రాకింగ్ మంచు మనోజ్, అనిల్ సుంకర ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ కాంబినేషన్ లో ‘వడ్డీ కాసుల వాడ’ టైటిల్ లాంచ్

Must Read

రాకింగ్ మంచు మనోజ్ స్టైలిష్‌ కమ్‌బ్యాక్‌కు రంగం సిద్దమైంది. ఏటీవీ సమర్పణలో ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ పై ‘వడ్డీ కాసుల వాడ’ సినిమాను ప్రకటించారు. మనోజ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ‘వడ్డీ కాసుల వాడ’ టైటిల్ కాన్సెప్ట్ వీడియో సోషల్ మీడియాలో దూసుకెళ్తుంది. ఈ వీడియోకు అద్భతమైన స్పందన వస్తుంది. టైటిల్ క్యాచీగా ఉండడం, మనోజ్ మ్యానరిజానికి తగ్గట్టుగా ఉండడంతో అందరిని ఇట్టే ఆకట్టుకుంది. వీరి కాంబినేషన్ లో 2010లో బిందాస్ సినిమా వచ్చింది. బిందాస్ లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత ఇన్నాళ్లకు హీరో మనోజ్ మళ్లీ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో బ్యానర్ తో జతకట్టడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

బిందాస్ సినిమాకు ఒక స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు మళ్లీ అదే వైబ్‌ను చూడబోతున్నామని తాజా వీడియో చూస్తే అర్థం అవుతుంది. టైటిల్ కాన్సెప్ట్ వీడియోలో మనోజ్ సంతకం చేస్తూ తన కామెడీ టైమింగ్‌ ని చూపించారు. మనోజ్ అంటే ఎనర్జీ, హ్యూమర్ అని తెలిసిందే. మరోసారి అదే స్థాయి పెర్ఫార్మెన్స్ ను వడ్డీ కాసుల వాడలో చూడబోతున్నామని తాజా వీడియో చూస్తే అర్థం అవుతుంది. ఇక మనోజ్ నుంచి ఓ సాలిడ్ కమర్షిల్ సినిమా కోరుకుంటున్న ఫ్యాన్స్‌ కు వడ్డీ కాసుల వాడ ఫుల్ మీల్స్ అని చెప్పొచ్చు.

మనచుట్టు, మన జీవితంలో ఈఎంఐలు భాగమైపోయాయి. అదే కాన్సెప్ట్ తో వడ్డీ కాసుల వాడ రూపొందుతుంది. ఈఎంఐ, వాయిదాల నేపథ్యంలో కథ సాగుతుందని దానికి కావాల్సినంత హాస్యాన్ని జోడించినట్లు తెలుస్తుంది. ఈ వీడియోలో మనోజ్ దేవుడిని కోరుకోవడం చూస్తుంటే నవ్వు ఆగడం లేదు. ఆయనకు ఉన్న ఇబ్బందులు, ఆర్థిక పరిస్థితులు తనదైన స్టైల్ లో దేవిడిని మొక్కడం చూస్తుంటే ఈ టైటిల్ సరిగ్గా సరిపోతుంది అనిపిస్తుంది. సామాన్య, మధ్యతరగతి ప్రజలకు కూడా ఈ టైటిల్ బాగా కనెక్ట్ అవుతుంది. అయితే సినిమాలో కేవలం కామెడీ మాత్రమే కాదు గుండెను పిండేసే భావోద్వేగాలు కూడా ఉన్నట్లు అర్థం అవుతుంది. మొత్తం మీద కామెడీ, భావేద్యేగాలతో మనోజ్ అలరించబోతున్నట్లు తెలుస్తుంది.

తేజ్ ఉప్పలపాటి రచన, దర్శకత్వంలో పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా వడ్డీ కాసుల వాడ రూపొందుతోంది. ఈ సినిమాతో వింటేజ్ మనోజ్ ఎనర్జీ, ఆయన కామెడీ టైమింగ్ చూడబోతున్నట్లు మేకర్స్ చెబుతున్నారు. అలాగే అందరికి కనెక్ట్ అయ్యే కథ, ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఫుల్ మీల్స్ అందిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. మనోజ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన వీడియోకు వస్తున్న స్పందనకు సంతోషం వ్యక్తం చేస్తూ.. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందిస్తామని పేర్కొన్నారు. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ నేతృత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కిశోర్ గరికపాటి, అజయ్ సుంకర, దయా పన్నెం సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

చిత్రం: వడ్డీ కాసుల వాడ
బ్యానర్ : ఏ టీవీ
నటీనటులు : మంచు మనోజ్
రచన- డైరెక్టర్ : తేజ్ ఉప్పలపాటి
నిర్మాతలు : రామబ్రహ్మం సుంకర
సహా నిర్మాతలు : కిశోర్ గరికపాటి, అజయ్ సుంకర, దయా పన్నెం

Latest News

భారీ సర్ప్రైజ్ తో ‘హీ-మ్యాన్ అండ్ ది మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్’ తెలుగు ట్రైలర్‌ – హీ-మ్యాన్‌గా నిఖిల్ సిద్ధార్థ వాయిస్

హాలీవుడ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రం ‘హీ-మ్యాన్ అండ్ ది మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్’ ఇప్పుడు ఇండియన్ ఆడియన్స్‌ను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన...

More News