“సమ్మర్ హాలిడేస్” సినిమా నుంచి ‘ఫ్రెండ్షిప్ సాంగ్’ రిలీజ్

కథా బలమున్న చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా పేరు తెచ్చుకున్నారు ధీరజ్ మొగిలినేని. ఆయన తన ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై “సమ్మర్ హాలిడేస్” అనే చిల్డ్రన్ మూవీని నిర్మిస్తున్నారు. “సమ్మర్ హాలిడేస్” సినిమాను మన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే ఒక అందమైన కథతో దర్శకుడు శ్రీకర్ రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబి ఖుషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలోనే “సమ్మర్ హాలిడేస్” సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

“సమ్మర్ హాలిడేస్” సినిమా మ్యూజిక్ ప్రమోషన్స్ సక్సెస్ ఫుల్ గా జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన ‘క్రష్ సాంగ్..’, ‘స్కూల్ సాంగ్’ మ్యూజిక్ లవర్స్ నుంచి హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ రోజు ఈ సినిమా నుంచి ‘ఫ్రెండ్షిప్ సాంగ్..’ రిలీజ్ చేశారు. ఈ పాటను సింజిత్ యెర్రమల్లి ఒక బ్యూటిఫుల్ ట్యూన్ తో కంపోజ్ చేశారు. ఈ పాట పల్లవికి పూర్ణాచారి సాహిత్యం అందించగా, చరణం, హుక్ లైన్ కిట్టు విస్సాప్రగడ రాశారు. శ్రీ రామ చంద్ర ఆకట్టుకునేలా పాడారు. ‘ఫ్రెండ్షిప్ సాంగ్..’ ఎలా ఉందో చూస్తే ‘ఓ రెండు తోకచుక్కలు తొడిగాయి చిన్ని రెక్కలు, గోదారి దారిపొడవునా ఎగిరాయే, ఆ పాల బోసినవ్వులు, అల్లరి తారాజువ్వలు, ఊరంతా కొత్త సందడే చేశారే, యేటి గట్టులో, మావి చెట్టులో, నీటి తొట్టిలో వీరే, ఒక్క చోటులో కుదురుగుండరు, రోజంతా ఈ కోతిలే, కాగితాల పడవల్లా తేలుతూ దాటుతారు గోదారే…’ అంటూ సాగుతుందీ పాట. ఈ పాటలో మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ యెర్రమల్లి, సింగర్ శ్రీరామచంద్ర నటించడం విశేషం.

నటీనటులు – రోహన్ రాయ్, అరుణ్, ఖుషి, జయసుధ, రాజీవ్ కనకాల, వాసుకి, హర్షిణి, హర్షవర్థన్, తదితరులు

టెక్నికల్ టీమ్

డీవోపీ – సాయి ప్రకాశ్
మ్యూజిక్ డైరెక్టర్ – సింజిత్ యెర్రమల్లి
బ్యానర్ – ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్
పీఆర్ఓ – సురేష్ (ఎస్ కె మీడియా)
ప్రొడ్యూసర్ – ధీరజ్ మొగిలినేని
స్టోరీ, డైరెక్టర్ – శ్రీకర్

TFJA

Recent Posts

ప్రపంచ వ్యాప్తంగా రూ. 150 కోట్లు కొల్లగొట్టిన ‘మండాడి’.. సూరి, సుహాస్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్

సుహాస్, సూరి ప్రధాన పాత్రల్లో ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్ మీద మతిమారన్ పుగళేంది తెరకెక్కించిన చిత్రం…

48 minutes ago

సూరి & నివిన్ పులె నటించిన సప్తసాగరాలు సప్తగిరులు అక్టోబర్ 9న థియేటర్స్ లో విడుదల !!!

నివిన్ పౌలీ, సూరి, అంజలి ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ సినిమాను తెలుగులో సప్తసాగరాలు సప్తగిరులు పేరుతో డబ్ చేసి…

55 minutes ago

డిఫరెంట్ థ్రిల్లర్ గా “మయూఖ” ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది – డైరెక్టర్ శ్రీ తేజ్ ఎస్.కె

పాయల్ చెంగప్ప ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా "మయూఖ".ఈ చిత్రాన్ని శ్రీ తేజ్ ఎస్.కె. దర్శకత్వం వహిస్తున్నారు, ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్…

1 hour ago

15 నిమిషాలు శ్వాస ఆపి ఆశ్చర్యపరిచిన విద్యుత్ జమ్వాల్

ముంబైలో జరిగిన ‘స్ట్రీట్ ఫైటర్’ ప్రత్యేక కార్యక్రమంలో బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్వాల్ అందరినీ ఆశ్చర్యపరిచారు. వేదికపై వరుసగా 15…

2 hours ago

ఒక్కడిగా వచ్చి.. ఒక బ్రాండ్‌గా ఎదిగి.. హ్యాపీ బర్త్ డే సురేశ్ కొండేటి

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు, సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొండేటి పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనం.. తెలుగు సినీ పరిశ్రమలో…

1 day ago

డిఫరెంట్ థ్రిల్లర్ మూవీ “మయూఖ”ను ఓవర్సీస్ లో రిలీజ్ చేస్తున్న కాగ్నెయిర్ సినీ క్రియేషన్స్.

ఈ నెల 9న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న "మయూఖ" సినిమా పాయల్ చెంగప్ప ప్రధాన పాత్రలో నటిస్తున్న…

1 day ago