మంజుమల్ బాయ్స్ తెలుగు వర్షన్ ప్రదర్శనలను నిలిపివేసిన పీవీఆర్ మల్టిఫ్లెక్స్

Must Read

  • పీవీఆర్ మల్టిఫ్లెక్స్ తీరుపై మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఆగ్రహం
    మలయాళంలో ఘన విజయాన్ని సాధిం రికార్డు స్థాయిలో వసూళ్లు కొల్లగొట్టిన మంజుమల్ బాయ్స్ … తెలుగులోనూ అదే స్థాయిలో ప్రేక్షకుల నుంచి ఆదరణ పొందుతోంది. తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన అన్ని కేంద్రాల్లోనూ మంచి వసూళ్లు సాధిస్తోంది. ఈ క్రమంలో అనూహ్యాంగా పీవీఆర్ మల్టిఫ్లెక్స్ మంజుమల్ బాయ్స్ తెలుగు వర్షన్ ప్రదర్శనలను ఆపేసింది. మలయాళ నిర్మాతతో ఉన్న వివాదం కారణంగానే ఆ చిత్ర ప్రదర్శనలను ఆపేసినట్లు పీవీఆర్ వెల్లడించింది. పీవీఆర్ మల్టిఫ్లెక్స్ తీరుపై మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మలయాళ నిర్మాతతో వివాదం ఉంటే తెలుగు వర్షన్ ను ఎలా ఆపేస్తారని ప్రశ్నించారు. మంచి వసూళ్లు సాధిస్తున్న క్రమంలో అర్థాంతరంగా ఆపేయడం అన్యాయమన్న శశిధర్ రెడ్డి… ప్రదర్శనలు ఆపడం వల్ల ఆర్థికంగా నష్టపోతున్నట్లు తెలిపారు. పీవీఆర్ మల్టిప్లెక్స్ వ్యవహారశైలిని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పీవీఆర్ మల్టిఫ్లెక్స్ తీరుపై ఈ రోజు సాయంత్రం అత్యవసర సమావేశం కానుంది

Latest News

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ థియేట‌ర్స్‌లో సంద‌డి చేస్తోన్న‌సినిమా ధనుష్, కృతి...

More News