“మామా మశ్చీంద్ర” నుండి దుర్గాలుక్ విడుదల

నైట్రో స్టార్ సుధీర్ బాబు కథానాయకుడిగా నటుడు దర్శకుడు హర్షవర్ధన్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి పై సునీల్ నారంగ్,  పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్న చిత్రం మామా మశ్చీంద్ర .ఈ చిత్రంలో  హీరో ని మూడు విభిన్న షేడ్స్లో చూపించ బోతున్నారు హర్షవర్ధన్ . సుధీర్ బాబు దుర్గ, పరశురామ్, డీజే మూడు పాత్ర లలో కనిపిస్తారు. మేకర్స్ ఈరోజు దుర్గ లుక్ విడుదల చేసారు.

పొడవాటి జుట్టు , గడ్డంతో సుధీర్ బాబు ఇక్కడ కొంచెం లావు గా కనిపిస్తున్నాడు. ఈ పాత్ర ఊబకాయంతో ఉండే వ్యక్తి గా ఉండబోతుంది అని తెలుస్తుంది. కారు బానెట్ పై కూర్చున్న సుధీర్ బాబు బంగారు గొలుసు వాచ్, ట్రెండీ అవుట్ ఫిట్ ధరించి విలనీ స్మైల్ తో కనిపించాడు. నైట్రో స్టార్ మేక్ఓవర్ ఆశ్చర్యం కలిగించే లాగా ఉంది. సుధీర్ బాబు ఎప్పుడూ విభిన్నమైన పాత్రలు చేయడానికి ప్రయత్నిస్తాడు.ఈ పాత్ర పూర్తిగా విలక్షణమైనదిగా కనిపిస్తుంది.

మామా మశీంద్ర అనే టైటిల్ నైట్రో స్టార్ సుధీర్ బాబు యొక్క మల్టీ షేడ్ క్యారెక్టర్  సూచిస్తుంది. పరశురామ్ లుక్ ని ఈ నెల 4న, డీజే లుక్ ని 7న విడుదల చేయనున్నారు.

సృష్టి సెల్యులాయిడ్ కి చెందిన సోనాలి నారంగ్, సృష్టి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో ద్విభాషా చిత్రంగా రూపొందుతోంది.

వినూత్నమైన కాన్సెప్ట్ తో యాక్షన్ ఎంటర్ టైనర్గా రూపొందించబడిన ఈ చిత్రంలో కొంతమంది ప్రముఖ నటీనటులు నటించారు, ఇందులో అగ్రశ్రేణి సాంకేతిక బృందం పని చేస్తోంది.

చైతన్ భరద్వాజ్ సౌండ్ ట్రాక్ లను అందించగా, పిజి విందా సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. రాజీవ్ ఆర్ట్ డైరెక్టర్.

తారాగణం: సుధీర్ బాబు

సాంకేతిక సిబ్బంది:
రచయిత, దర్శకుడు: హర్షవర్ధన్
నిర్మాతలు: సునీల్ నారంగ్ మరియు పుస్కుర్ రామ్ మోహన్ రావు
ప్రెజెంటర్: సోనాలి నారంగ్, సృష్టి (సృష్టి సెల్యులాయిడ్)
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP
సంగీత దర్శకుడు: చైతన్ భరద్వాజ్
DOP: PG విందా
ఆర్ట్ డైరెక్టర్: రాజీవ్
PRO: వంశీ-శేఖర్

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

13 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

13 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

13 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago