ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ మాంగళ్య షాపింగ్ మాల్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మరింత విస్తరిస్తోంది. ప్రస్తుతం భాగ్యనగరంలో మాంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర జరుగుతుంది. తాజాగా మరో ప్రతిష్టాత్మకమైన మాంగళ్య షాపింగ్ మాల్ హెచ్ పి పెట్రోల్ బంక్ పక్కన నార్సింగ్ మెయిన్ రోడ్డు నందు శుక్రవారం వైభవంగా ప్రారంభమైంది. ప్రముఖ హీరోయిన్ సంయుక్త మీనన్ చేతుల మీదుగా ఈ షాపింగ్ మాల్ ను ప్రారంభించారు. నార్సింగ్ పరిసర ప్రాంతాలలో కనీవినీ ఎరుగని రీతిలో అంగరంగ వైభవంగా ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది.
పట్టు, ఫ్యాన్సీ, హై–ఫ్యాన్సీ, చుడీదార్స్, వెస్ట్రన్‌వేర్, మెన్స్ బ్రాండెడ్, కిడ్స్ వేర్, ఎథినిక్ వేర్‌లతో అంతర్జాతీయ షాపింగ్ అనుభూతిని ఇచ్చేలా భారీగా మాంగళ్య షాపింగ్ మాల్ ఏర్పాటు చేశారు. ఇది షాపింగ్ అనుభవాన్ని విప్లవాత్మకంగా మార్చే సరికొత్త రిటైల్ డెస్టినేషన్ అని, మార్కెట్ ధరల కన్నా తగ్గింపు ధరలకు అందిస్తున్నామని,
ప్రారంభోత్సవ ఆఫర్లు మిస్ చేసుకోవద్దని.. స్టోర్ నిర్వాహకులు తెలియజేశారు.
అడ్రెస్స్ : మాంగళ్య షాపింగ్ మాల్..
హెచ్ పి పెట్రోల్ బంక్ పక్కన,
నార్సింగ్ మెయిన్ రోడ్,
హైదరాబాద్.