మాస్ మహారాజ రవితేజ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ జులై 11న రీ రిలీజ్ !!!

Must Read

మాస్ మహారాజ రవితేజ మళ్లీ తన అభిమానులకు ఫుల్టూ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీని అందించేందుకు రెడీ అయ్యాడు. రవితేజ నటించిన ‘మిరపకాయ్’ మూవీ గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించగా, ఈ సినిమాలో రవితేజ యాక్టింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

ఇప్పుడు ఈ సినిమాను రీ-రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. జులై 11న ‘మిరపకాయ్’ చిత్రాన్ని రీ-రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. హనుమాన్ మీడియా ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు, ఈ సినిమాలో అందాల భామ రిచా గంగోపాధ్యాయ్, దీక్షా సేత్ హీరోయిన్లుగా నటించగా, రమేష్ పుప్పల ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశారు. థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. ‘మిరపకాయ్’ మూవీ రీ-రిలీజ్‌ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఇటీవల రవితేజ నటించిన నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ చిత్రం విడుదలై మంచి ఓపెనింగ్స్ ను రాబట్టుకుంది, అదే తరహాలో మిరపకాయ్ సందడి చేయబోతోంది.

Latest News

ఇంటర్నేషనల్ వుమెన్స్ డే సందర్భంగా స్టార్ హీరోయిన్ నభా నటేష్ కవర్ పేజీ పబ్లిష్ చేసిన ప్రముఖ మేగజైన్ షీ ఇండియా

ఈరోజు ఇంటర్నేషనల్ వుమెన్స్ డే సందర్భంగా ప్రముఖ మేగజైన్ షీ ఇండియా స్టార్ హీరోయిన్ నభా నటేష్ ను తన కవర్ పేజీగా పబ్లిష్ చేసింది....

More News