మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజల భారీ అంచనాలు వున్న మాస్ ఎంటర్ టైనర్ ‘వాల్తేరు వీరయ్య’ ను 2023 సంక్రాంతికి చూడటానికి ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు బాబీ కొల్లి (కేఎస్ రవీంద్ర) ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే చిరంజీవికి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. రవితేజ ప్రీ లుక్ పోస్టర్.. ఫస్ట్ లుక్, టీజర్పై క్యూరియాసిటీని పెంచింది.
పవర్ ఫుల్ పోలీస్-విక్రమ్ సాగర్ ఏసీపీగా రవితేజ పాత్రను పవర్ ప్యాక్డ్ గా పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ , టీజర్ను విడుదల చేశారు మేకర్స్. బిల్డ్-అప్ షాట్ లు పర్ఫెక్ట్ ఎలివేషన్స్ ఇచ్చాయి. మాస్ని ఎలా మెప్పించాలో బాబీకి తెలుసు. రవితేజ కారులో ఎంట్రీ ఇస్తూ.. చేతిలో మేక పిల్లతో దిగి, విలన్స్ ని ఇరగదీశారు. ‘ఏం రా వారీ.. పిస పిస చేస్తుండావ్.. నీకింకా సమజ్ కాలే.. నేను ఎవ్వనయ్యకీ యిననని” అని వార్నింగ్ ఇస్తూ రవితేజ చెప్పిన డైలాగ్ మాస్ కి పూనకాలు తెప్పించింది. అంతకుముందు” ”ఫస్ట్ టైమ్ ఒక మేకపిల్లని ఎత్తుకొన్న పులి వస్తా వున్నది” అన్న ఇంట్రో డైలాగ్ కూడా అదిరిపోయింది. యాక్షన్ సీక్వెన్స్ కు రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ టెర్రిఫిక్ గా కొరియోగ్రఫీ చేశారు.
‘పవర్’ తర్వాత తన మ్యానరిజమ్స్ , డైలాగ్ డెలివరీతో మాస్ ను అలరించే రవితేజ కోసం బాబీ మరో పవర్-ప్యాక్డ్ పాత్రను అందిస్తున్నారు. రాక్స్టార్ దేవి శ్రీ ప్రసాద్ తన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో టీజర్ కి మరింత ఇంటెన్సిటీని తీసుకొచ్చారు. ఇప్పటికే భారీ అంచనానలు వున్న ఈ సినిమాపై ఈ టీజర్ మరింత బజ్ పెంచింది.
ప్రస్తుతం టీజర్ ట్రెమండస్ రెస్పాన్స్ తో యూట్యూబ్, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీజర్ గురించి మెగాస్టార్ చిరంజీవి.. ”అతని బ్యాగ్రౌండ్ – కేవలం హార్డ్ వర్క్.. అతని సపోర్ట్ – ప్రేమించే మాస్” అని ట్వీట్ చేయగా..” అన్నయ్య
కానీ, అతని ధైర్యం – మీరు చూపించిన మార్గం
” అని రవితేజ రీట్వీట్ చేయడం అభిమానులని అలరిస్తోంది.
ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా, ప్రస్తుతం యూరప్ లో లీడ్ పెయిర్పై పాటల చిత్రీకరణ జరుగుతోంది. ఈ చిత్రానికి రాక్స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జికె మోహన్ సహ నిర్మాత.
ఆర్థర్ ఎ విల్సన్ కెమెరామెన్ గా, నిరంజన్ దేవరమానె ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి సుష్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్.
ఈ చిత్రానికి బాబీ కథ, మాటలు రాయగా, కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్ప్లే అందిస్తున్నారు. రైటింగ్ డిపార్ట్మెంట్లో హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి కూడా పనిచేస్తున్నారు.
సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తయింది. చివరి పాటను ప్రస్తుతం యూరప్ లో చిరంజీవి, శృతి హాసన్లపై చిత్రీకరిస్తున్నారు.
‘వాల్తేరు వీరయ్య’ జనవరి 13, 2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది.
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…