ఆది సాయికుమార్ చేతుల మీదుగా ‘నాతో నేను’ సాంగ్ లాంచ్


సాయికుమార్‌, శ్రీనివాస్‌ సాయి, ఆదిత్య ఓం, దీపాలి రాజపుత్‌, ఐశ్వర్య రాజీవ్‌ కనకాల కీలక పాత్రధారులుగా శాంతి కుమార్‌ తూర్లపాటి (జబర్దస్ట్‌ ఫేం) దర్శకత్వంలో ప్రశాంత్‌ టంగుటూరి నిర్మిస్తున్న చిత్రం ‘నాతో నేను’. ఈ చిత్రం ‘ఓసిని వయ్యారి రామ చిలుక’ అంటూ సాగే లిరికల్ వీడియోను ఆది సాయికుమార్ విడుదల చేసారు.

ఆది మాట్లాడుతూ ‘‘ఈ మధ్యన నాన్న కథల ఎంపికలో ఆచితూచి అడుగేస్తున్నారు. ఇందులో అయన కీలక పాత్ర పోషిస్తున్నారు. ఫీల్ గుడ్ సినిమా అని, తన పాత్ర కొత్తగా ఉంటుందని నాన్న చెప్పారు. మంచి కథ ఉంటే తెలుగు ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. తాజాగా విడుదల చేసిన పాట నాకు బాగా నచ్చింది. లిరిక్స్ అర్థవంతంగా ఉన్నాయి. సినిమా కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నా” అని అన్నారు.

‘‘జబర్దస్త్‌ కమెడీయన్‌గా ప్రేక్షకులు నన్ను ఆదరించారు. ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేసి దర్శకుడిగా తొలి ప్రయత్నం చేశాను. కథ, మాట, పాటలు నేనే రాసుకుని చక్కని నిర్మాతల సహకారంతో ఈ సినిమా పూర్తి చేశాం. బిజీలో కూడా ఆది గారు మా సాంగ్ రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. ఇందులో సాయి కుమార్ పాత్ర కొత్తగా ఉంటుంది. కొన్ని సన్నివేశాల్లో అయన పాత్ర ఏడిపించేంత ఎమోషనల్ గ ఉంటుంది” అని దర్శకుడు చెప్పారు.

“మంచి కథతో తొలి ప్రయత్నం చేసాం. సాయి కుమార్ గారు కొత్తగా కనిపిస్తారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని నిర్మాత చెప్పారు.

నటీనటులు:
సమీర్, సి.వి.ఎల్ నరసింహారావు, గౌతమ్ రాజు ఎమ్మెస్ చౌదరి, భద్రం, సుమన్ శెట్టి తదితరులు

సాంకేతిక నిపుణులు:
కెమెరా: యూ’హ్. మురళి మోహన్ రెడ్డి, సంగీతం: సత్య కశ్యప్, బ్యాక్గ్రౌండ్: ఎస్ చిన్న, ఎడిటింగ్: నందమూరి హరి, ఆర్ట్: పెద్దిరాజు అడ్డాల, పాటలు: రామజోగయ్య శాస్త్రి, శాంతికుమార్, కొరియోగ్రాఫర్: భాను, చంద్ర కిరణ్, ఫైట్స్: నందు, బ్యానర్:శ్రీ భావనేశ్ ప్రొడక్షన్స్, సమర్పణ: ఎల్లలు బాబు టంగుటూరి, పీఆర్వో: మధు విఆర్

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

11 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

11 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

11 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago