టాలీవుడ్

మంచు లక్ష్మి బర్త్ డే సందర్భంగా ఆదిపర్వం సినిమా నుంచి లుక్ రిలీజ్

రావుల వెంకటేశ్వర్ రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్ పతాకంపై ఏఐ ఎంటర్ టైన్ మెంట్స్ కలయికలో నిర్మించిన చిత్రం “ఆదిపర్వం”. ఈ సినిమాలో మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. మరో కీలక పాత్రను ఆదిత్యం ఓం పోషిస్తున్నారు. ఎర్రగుడి నేపథ్యంలో అమ్మవారి చుట్టూ అల్లుకున్న పీరియాడిక్ ప్రేమకథతో గ్రాఫిక్స్ ప్రధానంగా “ఆదిపర్వం” చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు సంజీవ్ మేగోటి. “ఆదిపర్వం” సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 31న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.

టాలెంటెడ్ యాక్ట్రెస్ మంచు లక్ష్మి పుట్టినరోజు సందర్భంగా “ఆదిపర్వం” చిత్రంలో ఆమె క్యారెక్టర్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఆమె క్యారెక్టర్ ఫస్ట్ లుక్ ఆసక్తికరంగా ఉండి ఆకట్టుకుంటోంది. ఇప్పటిదాకా మంచు లక్ష్మి చేయని, ఓ సరికొత్త పాత్రలో ఆమె ప్రేక్షకులను అలరించబోతున్నారు.

దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ – ముందుగా మంచు లక్ష్మి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అన్వికా ఆర్ట్స్, ఏఐ ఎంటర్ టైన్ మెంట్స్ సహకారంతో నేను అనుకున్న స్థాయిలో ఒక గొప్ప చిత్రంగా “ఆదిపర్వం” ను మలిచానన్న సంతృప్తి మిగులుతోంది. మంచు లక్ష్మి, ఆదిత్యం ఓం, శివ కంఠమనినేని, ఎస్తేర్ పాత్రలకు జనం నీరాజనం పలుకుతారు. వాళ్ల పర్ ఫార్మెన్స్ మెమొరబుల్ గా ఉంటాయి. 1974-90 మధ్య కాలంలో జరిగిన యదార్థ ఘటనల సమాహారంగా ఈ సినిమాను రూపొందించాను. అమ్మోరు, అరుంధతి చిత్రాల తరహాలో దుష్టశక్తికి, దైవశక్తికి మధ్య జరిగే యుద్ధమే ఈ సినిమా. ఇలాంటి మూవీ ఈ మధ్య కాలంలో రాలేదు. మా మూవీలో గ్రాఫిక్స్ హైలైట్ అవుతాయి. ఈ నెల 31న థియేటర్స్ లో మా ఆదిపర్వం సినిమాను చూడండి. అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఘంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ – మంచు లక్ష్మి గారికి బర్త్ డే విశెస్ చెబుతున్నాం. రెట్రో ఫీల్ తో గుడ్ లవ్ స్టోరీగా ఆదిపర్వం మొదలై కంప్లీట్ యాక్షన్ థ్రిల్లర్ గా మిమ్మల్ని చూపు తిప్పుకోకుండా ఆకట్టుకుంటుంది. ఆదిపర్వం సినిమాకు మీ సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాం. అన్నారు.

సహ నిర్మాత గోరెంట శ్రావణి మాట్లాడుతూ – మంచు లక్ష్మి గారికి హ్యాపీ బర్త్ డే చెబుతున్నాం. ఆదిపర్వం తెలుగు చిత్రాల్లో ఒక గొప్ప ప్రయత్నంగా ప్రశంసలు దక్కించుకుంటుందని ఆశిస్తున్నాం. మూవీ టీమ్ ఎంతో సపోర్ట్ చేశారు. మీ అందరికీ గుర్తుండే ఒక మంచి సినిమాగా ఆదిపర్వం ఉంటుంది. ఫైట్స్, గ్రాఫిక్స్ కు మీ ప్రశంసలు దక్కుతాయి. అన్నారు.

