హీరో శివకార్తికేయన్ ,”మండేలా” ఫేమ్ మడోన్ అశ్విన్ దర్శకత్వంలో చేస్తున్న ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మహావీరుడు’. శాంతి టాకీస్ పై అరుణ్ విశ్వ నిర్మిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తుంది. భరత్ శంకర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. మేకర్స్ రెండవ సింగిల్ ‘బంగారుపేటలోన’ విడుదల చేసారు.
బంగారుపేటలోన పాట బ్యూటీఫుల్ కంపోజిషన్ తో ఇన్స్టెంట్ గా కనెక్ట్ అవుతుంది. భరత్ ఈ పాటకు హై బీట్ లను అందించి అదితి శంకర్ తో కలిసి ఎనర్జిటిక్ గా ఆలపించాడు. ఈ పాట వెంటనే ఉత్సాహాన్ని పెంచుతుంది. ప్రోగ్రామింగ్ చాలా బాగుంది. ఈ పాటలో శివకార్తికేయన్ ,అదితి బ్యూటిఫుల్ కెమిస్ట్రీని పంచుకున్నారు. రెహమాన్ రాసిన చక్కని సాహిత్యం మరో పెద్ద హైలైట్.
ఈ చిత్రానికి ఫిలోమిన్ రాజ్ ఎడిటర్ గా, విధు అయ్యన్న కెమెరామెన్ గా పని చేస్తున్నారు. ఈ చిత్రంలో యోగి బాబు, సునీల్, మిస్కిన్, సరిత వంటి ప్రముఖ తారాగణం వుంది.
ప్రముఖ నిర్మాణ, పంపిణీ సంస్థ ఏషియన్ సినిమాస్ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా రిలీజ్ చేస్తుంది. జూలై 14న మహావీరుడు విడుదల కానుంది.
తారాగణం: శివకార్తికేయన్, యోగి బాబు, సునీల్, మిస్కిన్, సరిత తదితరులు.
సాంకేతిక విభాగం:
రచన & దర్శకత్వం – మడోన్ అశ్విన్
నిర్మాత – అరుణ్ విశ్వ
బ్యానర్ – శాంతి టాకీస్
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ – విధు అయ్యన్న
సంగీతం – భరత్ శంకర్
ఎడిటర్ – ఫిలోమిన్ రాజ్
ఆర్ట్ డైరెక్టర్ – అరుణ్ వజ్రమోను, కుమార్ గంగప్పన్
లవ్, ఎమోషన్, డ్రామా వంటి కమర్షియల్ ఎలిమెంట్స్తోపాటు చక్కటి సోషల్ మెసేజ్తో రూపొందిన చిత్రం ‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ క్రిస్మస్…
అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…
వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్…
సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…
బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…
వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…