ప్రస్తుతం మన తెలుగు సినిమా ఖ్యాతి, తెలుగు హీరోల స్థాయి ప్రపంచ దేశాలకు విస్తరించిన సంగతి తెలిసిందే. ఇక మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తన దేవర సినిమాను జపాన్‌లో భారీ ఎత్తున ప్రమోట్ చేశారు. ఆర్ఆర్ఆర్ తరువాత అక్కడ మ్యాన్ ఆఫ్ మాసెస్‌కు విపరీతమైన క్రేజ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. అందుకే అక్కడి అభిమానుల్ని అలరించేందుకు దేవరను జపాన్‌లో రిలీజ్ చేశారు. ఈ క్రమంలో అక్కడి మీడియా, అభిమానులతో ఎన్టీఆర్ ముచ్చటించారు.
ఈ క్రమంలో ఓ అభిమాని ఎన్టీఆర్ వద్దకు వచ్చి తెలుగులో మాట్లాడారు. జపాన్‌లో ఇలా తెలుగు మాట్లాడటం ఏంటి? అని ఎన్టీఆర్ ఆశ్చర్యపోయారు. దీంతో ఆ ఎమోషనల్ వీడియోని పంచుకున్నారు. ఆర్ఆర్ఆర్ చూసిన తర్వాత ఒక జపనీస్ అభిమాని తెలుగు నేర్చుకోవడం ప్రారంభించారట. ఆ అభిమాని గురించి చెబుతూ ఎన్టీఆర్ ఓ పోస్ట్ వేశారు. సినిమా అనేది భాషా సరిహద్దుల్ని చెరిపేస్తుందని, అందరినీ ఏకం చేస్తుందని చెప్పడానికి ఇదొక ఉదాహరణ అన్నట్టుగా చెప్పుకొచ్చారు.
‘నేను జపాన్‌కి వచ్చినప్పుడల్లా అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి. అయితే ఈ సారి మాత్రం కాస్త భిన్నమైన అనుభూతి కలిగింది. ఒక జపనీస్ అభిమాని ఆర్ఆర్ఆర్ చూసిన తర్వాత తాను తెలుగు నేర్చుకున్నానని చెప్పడం విని నిజంగా నన్ను కదిలించింది. సంస్కృతుల మధ్య వారధిగా ఉండటానికి సినిమా అనేది ఓ శక్తిలా ఉంటుందని చాటి చెప్పారు. సినిమా, భాషల ప్రేమికుడిగా ఒక అభిమానిని భాష నేర్చుకోవడానికి ఆ సినిమా ప్రోత్సహించింది అని చెప్పడం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇలాంటి వాటి కోసమే మన ఇండియన్ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామ’ని ఎన్టీఆర్ అన్నారు.
నితిన్ హీరోగా వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై రూపొందనున్న యూనిక్ సైఫై ఎంటర్‌టైనర్.. వైవిధ్యమైన సినిమాలు, పాత్రలతో…
తానా సాహిత్య విభాగం - తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో మరియు అనకాపల్లి సిరివెన్నెల…
కేవలం ఐదు రోజుల్లో రూ.100.2 కోట్ల గ్రాస్ సాధించిన 'అనగనగా ఒక రాజు'నవీన్ పొలిశెట్టి కెరీర్‌లోనే అతిపెద్ద విజయంయూఎస్‌లో హ్యాట్రిక్…
వైవిధ్యమైన సినిమాలు, పాత్రలతో బహు భాషా నటుడిగా తనదైన గుర్తింపు సంపాదించుకున్న స్టార్ దుల్కర్ సల్మాన్. కంటెంట్ బేస్డ్ మూవీస్…
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…