50 మిలియన్ల వ్యూస్ క్రాస్ చేసి దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకరవర ప్రసాద్ గారు’ మీసాల పిల్ల సాంగ్

మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకరవరప్రసాద్ గారు’ ఫస్ట్ సింగిల్  మీసాల పిల్ల’  50 మిలియన్ల వ్యూస్ క్రాస్ చేసి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తెలుగు సినిమా మ్యూజిక్ కి కొత్త బెంచ్‌మార్క్‌ను నెలకొల్పింది.

హిట్‌మెషిన్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం పండగ వాతావరణంలో, కుటుంబమంతా కలిసి చూసేలా ఉండే ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోంది. ఆ వైబ్‌ను అద్భుతంగా అందించిన సాంగ్‌ “మీసాల పిల్ల”. భీమ్స్‌ సెసిరోలియో అందించిన ఎనర్జిటిక్‌ ట్యూన్‌, బీట్‌లతో ఈ పాట దేశవ్యాప్తంగా చార్ట్‌బస్టర్‌గా మారింది. తెలుగు పాటగా ఇంత పెద్ద స్థాయిలో పాన్‌-ఇండియా రీచ్‌ సాధించడం  అరుదైన ఘనత.

మెగాస్టార్‌ చిరంజీవి తన సిగ్నేచర్‌ చార్మ్‌, ఎక్స్ప్రెషన్స్‌, ఎనర్జిటిక్‌ డ్యాన్స్‌ మూవ్స్‌తో అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. ముఖ్యంగా నయనతారతో ఉన్న సీన్స్‌లో ఆయన  టైమింగ్ ఫ్యాన్స్ ని అలరించింది.  ఉదిత్‌ నారాయణ్‌, శ్వేతా మోహన్‌ వోకల్స్ కట్టిపడేశాయి. ఆకట్టుకునే హుక్‌లైన్‌ తో ఈ సాంగ్‌ను సోషల్‌ మీడియాలో వైరల్‌ సెన్సేషన్‌గా మార్చేశాయి.

ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌, రీల్స్‌ ఎక్కడ చూసినా “మీసాల పిల్ల” ఫీవర్‌నే కనిపిస్తోంది. అభిమానులు డాన్స్‌ చేస్తూ, రీమిక్స్‌లు చేస్తూ, తమ ప్రేమను అద్భుతంగా వ్యక్తపరుస్తున్నారు.

ఈ పాటకు వస్తున్న అద్భుతమైన స్పందనతో సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్‌ ఆకాశాన్ని తాకుతున్నాయి. మిగతా సాంగ్స్‌పై కూడా భారీ ఆసక్తి నెలకొంది.

సాహూ గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా “షైన్‌ స్క్రీన్స్‌”, “గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌” బ్యానర్‌లపై నిర్మిస్తున్న “మన శంకరవర ప్రసాద్‌ గారు” 2026 సంక్రాంతికి గ్రాండ్‌గా విడుదల కానుంది.

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

1 week ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

1 week ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

1 week ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

1 week ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

1 week ago