భుతమైన విజువల్స్‌, రామ్ చరణ్‌ మాస్ ఇమేజ్‌ తో  “చికిరి చికిరి” పాట అదిరిపోయింది.  

మొదటి 24 గంటల్లోనే “చికిరి చికిరి” యూట్యూబ్‌లో సెన్సేషన్‌గా మారింది. దేశవ్యాప్తంగా టాప్‌ చార్ట్స్‌లో నెంబర్‌ 1 స్థానం దక్కించుకుంది. నాలుగు భాషల్లో కలిపి  53 మిలియన్‌  ప్లస్ వ్యూస్  సాధించింది. అంతకుముందు 13 గంటల్లోనే 32 మిలియన్‌ వ్యూస్‌ సాధించి సౌత్‌ ఇండియా రికార్డు క్రియేట్‌ చేసింది. దాదాపు మిలియన్‌ లైక్స్‌తో అభిమానుల ప్రేమని అందుకుంది.

ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌, డాన్స్‌ చాలెంజ్‌లు, ఫ్యాన్‌ ఎడిట్స్‌.. ఎక్కడ చూసినా “చికిరి చికిరి” మ్యూజిక్‌ ఫీవర్‌నే కనిపిస్తోంది. రామ్‌ చరణ్‌ మాస్‌ మాగ్నటిజం, ఏఆర్‌.రహ్మాన్‌ మ్యూజిక్‌ మ్యాజిక్ కలసి భాషా, ప్రాంతీయ హద్దులు దాటి ఓ మ్యూజికల్‌ ఫెనామెనాన్‌గా మారాయి.

డైరెక్టర్‌ బుచ్చి బాబు సాన తన మ్యూజిక్ సెన్సిబిలిటీస్, విజువల్‌ సెన్స్‌ను ప్రతి ఫ్రేమ్‌లో అద్భుతంగా చూపించారు. వెంకట సతీష్‌ కిలారు వృద్ధి సినిమా బ్యానర్ పై  భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. పెద్ది 2026 మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News