డిఫరెంట్ థ్రిల్లర్ గా “మయూఖ” ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది – డైరెక్టర్ శ్రీ తేజ్ ఎస్.కె

పాయల్ చెంగప్ప ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా “మయూఖ”.ఈ చిత్రాన్ని శ్రీ తేజ్ ఎస్.కె. దర్శకత్వం వహిస్తున్నారు, ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై శశిధర్ నల్ల నిర్మిస్తున్నారు. సినిమా బండి ప్రొడక్షన్స్ బ్యానర్ పై పలు ఇంట్రెస్టింగ్ మూవీస్ నిర్మించిన శ్రీకాంత్ కాండ్రేగుల శ్రీతేజ్ ఎస్.కె. గా స్క్రీన్ నేమ్ మార్చుకుని ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం విశేషం. “మయూఖ” సినిమా ఈ నెల 9న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలోని హైలైట్స్ ను ఈరోజు జరిగిన ఇంటర్య్వూలో తెలిపారు డైరెక్టర్ శ్రీ తేజ్ ఎస్.కె.

  • మా మయూఖ సినిమాకు ఇటీవల న్యూయార్క్ ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ మిస్టరీ మూవీగా అవార్డ్ వచ్చింది. థ్రిల్లర్ కేటగిరిలో సెకండ్ బెస్ట్ వచ్చింది. ఈ అవార్డ్ వస్తుందని మేము ఎక్స్ పెక్ట్ చేయలేదు. మా మూవీ అవార్డ్ కు సెలెక్ట్ అయ్యిందని తెలిసి టీమ్ అంతా హ్యాపీగా ఫీలయ్యాం. మేము కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కు కూడా మా మూవీని అప్లై చేశాం. మీరు మా మూవీ ప్రమోషనల్ కంటెంట్ చూస్తే కొరియన్, హాలీవుడ్ మూవీ తరహా స్టోరీ టెల్లింగ్, కలర్ గ్రేడింగ్ కనిపిస్తుంటుంది. స్టోరి కొద్ది కొద్దిగా రివీల్ అవుతూ సెకండాఫ్ వచ్చేసరికి పీక్స్ కు వెళ్తుంది. ఇటీవల మన ప్రేక్షకులు ఓటీటీల్లో థ్రిల్లర్ వెబ్ సిరీస్ లు, సినిమాలు బాగా చూస్తూ వస్తున్నారు. సో వాళ్లకు నచ్చేలా మన కంటెంట్ ఉండాలంటే కొత్తగా, క్వాలిటీగా ప్రయత్నించాలి. మయూఖ చిత్రానికి మేము అలాంటి ప్రయత్నమే చేశాం.
  • ఈ కథను మొదట నటి మహేశ్వరి (గులాబీ ఫేమ్) కి చెప్పాం. ఆమె మేము చెప్పిన రెండు కథలు విన్నారు. ఈ స్టోరీతో పాటు మరొక కథ ఆమెకు బాగా నచ్చింది. ఆ కథకు ఆమె లాక్ అయ్యారు. పాయల్ కన్నడలో మంచి ఎంటర్ టైనింగ్ మూవీస్ చేశారు. ఆమె మా కథలోని క్యారెక్టర్ కు బాగా సరిపోతారని అనిపించింది. ఆమె చేసిన వెబ్ సిరీస్ లతో ఇప్పటికే తెలుగు ఆడియెన్స్ కు రీచ్ అయ్యారు. ఈ కథలో ఆమె పాత్రను మన ఆడియెన్స్ బాగా రిలేట్ చేసుకుంటారు, ఆమె క్యారెక్టర్ పడే స్ట్రగుల్స్ కు రెస్పాండ్ అవుతారని నమ్మాం. మయూఖగా పాయల్ చెంగప్ప అద్భుతంగా పర్ ఫార్మ్ చేశారు. ఆమె నటనకు మంచి గుర్తింపు దక్కుతుంది.
