యువ హీరో శ్రీ సింహా ‘భాగ్ సాలే’ చిత్రం నుండి ‘ప్రేమ కోసం’ పాట విడుదల

నేటి తరం యువత ని ఆకట్టుకునే సరికొత్త కథతో దర్శకుడు ప్రణీత్ సాయి
నేతృత్వంలో యువ నటుడు శ్రీ సింహా హీరోగా రూపొందుతున్న చిత్రం ‘భాగ్
సాలే’. ఫస్ట్ లుక్ నుండే ఈ చిత్రం పై ఆసక్తి పెంచుతోందీ సినిమా. ఒక్కో
లిరికల్ సాంగ్ రిలీజ్ చేస్తూ మ్యాజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటోంది భాగ్
సాలే మూవీ. ఈ చిత్రం నుంచి తాజాగా ‘ప్రేమ కోసం’ అనే మాస్ నెంబర్ ను
విడుదల చేశారు.

సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ కాల భైరవ స్వరకల్పనలో కాసర్ల శ్యామ్
సాహిత్యాన్ని అందించిన ఈ పాటను మంగ్లీ ఎనర్జిటిక్ గా పాడింది. నందినీ
రాయ్ తన డాన్సులతో పాటకు జోష్ తీసుకొచ్చింది. సన్ లైటు, మూన్ లైటు,
మించిందేరా లవ్ లైటూ ..వద్దు చాటు, వద్దు లేటు..ఉంటే చాలు కొంత చోటు అంటూ
సాగిందీ పాట. వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్, బిగ్ బెన్, సినీ వ్యాలీ
మూవీస్ సినిమా బ్యానర్లపై అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్
సింగనమల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

నేహా సొలంకి హీరోయిన్ గా నటిస్తుండగా జాన్ విజయ్ మరియి నందిని రాయ్ ముఖ్య
పాత్రలు చేస్తున్నారు. ఆద్యంతం థ్రిల్ చేసే ఈ కథలో రాజీవ్ కనకాల, వైవా
హర్ష, సత్య, సుదర్శన్, వర్షిణి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ఎడిటింగ్ కార్తీక ఆర్ శ్రీనివాస్, సినిమాటోగ్రఫీ రమేష్ కుషేందర్
చేస్తున్న ఈ చిత్రం త్వరలో విడుదల అవ్వడానికి సిద్ధంగా ఉంది.

TFJA

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

1 week ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

1 week ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

1 week ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

1 week ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

1 week ago