మాస్ మహారాజా రవితేజ, విష్ణు విశాల్ సంయుక్తంగానిర్మిస్తున్న స్పోర్ట్స్ డ్రామా ‘మట్టి కుస్తీ’. ఆర్ టి టీమ్‌వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్ లపై రూపొందుతున్న ఈ చిత్రానికి చెల్లా అయ్యావు దర్శకత్వం వహిస్తున్నారు. విష్ణు విశాల్ కు జోడిగా ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తోంది.
ఈరోజు రవితేజ ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. పోస్టర్‌లో విష్ణు విశాల్ స్టార్ రెజ్లర్‌గా రింగ్‌లో బిగ్ ఫైట్ కి రెడీ అవుతున్నట్లుగా కనిపించారు. రెజ్లింగ్ డ్రెస్ లో, కండలు తిరిగిన శరీరంతో ఆకట్టుకున్నాడు విష్ణు విశాల్. మట్టి కుస్తీ కథ గ్రామీణ నేపథ్యంలో సాగుతుంది.
ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించగా, సినిమాటోగ్రాఫర్ గా రిచర్డ్ ఎం నాథన్, ఎడిటర్ గా ప్రసన్న జికె పని చేస్తున్నారు.
మట్టి కుస్తీ షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. డిసెంబర్ లో సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
తారాగణం: విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి
సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: చెల్లా అయ్యావు
నిర్మాతలు: రవితేజ, విష్ణు విశాల్
బ్యానర్లు: ఆర్ టి టీమ్‌వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్
డీవోపీ: రిచర్డ్ ఎం నాథన్
సంగీతం: జస్టిన్ ప్రభాకరన్
ఎడిటర్: ప్రసన్న జికె
ఆర్ట్ డైరెక్టర్: ఉమేష్ జే కుమార్
లిరిక్స్: వివేక్
పీఆర్వో వంశీ-శేఖర్
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…