దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఇంపాక్ట్ ఫుల్ తెలుగు డ్రామా ‘ఉత్సవం’. అర్జున్ సాయి దర్శకత్వం వహిస్తున్నారు. హార్న్‌బిల్ పిక్చర్స్‌పై సురేష్ పాటిల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ రోజు ‘ఉత్సవం’ నుంచి మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ సాంగ్ ని రిలీజ్ చేశారు. స్టార్ కంపోజర్ అనూప్ రూబెన్స్ ఈ పాటని బ్యూటీఫుల్ సిగ్నేచర్ మెలోడీగా కంపోజ్ చేశారు. ట్యూన్ విన్నవెంటనే కనెక్ట్ అయ్యేలా వుంది. సాంగ్ టైటిల్ కి తగ్గటే మ్యారేజ్ వైబ్ తో ఆర్కెస్ట్రా రైజేషన్ అద్భుతంగా వుంది.
అనంత శ్రీరామ్ రాసిన లిరిక్స్ ఈ పాటకు మరింత ఆకర్షణ తీసుకొచ్చాయి. అర్మాన్ మాలిక్ తన వోకల్స్ తో మెస్మరైజ్ చేశాడు. ఈ సాంగ్ లో లీడ్ పెయిర్ దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా కెమిస్ట్రీ బ్యూటీఫుల్ గా వుంది.
ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, నాజర్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, అలీ, ప్రేమ, ఎల్.బి. శ్రీరామ్, అనీష్ కురువిల్లా, ప్రియదర్శి, ఆమని, సుధ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్.
సెప్టెంబర్ 13న ఈ సినిమా విడుదల కానుంది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ సినిమా ఏపీ, తెలంగాణలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.
తారాగణం: దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా, ప్రకాష్ రాజ్, నాజర్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, అలీ, ప్రేమ, ఎల్.బి. శ్రీరామ్, అనీష్ కురువిల్లా, ప్రియదర్శి, ఆమని, సుధ
సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: అర్జున్ సాయి
నిర్మాత: సురేష్ పాటిల్
సమర్పణ: హార్న్‌బిల్ పిక్చర్స్
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: వనమాలి, భాస్కరభట్ల, అనంత శ్రీరామ్.
గాయకులు: అనురాగ్ కులకర్ణి, కైలాష్ ఖేర్, అర్మాన్ మాలిక్, విజయ్ ప్రకాష్, పెంచల్ దాస్/ రామ్ మిరియాల.
ప్రొడక్షన్ డిజైనర్: బ్రహ్మ కడలి
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
డీవోపీ: రసూల్ ఎల్లోర్
డైలాగ్స్:రమణ గోపిసెట్టి
డిఐ & సౌండ్ మిక్స్: అన్నపూర్ణ స్టూడియోస్
మ్యూజిక్ లేబుల్: లహరి మ్యూజిక్
పీఆర్వో: వంశీ- శేఖర్
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…