ప్రస్తుత ట్రెండ్‌లో సినిమా పాటలతో పాటు మ్యూజికల్ ఆల్బమ్స్ కు కూడా మంచి ఆదరణ లభిస్తోంది. ఇప్పటికే అనేక ఫోక్ సాంగ్స్‌కు ప్రేక్షకుల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. సోషల్ మీడియాలో మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంటున్నాయి. తాజాగా మరో కొత్త ఫోక్ సాంగ్ ప్రేక్షకులను పలకరించబోతోంది. ‘మనసు ఇచ్చిన పిల్లా.. మాట తప్పితే ఎల్లా’ అనే క్యాచీ టైటిల్‌తో లవ్ ఫెయిల్యూర్ పాటగా దీన్ని రూపొందించారు.
శుక్రవారం ఈ సాంగ్ ను రీసెంట్‌గా సరిపోదా శనివారం సినిమాతో సూపర్ సక్సెస్ ను అందుకున్న నేచురల్ స్టార్ నాని రిలీజ్ చేసి టీం కు బెస్ట్ విషెస్ చెప్పారు. ఈ సాంగ్‌లో ప్రముఖ ఫొటో జర్నలిస్ట్ శ్యాం కుమార్ రావుట్ల లీడ్ రోల్ చేశారు. పులి పూజా ఫిమేల్ లీడ్‌గా నటించారు. రాజేష్ మిట్టపల్లి, రవి వడపల్లి కలిసి దర్శకత్వం వహించగా, సంగీత దర్శకుడు రమేష్ తుడిమిల్ల సాంగ్ కంపోజ్ చేశారు. నరేష్ పుట్టల నిర్మించారు. ఇదొక లవ్ ఫెయిల్యూర్ సాంగ్.. ఒకరిని ప్రేమించి, మరొకరిని పెళ్లాడే కాన్సెప్ట్ తో ఈ పాటను రూపొందించారు. ఇది సంగీత ప్రియులను కచ్చితంగా ఆకట్టుకుంటుందని మేకర్స్ చెప్పారు.
నటీనటులు : శ్యాం కుమార్. రావుట్ల పులి పూజా
రచయిత : వి.వి.విశ్వేష్ వర్మ
మ్యూజిక్ : రమేష్ తుడిమిల్ల
సింగర్ : హనుమంత్ యాదవ్
కెమెరా మెన్ : కిషన్, లక్కీ
ఎడిటర్ : నిరంజన్, సతీష్
దర్శకత్వం : రాజేష్ మిట్టపల్లి, రవి వడపల్లి
నిర్మాత : నరేష్ పుట్టల
పీఆర్‌వో : జీకే మీడియా
మిస్టిక్ థ్రిల్లర్ ఫ్రాంచైజీలో ప్రేక్షకులను ఆకట్టుకున్న 'పొలిమేర' సిరీస్ నుంచి మూడో చిత్రంగా వస్తున్న 'పొలిమేర 3'పై అంచనాలు పెరుగుతున్నాయి.…
మంచు లక్ష్మిని అర్థం చేసుకున్నామనుకునేలోపే, ఆమె మరో కొత్త ఆశ్చర్యానికి తెరతీస్తారు! ఇటీవల ఆమె సోషల్ మీడియాలో కొన్ని ఆసక్తికరమైన…
పి.ఎస్.జె. ఫిలిమ్స్ అండ్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో సురేందర్ చాచా తెరకెక్కించిన చిత్రం…
సుమ చిత్ర ఆర్ట్స్ సమర్పణలో సుమయా రెడ్డి స్వీయ నిర్మాణంలో నటిస్తున్న రెండో ప్రాజెక్ట్‌ని త్వరలోనే ప్రకటించనున్నారు. ‘డియర్ ఉమ’…
‘శంబాల’ బ్లాక్ బస్టర్ తర్వాత ఆది సాయికుమార్ డిఫరెంట్ సబ్జెక్ట్‌లతో ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే ‘ఈగో రాజా’…
రేసన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపి కృష్ణ జయంతి నిర్మించిన ‘రాయవలస’ చిత్రానికి రాధిక జయంతి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో…