Ramarao On Duty Teaser | Ravi Teja, Divyansha , Rajisha | Sarath Mandava | Sudhakar Cherukuri

Presenting you the Teaser of Ramarao on Duty Movie written and directed by Sarath Mandava. Produced by Sri Lakshmi Venkateswara Cinemas and RT Team Works, Starring Ravi Teja, Divyansha Kaushik and Rajisha Vijayan.

మా రహస్యం ఇదం జగత్‌ అందరికి మంచి థియేట్రికల్‌ ఎక్స్‌ పీరియన్స్‌ ఇస్తుందిమానస వీణ, స్రవంతి ప్రత్తిపాటి

Must Read

ఇటీవల తమ ప్రమోషన్‌ కంటెంట్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న చిత్రం రహస్యం ఇదం జగత్‌. సైన్స్‌ ఫిక్షన్‌ అండ్‌ మైథాలాజికల్‌ థ్రిల్లర్స్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో నేటి తరం ప్రేక్షకులను అలరించే ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వున్నాయని ఈ చిత్రం ప్రమోషన్‌ కంటెంట్‌ చూస్తే అర్థమవుతోంది. మన పురాణాలు, ఇతిహాసాల గురించి… శ్రీచక్రం గురించి చర్చిస్తూ ఓ కొత్త అనుభూతిని కలిగించడానికి రాబోతున్న చిత్రం రహస్యం ఇదం జగత్‌. నవంబరు 8న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. రాకేష్‌ గలేబి, స్రవంతి పత్తిపాటి, మానస వీణ, భార్గవ్‌ గోపీనాథం ముఖ్యతారలుగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని సింగిల్‌ సెల్‌ యూనివర్శ్‌ ప్రొడక్షన్‌ పతాకంపై కోమల్‌ ఆర్‌ భరద్వాజ్‌ దర్శకత్వంలో పద్మ రావినూతుల, హిరణ్య రావినూతుల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్‌కు, ట్రైలర్‌కు అనూహ్యమైన స్పందన వస్తోంది. ఈ ట్రైలర్‌కు ప్రముఖ రచయిత విజయేంద్రపసాద్‌తో పాటు హీరో సుధీర్‌బాబు తదితరలు ప్రశంసలు కురిపించారు. కాగా ఈ చిత్రం కథానాయికలు స్రవంతి ప్రత్తిపాటి, మాసస వీణలు ఆదివారం పాత్రికేయులతో ముచ్చటించారు ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన పలు ఆస్తక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

మానస వీణ మాట్లాడుతూ ” ఫిలిం స్కూల్‌లో యాక్టింగ్‌లో శిక్షణ పొందాను. చాలా ఫార్ట్‌ ఫిలిమ్స్‌, హాలీవుడ్‌ వెబ్‌సీరిస్‌లు చేశాను. యూఎస్‌లోనే నేను వుంటాను. ఇది నా తొలి ఫీచర్‌ ఫిలిం. ఈచిత్రం అడిషన్స్‌ వెళ్లాను. నన్ను అడిషన్‌ చేసిన తరువాత ఈ చిత్రంలో అరుణి ఆచార్య అనే పాత్రకు సెలక్ట్‌ చేశాను. ఈ పాత్ర నాకు పర్సనల్‌గా కూడా ఎంతో నచ్చింది. ముఖ్యంగా ఈ కథ వినగానే సైన్స్‌ ఫిక్షన్‌కు మైథాలజీని కనెక్ట్‌ చేసి టైమ్‌ ట్రావెల్‌ కాన్సెప్ట్‌తో సినిమా నేపథ్యం వుండటం నన్ను ఆకర్షించింది. నాకు చిన్నప్పటి నుండి హారిపోటర్‌ కథలు విన్నాను. రామాయాణ, మహాభారతంలు కూడా చదివాను. ఈ చిత్రంలో నా పాత్ర కోసం నేను రీసెర్చ్‌ కూడా చేశాను.

మా తాత గారు అలీ బాబు నలభై దొంగలు అనే సినిమాను నిర్మించారు. అలా నాకు కాస్త సినిమా నేపథ్యం కూడా వుంది.
దర్శకుడు కోమల్‌ ఆర్‌ భరద్వాజ్‌ సినిమా పట్ల ఎంతో పాషన్‌ వున్న వ్యక్తి. ఈ చిత్రం కోసం ఆయన ఎంతో కష్టపడ్డాడు. తప్పకుండా ఈ చిత్రం కోమల్‌ దర్శకత్వ ప్రతిభను నిరూపిస్తుంది. భవిష్యత్‌లో ఆయన నుండి మరిన్నిమంచి సినిమాలు ఎక్స్‌పెక్ట్‌ చేయవచ్చు. ఈ సినిమా చిత్రీకరణ మొత్తం యూఎస్‌లోనే జరిగింది. చిత్రీకరణ సమయంలో ఎన్నో ఛాలెంజ్‌లను ఫేస్‌ చేశాం.అమెరికాలో ఫుల్‌టైమ్‌ పనిచేస్తూ సినిమా పట్ల పాషన్‌ వున్న యూఎస్‌లో వున్న వాళ్లకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు దర్శకుడికి కృతజ్క్షతలు. అందరం ఎంతో తపనతో చేసిన సినిమా ఇది. తప్పకుండా మీరందరు సినిమాను ఎంజాయ్‌ చేస్తారనే నమ్మకం వుంది’ అన్నారు.

