నేటి తరం యువత ని ఆకట్టుకునే సరికొత్త కథతో దర్శకుడు ప్రణీత్ సాయి
నేతృత్వంలో యువ నటుడు శ్రీ సింహా హీరోగా రూపొందుతున్న చిత్రం ‘భాగ్
సాలే’. ఫస్ట్ లుక్ నుండే ఈ చిత్రం పై ఆసక్తి పెంచుతోందీ సినిమా. ఒక్కో
లిరికల్ సాంగ్ రిలీజ్ చేస్తూ మ్యాజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటోంది భాగ్
సాలే మూవీ. ఈ చిత్రం నుంచి తాజాగా ‘ప్రేమ కోసం’ అనే మాస్ నెంబర్ ను
విడుదల చేశారు.
సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ కాల భైరవ స్వరకల్పనలో కాసర్ల శ్యామ్
సాహిత్యాన్ని అందించిన ఈ పాటను మంగ్లీ ఎనర్జిటిక్ గా పాడింది. నందినీ
రాయ్ తన డాన్సులతో పాటకు జోష్ తీసుకొచ్చింది. సన్ లైటు, మూన్ లైటు,
మించిందేరా లవ్ లైటూ ..వద్దు చాటు, వద్దు లేటు..ఉంటే చాలు కొంత చోటు అంటూ
సాగిందీ పాట. వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్, బిగ్ బెన్, సినీ వ్యాలీ
మూవీస్ సినిమా బ్యానర్లపై అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్
సింగనమల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
నేహా సొలంకి హీరోయిన్ గా నటిస్తుండగా జాన్ విజయ్ మరియి నందిని రాయ్ ముఖ్య
పాత్రలు చేస్తున్నారు. ఆద్యంతం థ్రిల్ చేసే ఈ కథలో రాజీవ్ కనకాల, వైవా
హర్ష, సత్య, సుదర్శన్, వర్షిణి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ఎడిటింగ్ కార్తీక ఆర్ శ్రీనివాస్, సినిమాటోగ్రఫీ రమేష్ కుషేందర్
చేస్తున్న ఈ చిత్రం త్వరలో విడుదల అవ్వడానికి సిద్ధంగా ఉంది.
AI దుర్వినియోగంపై పటిష్ఠ రక్షణ చర్యలు కోరుతూ వినతిపత్రం - సంబంధిత మంత్రిత్వ శాఖలతో సమన్వయం చేస్తామని కేంద్ర మంత్రి…
"యంగ్ అండ్ డైనమిక్", "మా రాముడు అందరివాడు" వంటి పలు హిట్ చిత్రాల్లో హీరోగా నటించిన డైనమిక్ హీరో శ్రీరామ్…
మంచి చిత్రాలను ఆదరించే తెలుగు ప్రేక్షకులు సెలెబ్రేట్ చేసుకునేలా ‘ఓం’ సినిమా ఉంటుంది - ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ధనుష్…
ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "అరుంధతి నక్షత్రం". ఈ సినిమాలో మేఘ శెట్టి, మధు దామరాజు హీరోయిన్స్…
‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను - ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ నటుడు అలీ శరణ్య,…
అందరి బంధువు, చిత్రపరిశ్రమ శ్రేయోభిలాషి, కార్మికుల పాలిట పెన్నిధి, చిన్న నిర్మాతల పక్షపాతి, సినీ జర్నలిస్టుల ఆత్మీయుడు అయిన సీనియర్…