నైట్రో స్టార్ సుధీర్ బాబు కథానాయకుడిగా నటుడు దర్శకుడు హర్షవర్ధన్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్న చిత్రం మామా మశ్చీంద్ర .ఈ చిత్రంలో హీరో ని మూడు విభిన్న షేడ్స్లో చూపించ బోతున్నారు హర్షవర్ధన్ . సుధీర్ బాబు దుర్గ, పరశురామ్, డీజే మూడు పాత్ర లలో కనిపిస్తారు. మేకర్స్ ఈరోజు దుర్గ లుక్ విడుదల చేసారు.
పొడవాటి జుట్టు , గడ్డంతో సుధీర్ బాబు ఇక్కడ కొంచెం లావు గా కనిపిస్తున్నాడు. ఈ పాత్ర ఊబకాయంతో ఉండే వ్యక్తి గా ఉండబోతుంది అని తెలుస్తుంది. కారు బానెట్ పై కూర్చున్న సుధీర్ బాబు బంగారు గొలుసు వాచ్, ట్రెండీ అవుట్ ఫిట్ ధరించి విలనీ స్మైల్ తో కనిపించాడు. నైట్రో స్టార్ మేక్ఓవర్ ఆశ్చర్యం కలిగించే లాగా ఉంది. సుధీర్ బాబు ఎప్పుడూ విభిన్నమైన పాత్రలు చేయడానికి ప్రయత్నిస్తాడు.ఈ పాత్ర పూర్తిగా విలక్షణమైనదిగా కనిపిస్తుంది.
మామా మశీంద్ర అనే టైటిల్ నైట్రో స్టార్ సుధీర్ బాబు యొక్క మల్టీ షేడ్ క్యారెక్టర్ సూచిస్తుంది. పరశురామ్ లుక్ ని ఈ నెల 4న, డీజే లుక్ ని 7న విడుదల చేయనున్నారు.
సృష్టి సెల్యులాయిడ్ కి చెందిన సోనాలి నారంగ్, సృష్టి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో ద్విభాషా చిత్రంగా రూపొందుతోంది.
వినూత్నమైన కాన్సెప్ట్ తో యాక్షన్ ఎంటర్ టైనర్గా రూపొందించబడిన ఈ చిత్రంలో కొంతమంది ప్రముఖ నటీనటులు నటించారు, ఇందులో అగ్రశ్రేణి సాంకేతిక బృందం పని చేస్తోంది.
చైతన్ భరద్వాజ్ సౌండ్ ట్రాక్ లను అందించగా, పిజి విందా సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. రాజీవ్ ఆర్ట్ డైరెక్టర్.
తారాగణం: సుధీర్ బాబు
సాంకేతిక సిబ్బంది:
రచయిత, దర్శకుడు: హర్షవర్ధన్
నిర్మాతలు: సునీల్ నారంగ్ మరియు పుస్కుర్ రామ్ మోహన్ రావు
ప్రెజెంటర్: సోనాలి నారంగ్, సృష్టి (సృష్టి సెల్యులాయిడ్)
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP
సంగీత దర్శకుడు: చైతన్ భరద్వాజ్
DOP: PG విందా
ఆర్ట్ డైరెక్టర్: రాజీవ్
PRO: వంశీ-శేఖర్
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…
భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…
సంగీత దర్శకుడు, నటుడు, సింగర్ రఘు కుంచె టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…
లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…