ప్రపంచ వ్యాప్తంగా రూ. 150 కోట్లు కొల్లగొట్టిన ‘మండాడి’.. సూరి, సుహాస్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్

సుహాస్, సూరి ప్రధాన పాత్రల్లో ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్ మీద మతిమారన్ పుగళేంది తెరకెక్కించిన చిత్రం ‘మండాడి’. ఈ సినిమాని ఎల్రెడ్ కుమార్ నిర్మించారు. ఈ మూవీలో సూరి, సుహాస్, మహిమా నంబియార్, సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఏపీ, తెలంగాణలో ఈ చిత్రాన్ని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్‌పి సెప్టెంబర్ 10న రిలీజ్ చేసింది. ఈ చిత్రం తమిళనాడులో కొత్త రికార్డుల్ని క్రియేట్ చేసింది.

తమిళ, తెలుగు భాషల్లోనే కాకుండా రిలీజ్ చేసిన అన్ని చోట్లా ‘మండాడి’కి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇప్పటి వరకు ఈ సినిమాకి తమిళనాడులో వంద కోట్లకు పైగా గ్రాస్ వచ్చింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా లెక్కల్ని చూసుకుంటే రూ. 150 కోట్లకు పైగా గ్రాస్ వచ్చింది. సూరి, సుహాస్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా ‘మండాడి’ నిలిచింది.

‘మండాడి’ సినిమాలోని బోట్ సీక్వెన్స్, రేసింగ్ సీన్స్‌కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ‘మండాడి’ సినిమాకి కథిర్ అందించిన విజువల్స్, జీవీ ప్రకాష్ బీజీఎం, పీటర్ హెయిన్, దిలీప్ సుబ్బురాయన్, మహేష్ మాథ్యూ కంపోజ్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ సినిమాకి హైలెట్‌గా నిలిచాయి. సూరి, సుహాస్ నటన, వారి పాత్రలు సినిమాని నిలబెట్టాయి. ఇక ఈ చిత్రాన్ని వీక్షించి రజినీకాంత్, వెట్రిమారన్ వంటి వారు ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే.

నటీనటులు : సూరి, సుహాస్, మహిమా నంబియార్, సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ తదితరులు

సాంకేతిక బృందం

బ్యానర్ : ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్
సమర్ఫణ : ఎల్రెడ్ కుమార్
క్రియేటివ్ ప్రొడ్యూసర్ : వెట్రిమారన్
నిర్మాత : ఎల్రెడ్ కుమార్
సహ నిర్మాత : మణికందన్
దర్శకుడు : మతిమారన్ పుగళేంది
సంగీతం : జి.వి. ప్రకాష్ కుమార్
కెమెరామెన్ : ఎస్.ఆర్. కథిర్
ఎడిటింగ్ : ప్రదీప్ ఇ. రాఘవ్
యాక్షన్ : పీటర్ హెయిన్, దిలీప్ సుబ్బురాయన్, మహేష్ మాథ్యూ
ప్రొడక్షన్ డిజైన్‌ : డి.ఆర్.కె. కిరణ్
పీఆర్వో : సాయి సతీష్

TFJA

Recent Posts

సూరి & నివిన్ పులె నటించిన సప్తసాగరాలు సప్తగిరులు అక్టోబర్ 9న థియేటర్స్ లో విడుదల !!!

నివిన్ పౌలీ, సూరి, అంజలి ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ సినిమాను తెలుగులో సప్తసాగరాలు సప్తగిరులు పేరుతో డబ్ చేసి…

2 hours ago

డిఫరెంట్ థ్రిల్లర్ గా “మయూఖ” ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది – డైరెక్టర్ శ్రీ తేజ్ ఎస్.కె

పాయల్ చెంగప్ప ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా "మయూఖ".ఈ చిత్రాన్ని శ్రీ తేజ్ ఎస్.కె. దర్శకత్వం వహిస్తున్నారు, ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్…

2 hours ago

“సమ్మర్ హాలిడేస్” సినిమా నుంచి ‘ఫ్రెండ్షిప్ సాంగ్’ రిలీజ్

కథా బలమున్న చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా పేరు తెచ్చుకున్నారు ధీరజ్ మొగిలినేని.…

2 hours ago

15 నిమిషాలు శ్వాస ఆపి ఆశ్చర్యపరిచిన విద్యుత్ జమ్వాల్

ముంబైలో జరిగిన ‘స్ట్రీట్ ఫైటర్’ ప్రత్యేక కార్యక్రమంలో బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్వాల్ అందరినీ ఆశ్చర్యపరిచారు. వేదికపై వరుసగా 15…

2 hours ago

ఒక్కడిగా వచ్చి.. ఒక బ్రాండ్‌గా ఎదిగి.. హ్యాపీ బర్త్ డే సురేశ్ కొండేటి

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు, సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొండేటి పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనం.. తెలుగు సినీ పరిశ్రమలో…

1 day ago

డిఫరెంట్ థ్రిల్లర్ మూవీ “మయూఖ”ను ఓవర్సీస్ లో రిలీజ్ చేస్తున్న కాగ్నెయిర్ సినీ క్రియేషన్స్.

ఈ నెల 9న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న "మయూఖ" సినిమా పాయల్ చెంగప్ప ప్రధాన పాత్రలో నటిస్తున్న…

1 day ago