టాలీవుడ్

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు విడుదల చేసిన సుకృతి వేణి ‘గాంధీ తాత చెట్టు’ ట్రైలర్‌!

దర్శకుడిగా ప్రపంచస్థాయి గుర్తింపు సాధించిన ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ బండ్రెడ్డి తనయురాలు సుకృతి వేణి బండ్రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గాంధీ తాత చెట్టు’. పద్మావతి మల్లాది దర్శకురాలు. మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌, గోపీ టాకీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి శ్రీమతి తబితా సుకుమార్‌ సమర్పకురాలు. నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌, శేష సింధురావు నిర్మాతలు. ఇప్పటికే ఈ చిత్రం పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శింపబడి ఎన్నో అవార్డులు కైవసం చేసుకుంది. ఉత్తమ బాల నటిగా సుకృతి వేణి కూడా పురస్కారం పొందారు. జనవరి 24న చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్‌ రిలీజ్‌ చేస్తున్నారు. కాగా ఈ చిత్రం ట్రైలర్‌ను సూపర్‌స్టార్‌, ప్రిన్స్‌ మహేష్‌బాబు తన సోషల్‌ మీడియా ద్వారా విడుదల చేశారు.

” గాంధీ తాత చెట్టు ట్రైలర్‌ విడుదల చేయడం సంతోషంగా ఉంది. అందరి మనసులను హత్తుకునే సినిమాలా ఇది అనిపిస్తుంది. సుకృతికి మరియు ఈ సినిమా టీమ్‌ అందరికి నా అభినందనలు” అంటూ ప్రిన్స్‌ మహేష్‌బాబు తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు.
ట్రైలర్‌ చూస్తుంటే ” గాంధీ పేరు పెట్టుకున్న ఓ అమ్మాయి.. ఆయన బాటను, సిద్దాంతాలను అనుసరిస్తూ, తన తాతకు ఇష్టమైన చెట్టును, తన ఊరును ఎలా రక్షించుకుంది అనే కథాంశంతో సినిమా తెరకెక్కినట్లుగా తెలుస్తుంది. గాంధీగా సుకుమార్‌, కుమార్తె సుకృతి వేణి ఈ సినిమాలో నటించారు. ట్రైలర్‌ అందరి హృదయాలకు హత్తుకునే విధంగా ఉంది” అనిపిస్తుంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ విడుదల చేసిన సూపర్‌స్టార్‌ మహేష్‌బాబుకు నిర్మాతలు, దర్శకురాలు, చిత్ర సమర్పకురాలు తబితా సుకుమార్‌ తమ కృతజ్ఞతలు తెలియజేస్తారు.

ఈ సందర్భంగా దర్శకురాలు పద్మావతి మల్లాది మాట్లాడుతూ ” ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడా చూసిన ద్వేషాలు, అసూయ..ఇలా ఓ నెగెటివ్‌ వైబ్రేషన్స్‌ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సోషల్‌ మీడియాలో ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం.. గొడవలు ఇలా ఎన్నో ఘర్షణలు కనిపిస్తున్నాయి.ఇక సాధారణంగా మనకు అహింస అనగానే మనకు మన జాతిపిత మహాత్మగాంధీ గుర్తొస్తారు. ఇలాంటి తరుణంలో గాంధీ గారి సిద్ధాంతాలు అభిమానిస్తూ, ఆయన బాటను అనుసరించే ఓ పదమూడేళ్ల అమ్మాయి తను పుట్టిన ఊరిని కాపాడుకోవడం కోసం ఏం చేసింది? అనేది ఆసక్తికరంగా ఉంటుంది. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు చూపించాల్సిన సినిమా. అందరి హృదయాలను హత్తుకునే భావోద్వేగాలు ఈ చిత్రంలో ఉంటాయి. చిత్రం చూసిన ప్రతి ఒక్కరూ ఓ అనీర్వచనీయమైన అనుభూతికి లోనవుతారు. తప్పకుండా చిత్రం అందరికి నచ్చుతుందనే నమ్మకం వుంది.

ఈ నెల 24న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’ అన్నారు. సుకృతి వేణి, ఆనంద్‌ చక్రపాణి, రఘురామ్‌, భాను ప్రకాష్‌, నేహాల్‌ ఆనంద్‌ కుంకుమ, రాగ్‌ మయూర్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: రీ, సినిమాటోగ్రఫీ: శ్రీజిత్‌ చెర్వుపల్లి, విశ్వ దేవబత్తుల, ఎడిటింగ్‌: హరిశంకర్‌ టీఎన్‌, పాటలు: సుద్దాల అశోక్‌ తేజ, కాసర్ల శ్యామ్‌, విశ్వ, ప్రొడక్షన్‌ డిజైన్‌ వి.నాని పాండు, కో పొడ్యూసర్‌: అశోక్‌ బండ్రెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: అభినయ్‌ చిలుకమర్రి, రచన-దర్శకత్వం : పద్మావతి మల్లాది

Tfja Team

Recent Posts

Action and adventure Hollywood film “Agent Guy 001” Trailer Released

The Hollywood dubbed film 'Agent Guy 001' Directed by David Andersson, produced by Erik Andersson,…

2 hours ago

తెలుగులో ఘనంగా హాలీవుడ్ యాక్షన్ , అడ్వెంచర్ చిత్రం “ఏజెంట్ గై 001” ట్రైలర్ విడుదల

డేవిడ్ ఆండర్సన్ దర్శకత్వంలో ఎరిక్ ఆండర్సన్ నిర్మాతగా బాల్టాజర్ ప్లాటో, డేవిడ్ ఆండర్సన్ స్క్రీన్ ప్లే వహిస్తూ ప్రేక్షకుల ముందుకు…

2 hours ago

ప్రముఖ నటులు మురళీమోహన్ చేతుల మీదుగా “కరణం గారి వీధి” సినిమా పోస్టర్ విడుదల

కిట్టు తాటికొండ, కష్మీరా,రోహిత్, వైశాలి, సునీల్ రావినూతల, శ్రీ గోపి చంద్ కొండ నటిస్తున్న సినిమా "కరణం గారి వీధి".…

2 hours ago

బ్రహ్మాండ చిత్రాన్ని ఫస్ట్ లుక్ పోస్టర్ ఆవిష్కరించిన “అఖండ” ప్రొడ్యూసర్ మిర్యాల రవీందర్ రెడ్డి

మమత ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఆమని ప్రధాన పాత్రలోశ్రీమతి మమత సమర్పించు చిత్రం 'బ్రహ్మాండ'చిత్ర సహనిర్మాత శ్రీమతి దాసరి మమత…

2 hours ago

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ లాంచ్ చేసిన సోల్ ఫుల్ లవ్ మెలోడీ ‘అల్లో నేరేడల్లో పిల్లా’ సాంగ్

వెర్సటైల్ యాక్టర్ బ్రహ్మాజీ లీడ్ రోల్ లో ఒకరిగా ఆమని, బలగం సుధాకర్ రెడ్డి, ధన్య బాలకృష్ణ, మణి ఏగుర్ల,…

22 hours ago

సూపర్ హిట్ సాంగ్స్ తో సంతృప్తికరంగా నా కెరీర్ సాగుతోంది – కేకే

గీత రచయితగా తన ప్రస్థానం చాలా సంతృప్తికరంగా సాగుతోందని అన్నారు ప్రముఖ లిరిసిస్ట్ కేకే(కృష్ణకాంత్). గతేడాది రాసిన పాటలన్నీ ఛాట్…

23 hours ago