మాయగాడు చిత్ర ట్రైలర్ కు విశేష స్పందన

Must Read

Mayagadu Telugu Movie Trailer | Naveen Chandra | Pooja Jhaveri | Gayathri Suresh | Telugu FilmNagar

వీరసింహరెడ్డి సినిమాలో కీలక పాత్రను పోషించి మంచి హిట్ అందుకున్న నవీన్ చంద్ర,అందాల రాక్షసితో సినిమాతో టాలీవుడ్‌లోకి  ఎంట్రీ ఇచ్చాడు, ఆ తర్వాత నేను లోకల్, దేవదాస్, అరవింద సమేత మూవీస్‌లో నవీన్ చేసిన ఇంపార్టెంట్ రోల్స్ ఆడియన్స్‌ని ఆకట్టుకున్నాడు.నేను లేని నా ప్రేమకథ, జమ్నా ప్యార్, కళా విప్లవం, ప్రణయం వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ గాయత్రీ సురేష్.

ప్రస్తుతం నవీన్ చంద్ర, గాయత్రీ సురేష్, పూజా జవేరి హీరో, హీరోయిన్స్‌గా, అడ్డా ఫేం.. జీ.ఎస్. కార్తీక్ రెడ్డి  డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమా‘మాయగాడు’. స్వాతి పిక్చర్స్ బ్యానర్‌పై, భార్గవ్ మన్నె ఈ చిత్రాన్ని  నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసారు చిత్రబృందం. పైరసీ బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతున్న లవ్ స్టోరీ ఇది. ఈ సినిమాలో హీరో కొత్త సినిమాలను పైరసీ చేస్తుంటాడు. పైరసీ వలన సినీ పరిశ్రమకు ఏర్పడే నష్టాలను ఈ సినిమాలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను త్వరలో రిలీజ్ చేయనున్నారు

అభిమన్యు సింగ్, కబీర్ సింగ్, జయప్రకాష్ రెడ్డి, సారిక రామచంద్రరావు తదితరులు ఈ సినిమాలో నటించారు.

సినిమా టైటిల్ – మాయగాడు
బ్యానర్ – స్వాతి పిక్చర్స్
హీరో – నవీన్ చంద్ర
హీరోయిన్ – గాయత్రి సురేష్
దర్శకుడు – జిఎస్ కార్తీక్ రెడ్డి
సంగీతం – అనూప్ రూబెన్స్
ఎడిటర్ – జునైద్ సిద్ధికీ,
కెమెరా : వెంకట్ గంగాధరీ,
ఫైట్స్ : రియల్ సతీష్
పి.ఆర్. ఓ: మధు వి.ఆర్

డిజిటల్ : ప్రసాద్ లింగం

Latest News

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు సినీ పరిశ్రమ లో అజాత...

More News