మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాను ఎంజాయ్ చేశామంటూ మహేశ్ బాబు, రవితేజ ప్రశంసలు

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాను ఎంజాయ్ చేశామంటూ సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాస్ మహరాజ్ రవితేజ ప్రశంసలు

యంగ్ టాలెంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి జంటగా నటించి రీసెంట్ గా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకొచ్చింది క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. ఈ సినిమాకు ఆడియెన్స్ తో పాటు సెలబ్రిటీల అప్రిషియేషన్స్ దక్కుతున్నాయి. ఈ సినిమా ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, స్టార్ డైరెక్టర్స్ మారుతి, వంశీ పైడిపల్లి, స్టార్ హీరోయిన్ సమంత మెప్పుపొందగా..తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాస్ మహరాజ్ రవితేజ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాపై ప్రశంసలు కురిపించారు.

మహేశ్ బాబు స్పందిస్తూ – ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాను మా ఫ్యామిలీతో కలిసి ఆద్యంతం ఎంజాయ్ చేశాను. కంప్లీట్ ఎంటర్ టైనర్ మూవీ ఇది. నవీన్ పోలిశెట్టి తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. అనుష్క ఎప్పటిలాగే బ్రిలియంట్ గా నటించింది. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాతో సక్సెస్ అందుకున్న దర్శకుడు పి.మహేశ్ బాబు, యూవీ క్రియేషన్స్, మిగతా టీమ్ మెంబర్స్ అందరికీ కంగ్రాట్స్.అని ట్వీట్ లో పేర్కొన్నారు.

రవితేజ ట్వీట్ చేస్తూ – ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాను చూస్తూ బాగా ఎంజాయ్ చేశాను. నవీన్ పోలిశెట్టి మరోసారి అద్భుతమైన ఫర్ పార్మెన్స్ ఇచ్చాడు. అతని హ్యూమర్ టైమింగ్ గొప్పగా అనిపించింది. అనుష్క ఎప్పటిలాగే అలరించింది. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ టీమ్ అందరికీ బిగ్ కంగ్రాట్స్ చెబుతున్నా. అని పేర్కొన్నారు.

మహేశ్ బాబు, రవితేజ స్పందనకు రిప్లై ఇచ్చారు హీరో నవీన్ పోలిశెట్టి. మహేశ్ ప్రశంసలకు నవీన్ స్పందిస్తూ – మీకు మా సినిమా నచ్చడం చాలా హ్యాపీగా ఉంది. మూన్ మీద ఉన్న ఫీలింగ్ కలుగుతోంది. ఈ సంతోషంలో మా టీమ్ లో ఎవరం నిద్రపోము. గుంటూరు కారం సినిమా కోసం ఎదురుచూస్తున్నాం. అని అన్నారు.

రవితేజ ట్వీట్ కు నవీన్ రిప్లై ఇస్తూ – థాంక్యూ సార్. మిమ్మల్ని గతంలో కలిసినప్పుడు మీరు ఇచ్చిన సూచనలు మర్చిపోలేను. ఎల్లప్పుడూ మీ పర్ ఫార్మెన్స్, ఎనర్జీతో మమ్మల్ని ఇన్ స్పైర్ చేస్తున్నందుకు థాంక్స్. మీకు మా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా నచ్చడం సంతోషంగా ఉంది. అని అన్నారు.

రీసెంట్ గా రిలీజైన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుని సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ పాజిటివ్ టాక్ కు తగినట్లే మంచి వసూళ్లు దక్కించుకుంటోంది. యూఎస్ లో ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ వన్ మిలియన్ మైల్ స్టోన్ వైపు దూసుకెళ్తోంది. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ కథతో ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై వంశీ, ప్ర‌మోద్‌ నిర్మాణంలో దర్శకుడు మ‌హేష్ బాబు.పి తెరకెక్కించారు

Tfja Team

Recent Posts

‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ ,క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న సినిమా విడుదల

ల‌వ్‌, ఎమోష‌న్, డ్రామా వంటి క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తోపాటు చ‌క్క‌టి సోష‌ల్ మెసేజ్‌తో రూపొందిన చిత్రం ‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ క్రిస్మస్…

7 days ago

అవినాష్ తిరువీధుల “వానర” సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘అదరహో..’ రిలీజ్, ఈ నెల 26న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…

2 weeks ago

‘దండోరా’ చిత్రం అద్భుతంగా ఉంటుంది.. మంచి అనుభూతితో థియేటర్ నుంచి బయటకు వస్తారు – దర్శకుడు మురళీకాంత్

వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాల‌ను నిర్మించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన‌ లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్…

2 weeks ago

డిసెంబర్ 19న రాబోతోన్న ‘జిన్’ మూవీ పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి

సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్‌ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…

2 weeks ago

‘ఎర్రచీర’పక్కాగా ఫిబ్రవరి 6న విడుదల

బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…

2 weeks ago

ఫిబ్రవరి 13న ‘ఫంకీ’.. వాలెంటైన్స్ వీకెండ్‌కు ఫుల్ ఫన్ గ్యారంటీ!

వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…

2 weeks ago