అనిరుధ్ సంగీతం అందిస్తున్న ‘మ్యాజిక్’ చిత్రం నుంచి మొదటి గీతం విడుదల

ఒక వైపు భారీ సినిమాలను రూపొందిస్తూనే, మరోవైపు యువ ప్రతిభను ప్రోత్సహిస్తూ వైవిధ్యభరిత చిత్రాలను అందిస్తూ ఘన విజయాలను సొంతం చేసుకుంటోంది ప్రముఖ నిర్మాత సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్. ప్రస్తుతం ‘జెర్సీ’ వంటి క్లాసిక్ చిత్రాన్ని అందించిన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ‘మ్యాజిక్‌’ అనే సినిమాను సితార సంస్థ రూపొందిస్తోంది. ఈ మ్యూజికల్ డ్రామాలో పలువురు యువ నటీనటులు నటిస్తున్నారు.

‘మ్యాజిక్‌’ చిత్రానికి సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ స్వరకర్తగా వ్యవహరిస్తున్నారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం నుంచి ‘డోంట్ నో వై’ అనే మొదటి గీతాన్ని విడుదల చేశారు. ప్రేమికుల దినోత్సవం కానుకగా అనిరుధ్ పాట విడుదలై ఆకట్టుకోవడం కొన్ని సంవత్సరాలుగా సాంప్రదాయంగా మారిపోయింది. ఇప్పుడు ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ, ‘డోంట్ నో వై’ పాటతో మరోసారి కట్టిపడేశారు అనిరుధ్.

‘మ్యాజిక్‌’ అనే చిత్ర టైటిల్ కి తగ్గట్టుగానే తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశారు అనిరుధ్. ఆ సంగీతానికి తగ్గట్టుగానే, ఆకట్టుకునే విజువల్స్ తో ‘డోంట్ నో వై’ మ్యూజిక్ వీడియోను ప్రేమ, భావోద్వేగాల మేళవింపుతో అద్భుతంగా మలిచారు.

అనిరుధ్ రవిచందర్, ఐశ్వర్య సురేష్ కలిసి తెలుగు, తమిళ భాష్లలో ఈ గీతాన్ని ఆలపించారు. అనిరుధ్ తన సంగీతంతో మాత్రం కాకుండా, గాత్రంతోనూ పాటకు మరింత అందం తీసుకొచ్చారు. ఈ పాట ఒకసారి వినగానే మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించేలా ఉంది. ఈ గీతానికి తెలుగులో కృష్ణకాంత్ సాహిత్యం అందించగా, తమిళంలో విఘ్నేష్ శివన్ సాహిత్యం అందించారు. వారి సాహిత్యం పాట విలువను మరింత పెంచింది.

తమ కళాశాల ఫెస్ట్ కోసం సొంతంగా ఒక పాటను స్వరపరచడానికి నలుగురు యువకులు చేసే ప్రయత్నం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. వారి ప్రయాణం భావోద్వేగభరితంగా మరియు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ప్రతిభగల దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈ ‘మ్యాజిక్’ చిత్రంతో ప్రేక్షకులకు ఓ సరికొత్త అనుభూతిని ఇవ్వబోతున్నారు.

‘మ్యాజిక్’ చిత్రం కోసం ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. ప్రముఖ ఛాయాగ్రాహకుడు గిరీష్ గంగాధరన్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.

శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

చిత్రం: మ్యాజిక్
గీతం: డోంట్ నో వై
సంగీతం: అనిరుధ్ రవిచందర్
సాహిత్యం: కృష్ణ కాంత్
గానం: అనిరుధ్ రవిచందర్, ఐశ్వర్య సురేష్ బింద్రా

తారాగణం: సారా అర్జున్, అన్మోల్ కజాని, ఆకాష్ శ్రీనివాస్, సిద్దార్థ్ తణుకు

సాంకేతిక బృందం:
రచన, దర్శకత్వం: గౌతమ్ తిన్ననూరి
నిర్మాతలు: సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య
ఛాయాగ్రహణం: గిరీష్ గంగాధరన్
కూర్పు: నవీన్ నూలి
కళా దర్శకుడు: అవినాష్ కొల్లా
కాస్ట్యూమ్ డిజైనర్: నీరజ కోన
సాంగ్ కొరియోగ్రాఫర్స్: గణేష్ ఆచార్య, శేఖర్ వి.జె, విజయ్ బిన్నీ & అప్సర్
ప్రోమో డీఓపీ: అనిరుధ్ గణపతి
ప్రోమో కొరియోగ్రాఫర్: అనూష విశ్వనాథన్
బ్యానర్స్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్
సమర్పణ: శ్రీకర స్టూడియోస్

Tfja Team

Recent Posts

నేడే ‘పర్ణశాల’ నుంచి ‘జిమ్ జిమ్ తార’ పూర్తి పాట విడుదల*

▪️ ఆదిత్య మ్యూజిక్ ద్వారా అధికారికంగా విడుదల ▪️ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌.. సెలబ్రిటీలనూ ఆకట్టుకుంటున్న సాంగ్‌ హైదరాబాద్:…

41 minutes ago

పవన్ కళ్యాణ్‌కు అల్లు అరవింద్ అభినందనలు – సినీ ప్రయాణంపై ప్రశంసలు.

సినీ రంగంలో పవన్ కళ్యాణ్ 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఆయనకు హృదయపూర్వక…

47 minutes ago

దీపావళి సందర్భంగా నవంబర్ 6న రానున్న విజయ్ ఆంటోని ‘నాన్న కుట్టి’

డిఫరెంట్ కాన్సెప్ట్, కంటెంట్ బేస్డ్ చిత్రాలతో ఆకట్టుకునే విజయ్ ఆంటోని ప్రస్తుతం ‘నాన్న కుట్టి’ అంటూ ఆడియెన్స్ ముందుకు రానున్నారు.…

1 day ago

షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద ‘శంబాల’ ఫేమ్ యుగంధర్ ముని తెరకెక్కిస్తున్న ‘కరికాల’ చిత్రంలో సందీప్ కిషన్‌కి జంటగా నటించనున్న కేథరిన్ థ్రెసా అలెగ్జాండర్.

‘శంబాల’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత నిర్మాతలు మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు దర్శకుడు యుగంధర్ ముని కలిసి మళ్లీ…

2 days ago

‘అ’ మిస్టిరీయస్‌ ఇంట్రెస్టింగ్‌ ఇన్విస్టిగేషన్‌ థ్రిల్లర్‌గా అందర్ని థ్రిల్ల్‌ చేస్తుంది: హీరో రాహుల్‌ విజయ్‌.

రాహుల్ విజయ్, ఆర్చన అయ్యర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న 'అ' (‘AH) ’ సినిమాపై ఇప్పటికే మంచి బజ్ నెలకొంది.…

2 days ago

ఘనంగా “చకోర – Lunar Love Bird” సినిమా స్పెషల్ ప్రివ్యూ, ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్

ఈ నెల 9న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతున్న "చకోర – Lunar Love Bird" మూవీ High Joy…

3 days ago