  • ఇలాంటి తరహా థ్రిల్లర్స్ గతంలో వచ్చినా మా మూవీలో స్క్రీన్ ప్లే, సినిమా స్టోరీని ప్రెజెంట్ చేసే విధానం కొత్తగా ఉండి ఆకట్టుకుంటుంది. ప్రెజెంటేషన్ కొత్తగా ఉంది కాబట్టే న్యూయార్క్ ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ థ్రిల్లర్ గా అవార్డ్ దక్కింది. ఇక్కడే మా ప్రయత్నం సక్సెస్ అయ్యిందనే నమ్మకం మొదలైంది. ఎక్కడో స్మశానంలో దెయ్యాలు ఉన్నాయంటే ముందే మనసు ప్రిపేర్ అవుతుంది కానీ మనం నివసించే చోట, రోజు ఉండే చోట ఎవరో అపరిచిత వ్యక్తి ఉన్నారంటే ఇంకా ఎక్కువ భయపడతాం. మయూఖ హారర్ సినిమా కాదు థ్రిల్లర్ మూవీ. హీరోయిన్ ఉండే ఫ్లాట్ లోకి ఒక అపరిచిత వ్యక్తి ఎందుకు వచ్చాడు, అతను ఏం చేశాడు. హీరోయిన్ క్యారెక్టర్ తో అతనికి రిలేషన్ ఏంటి ..ఇలాంటి అంశాలతో కథ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంటుంది. మా సినిమా నిడివి 2 గంటల 10 నిమిషాలు ఉంటుంది.
  • మయూఖ అంటే ఆశాకిరణం. మా సినిమా చూస్తూ చివరకు వచ్చేసరికి మీకు మా మూవీ టైటిల్ జస్టిఫై అవుతుంది. నేను రూపొందించిన చివరి షార్ట్ ఫిలిం పేరు మయూఖ. ఆ షార్ట్ ఫిలిం కంప్లీట్ చేయకుండానే యూఎస్ వెళ్లాను. అప్పుడు రాజమౌళి గారు ఒక పాపను దత్తత తీసుకుని ఆమెకు మయూఖ అనే పేరు పెట్టారు. నా ప్రొఫెషనల్ కెరీర్ లో కొనసాగుతున్న టైమ్ లో ప్రొడ్యూసర్ కు ఈ మయూఖ కథ చెబితే బాగుంది చేద్దామని అన్నారు. మనం ఎంత మంచి కథ రాసినా దాన్ని విజువల్ గా, ఆడియో పరంగా అందంగా తెరకెక్కించాలి అప్పుడే సినిమా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. ఈ సినిమాకు విజువల్, సౌండ్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. క్వాలిటీగా చేశాం. శిబి మాత్యూ అలెక్స్ మంచి మ్యూజిక్ ఇచ్చారు.
  • మన ఆడియెన్స్ కొరియన్, హాలీవుడ్ థ్రిల్లర్స్ చూసి మన వాళ్లు ఇలా ఎందుకు తీయరు అనుకుంటూ ఉంటారు. మనం అలాంటి ప్రాడక్ట్ ఇస్తే తప్పకుండా ఆదరిస్తారని నమ్ముతున్నాం. మా సినిమాలో ఎమోషన్ కంటే ఎక్కువగా ఎక్సిపీరియన్స్ ప్రేక్షకులు ఇవ్వబోతున్నాం. సినిమా మేకింగ్ లో మా ప్రొడ్యూసర్ శశిధర్ నల్ల నుంచి కంప్లీట్ సపోర్ట్ లభించింది.
  • నేను దాదాపు ఇరవై ఏళ్ల క్రితం షార్ట్ ఫిలింస్ రూపొందించాను. ఆ తర్వాత యూఎస్ వెళ్లాను అక్కడ న్యూయార్క్ ఫిలిం అకాడెమీలో డైరెక్షన్ కోర్స్ చేశాను. దర్శకత్వం అనేది ఎప్పుడూ నా ప్రయారిటీగా ఉండేది. అయితే సినిమా మేకింగ్ లో అనుభవం కోసం ప్రొడక్షన్ విషయాలపై కూడా అవగాహన పెంచుకున్నాను. తంత్రం, సూత్రవాక్యం అనే సినిమాలను తెలుగులో రిలీజ్ చేశాం. మా సినిమా బండి ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఇప్పటిదాకా రెండు చిత్రాలు చేశాం. మరికొన్ని ప్రొడక్షన్ లో ఉన్నాయి. ఇవన్నీ కొత్త టీమ్ తో చేసినవే. మంచి కథలు ఉంటే తప్పకుండా న్యూ టాలెంట్ కు సపోర్ట్ చేస్తాం. ఒక సినిమా హిట్ అయితే అదే జానర్ లో మూవీస్ వస్తుంటాయి. మనం ఆ జానర్ లో మూవీ చేసేలోపు ట్రెండ్ మారిపోతుంది. నేను లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చేయొచ్చు. కానీ కొత్తగా ప్రయత్నిద్దామని మయూఖ రూపొందించాను. ఉపేంద్ర, రామ్ గోపాల్ వర్మ, పూరి జగన్నాథ్, జొనాథన్ నోలన్ వంటి దర్శకులను ఇష్టపడతా. నెక్ట్స్ నా దర్శకత్వంలో ఒక ఎమోషనల్ సైన్స్ ఫిక్షన్ మూవీ చేయబోతున్నా. అది క్లీన్ యు సర్టిఫికెట్ సినిమా అవుతుంది.
TFJA