స్రవంతి ప్రత్తిపాటి మాట్లాడుతూ ” రాజమండ్రిలో పుట్టి పెరిగిన నా విద్యాభ్యాసం మాత్రం అమెరికాలో జరిగింది. ప్రస్తుతం అక్కడే జాబ్‌ చేస్తూ వుంటున్నాను. కొన్ని హాలీవుడ్‌ ఫిలింస్‌లో కూడా నటించాను. నాకు ఈ సినిమాలో అవకాశం వచ్చినప్పుడు యూఎస్‌లో తీస్తున్న ఓ తెలుగు సినిమాలో అవకాశం రావడం ఎంతో సర్‌ప్రైజ్‌గా ఫీలయ్యాను. నేను బేసిక్‌గా థియేటర్‌ ఆర్టిస్ట్‌ను. చాలా స్టేజీషోలు నాటకాలు వేశాను. యాక్టింగ్ మెథడ్‌ అనే కోర్సును కూడా చేశాను. ఈ చిత్రంలో నా పాత్ర పేరు అకిరా. తప్పకుండా నా పాత్ర అందరికి నచ్చతుందనే నమ్మకం వుంది. అమెరికాలో జాబ్‌ చేస్తున్న నేను ఈ సినిమా నుండి పూర్తి స్థాయిలో సినిమాలపై శ్రద్ద పెట్టాను. ప్రముఖ రచయిత విజయేంద్ర పసాద్‌ నాకు తాత వరుస అవుతాడు. ఆయన సలహాలు సూచనలు నా కెరీర్‌ కోసం తీసుకున్నాను. ఈ చిత్ర కాన్సెప్ట్‌తో పాటు ట్రైలర్‌ కూడా నచ్చింది. హనుమంతుడు వేరే లోకలకు ట్రావెల్‌ చేసినప్పుడు అసలు జరిగిందేమిటి అనేది కథలో టైమ్‌ ట్రావెల్‌లో ఏం జరిగింది కూడా ఈ కథలో చర్చకు వచ్చింది. ఈ చిత్రం కోసం దర్శకుడు కోమల్‌ ఎంతో కష్టపడ్డాడు. ఈ చిత్రం కోసం చాలా ఛాలెంజ్‌లు ఫేస్‌ చేశాం. చిత్రీకరణ సమయంలో యూఎస్‌లో సడెన్‌గా మంచు కురవడం,సడన్‌ ఎండ, ఎన్నో ఛాలెంజ్‌లు చూశాం. అమెరికాలోని అడవుల్లో చిత్రీకరణ చేశాం. చాలా రిస్కీ ప్రదేశాల్లో చిత్రీకరణ జరిగింది. తప్పకుండా ఈచిత్రం నటిగా నాతో పాటు అందరికి మంచి పేరును తీసుకొస్తుంది. ప్రేక్షకులకు ఓ సరికొత్త థియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుందని నమ్ముతున్నాను.

తారాగణం: రాకేష్ గలేభే, స్రవంతి ప్రత్తిపాటి, మానస వీణ, భార్గవ్ గోపీనాథం, కార్తీక్ కందాల, శివ కుమార్ జూటూరి, ఆది నాయుడు, ఏబెల్ కోసెంటినో, టామ్ అవిలా, లాస్య రవినూతుల.
కోమల్ ఆర్ భరద్వాజ్: రచన & దర్శకత్వం
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: టేలర్ బ్లూమెల్
సంగీతం: గ్యాని
ఎడిటర్: ఛోటా కె ప్రసాద్
రచయిత: రవితేజ నిట్ట
డైరెక్షన్ టీమ్: వరుణ్ వేగినాటి, రవితేజ నిట్టా, భార్గవ్ గోపీనాథం, నవ్య దీపికా భత్తుల, ఆశిష్ చైతన్య, అనీషా క్రోతపల్లి
బ్యానర్: సింగిల్ సెల్ యూనివర్స్ ప్రొడక్షన్
నిర్మాతలు: పద్మ రావినూతుల, హిరణ్య రావినూతుల
ప్రొడక్షన్ డిజైనర్: జెఫ్రీ స్టిల్వెల్
సినిమాటోగ్రఫీ బృందం: టేలర్ స్టంప్, మైఖేల్ వీస్, డామియన్ బైంగ్టన్, జెస్సీ బర్రిల్, నిక్ గ్రిల్, , పాట్రిక్ బ్లెవిన్స్, లోగాన్ రేనాల్డ్స్.
హెయిర్ & మేకప్: ఎరిన్ లియోన్, ట్రిస్టా కెల్లీ, ఎలెన్ మక్ర్ట్చ్యాన్
సౌండ్ రికార్డింగ్: నికోలస్ డెకర్, ట్రాయ్ మిచెయు
కాస్ట్యూమ్ డిజైనర్: అనురాధ సాగి
VFX కంపెనీ/సూపర్‌వైజర్: హ్యూ పిక్చర్స్/హేమంత్ వుండేమొదలు
యానిమేషన్ క్రియేటివ్ ప్రొడ్యూసర్: డి స్క్వేర్ ఎంటర్‌టైన్‌మెంట్ స్టూడియోస్/విజయ్ సాగర్ అన్నారపు
లేబుల్: డివో మ్యూజిక్

Latest News

సెకండ్ ఎపిసోడ్ నామినేషన్స్ తో హీటెక్కిన డాన్స్ ఐకాన్ సీజన్ 2 వైల్డ్ ఫైర్ షో

ఓంకార్ హోస్ట్ గా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సెన్సేషనల్ డ్యాన్స్ షో డ్యాన్ ఐకాన్ సీజన్ 2 వైల్డ్ ఫైర్ పేరుకు తగినట్లే రోజు...

More News