నటీనటులు – మంచు లక్ష్మి, ఆదిత్యం ఓం, ఎస్తేర్, సుహాసిని, శ్రీజిత ఘోష్, శివ కంఠమనేని, వెంకట్ కిరణ్, సత్య ప్రకాష్, సమ్మెట గాంధీ, జెమినీ సురేష్, ఢిల్లీ రాజేశ్వరి, హ్యారీ జోష్, జబర్దస్త్ గడ్డం నవీన్, యోగి క్రాంతి , మధు నంబియార్, బీఎన్ శర్మ, బృంద, స్నేహ అజిత్, అయోషా, జ్యోతి, దేవి శ్రీ ప్రభు, శ్రావణి, గూడా రామకృష్ణ, రాధాకృష్ణ తేలు, రవి రెడ్డి, లీలావతి, దుగ్గిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీరామ్, తదితరులు

టెక్నికల్ టీమ్

సినిమాటోగ్రఫీ – ఎస్ ఎన్ హరీశ్
మ్యూజిక్ – మాధవి సైబ, ఓపెన్ బనాన ప్రవీణ్, సంజీవ్, బి.సుల్తాన్ వలి, లుబెక్ లీ, రామ్ సుధీ(సుధీంద్ర)
ఎడిటింగ్ – పవన్ శేఖర్ పసుపులేటి
ఫైట్స్ – నటరాజ్
కొరియోగ్రఫీ – సన్ రేస్ మాస్టర్
ఆర్ట్ డైరెక్టర్ – కేవీ రమణ
ప్రొడక్షన్ మేనేజర్స్ – బిజువేముల రాజశేఖర్ రెడ్డి, కొల్లా గంగాధర్, కంభం ప్రకాష్ రెడ్డి
కో డైరెక్టర్ – సిరిమల్ల అక్షయ్ కుమార్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ – ఘంటా శ్రీనివాసరావు
సహ నిర్మాతలు – గోరెంట శ్రావణి, రవి మొదలవలస, ప్రదీప్ కాటకూటి, రవి దశిక, శ్రీరామ్ వేగరాజు.
పీఆర్ఓ- మూర్తి మల్లాల
పీఆర్ డిజిటల్ టీమ్ – కడలి రాంబాబు, దయ్యాల అశోక్
నిర్మాణం – అన్వికా ఆర్ట్స్, ఏఐ(అమెరికా ఇండియా) ఎంటర్ టైన్ మెంట్స్
రచన, దర్శకత్వం – సంజీవ్ మేగోటి

Tfja Team

Share
Published by
Tfja Team

Recent Posts

సెకండ్ షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న మూవీ “కిల్లర్”

"శుక్ర", "మాటరాని మౌనమిది", "ఏ మాస్టర్ పీస్" వంటి డిఫరెంట్ సినిమాలతో మూవీ లవర్స్ దృష్టిని ఆకట్టుకుంటున్న దర్శకుడు పూర్వాజ్…

41 minutes ago

Second Schedule of Sci-Fi Action Killer has been wrapped up

Director Poorvaj, who has been captivating audiences with films like Shukra, Matarani Maunamidi, and A…

41 minutes ago

తెలంగాణ ప్రభుత్వం అనుమతితో శ్రీతేజ్‌ను పరామర్శించిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌

సంధ్య థియేటర్‌ తొక్కిసలాటలో గాయపడి కిమ్స్‌ హస్పటల్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ ఈ రోజు…

19 hours ago

Allu Aravind Visits Sri Tej After Telangana Government’s Permission

Renowned producer Allu Aravind visited actor Sri Tej, who is currently receiving treatment at KIMS…

20 hours ago

Ardham Chesukovu Enduke Song Released from Drinker Sai

Dharma and Aishwarya Sharma are playing the lead roles in the movie Drinker Sai, with…

20 hours ago

“డ్రింకర్ సాయి” సినిమా నుంచి ‘అర్థం చేసుకోవు ఎందుకే..’ లిరికల్ సాంగ్ రిలీజ్

ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "డ్రింకర్ సాయి". బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ…

20 hours ago