Recent Posts

ప్రపంచ వ్యాప్తంగా రూ. 150 కోట్లు కొల్లగొట్టిన ‘మండాడి’.. సూరి, సుహాస్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్

సుహాస్, సూరి ప్రధాన పాత్రల్లో ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్ మీద మతిమారన్ పుగళేంది తెరకెక్కించిన చిత్రం…

52 minutes ago

సూరి & నివిన్ పులె నటించిన సప్తసాగరాలు సప్తగిరులు అక్టోబర్ 9న థియేటర్స్ లో విడుదల !!!

నివిన్ పౌలీ, సూరి, అంజలి ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ సినిమాను తెలుగులో సప్తసాగరాలు సప్తగిరులు పేరుతో డబ్ చేసి…

58 minutes ago

“సమ్మర్ హాలిడేస్” సినిమా నుంచి ‘ఫ్రెండ్షిప్ సాంగ్’ రిలీజ్

కథా బలమున్న చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా పేరు తెచ్చుకున్నారు ధీరజ్ మొగిలినేని.…

1 hour ago

15 నిమిషాలు శ్వాస ఆపి ఆశ్చర్యపరిచిన విద్యుత్ జమ్వాల్

ముంబైలో జరిగిన ‘స్ట్రీట్ ఫైటర్’ ప్రత్యేక కార్యక్రమంలో బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్వాల్ అందరినీ ఆశ్చర్యపరిచారు. వేదికపై వరుసగా 15…

2 hours ago

ఒక్కడిగా వచ్చి.. ఒక బ్రాండ్‌గా ఎదిగి.. హ్యాపీ బర్త్ డే సురేశ్ కొండేటి

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు, సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొండేటి పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనం.. తెలుగు సినీ పరిశ్రమలో…

1 day ago

డిఫరెంట్ థ్రిల్లర్ మూవీ “మయూఖ”ను ఓవర్సీస్ లో రిలీజ్ చేస్తున్న కాగ్నెయిర్ సినీ క్రియేషన్స్.

ఈ నెల 9న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న "మయూఖ" సినిమా పాయల్ చెంగప్ప ప్రధాన పాత్రలో నటిస్తున్న…

1 day ago