‘భార‌తీయుడు 2’… నుంచి లిరికల్ సాంగ్ ‘శౌర..’ రిలీజ్

  • జూలై 12న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలవుతున్న చిత్రం

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మిస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం ‘ భార‌తీయుడు 2’. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న ఈ చిత్రం గ్రాండ్ లెవ‌ల్లో రిలీజ్ అవుతుంది. జూన్ 1న చెన్నైలో సినీ ప్రముఖులు సమక్షంలో ఆడియో వేడుక‌ను ఘ‌నంగా నిర్వ‌హించ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

1996లో క‌మ‌ల్ మాస‌న్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌ విడుద‌లై బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సరికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేసిన ‘భార‌తీయుడు’ చిత్రానికి సీక్వెల్‌గా ‘ భార‌తీయుడు 2’ రూపొందుతోంది. అభిమానులు, సినీ ప్రేక్ష‌కులు ఎంతో ఆతృత‌తో ఎదురు చూస్తోన్న ఈ మూవీ ప్ర‌మోష‌న్స్‌లో వేగం పుంజుకున్నాయి. అందులో భాగంగా బుధ‌వారం రోజున మేక‌ర్స్ ‘భారతీయుడు 2’ మూవీ నుంచి ‘శౌర..’ అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. పాట‌లో చూపించిన కొన్ని విజువ‌ల్స్ చూస్తుంటే భార‌తీయుడు 2 అంచ‌నాల‌ను మించేలా శంక‌ర్ తెరకెక్కించార‌ని స్ప‌ష్ట‌మ‌వుతుంది. అనిరుద్ రవిచందర్ సంగీత సార‌థ్యంలో సుద్ధాల అశోక్ తేజ రాసిన ఈ పాట‌ను రితేష్ జి.రావ్‌, శ్రుతికా స‌ముద్రాల పాడారు.

క‌మ‌ల్ హాస‌న్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న ఈ చిత్రంలో సిద్ధార్థ్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్, ప్రియా భ‌వానీ శంక‌ర్‌, ఎస్‌.జె.సూర్య‌, బాబీ సింహ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ర‌వివ‌ర్మ‌న్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి అనిరుద్ ర‌విచంద్ర‌న్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఎ.శ్రీక‌ర ప్ర‌సాద్ ఎడిట‌ర్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా టి.ముత్తురాజ్ గా వ‌ర్క్ చేస్తున్నారు. బి.జ‌య‌మోహ‌న్‌, క‌బిల‌న్ వైర‌ముత్తు, ల‌క్ష్మీ శ‌ర‌వ‌ణ‌కుమార్‌ల‌తో క‌లిసి డైరెక్ట‌ర్ శంక‌ర్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. లైకా ప్రొడ‌క్ష‌న్స్‌, రెడ్ జైంట్ మూవీస్ ఈ భారీ చిత్రాన్ని రూపొందిస్తున్నాయి.

‘భార‌తీయుడు 2’ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను ఏషియ‌న్ సురేష్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ఎల్ఎల్‌పి, సీడెడ్ హ‌క్కుల‌ను శ్రీల‌క్ష్మి మూవీస్ సంస్థ‌లు ద‌క్కించుకున్నాయి. సోనీ మ్యూజిక్ ద్వారా ‘భారతీయుడు 2’ పాటలు మార్కెట్లోకి విడుదలవుతున్నాయి.

న‌టీన‌టులు:

క‌మ‌ల్ హాస‌న్‌, ఎస్‌.జె.సూర్య‌, ప్రియా భ‌వానీ శంక‌ర్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, సిద్ధార్థ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్, నెడుముడి వేణు, వివేక్‌, కాళిదాస్ జ‌య‌రాం, గుల్ష‌న్ గ్రోవ‌ర్‌, స‌ముద్ర‌ఖ‌ని, బాబీ సింహ‌, బ్ర‌హ్మానందం, జాకీర్ హుస్సేన్‌, పియుష్ మిశ్రా, గురు సోమ‌సుంద‌రం, డిల్లీ గ‌ణేష్, జ‌య‌ప్రకాష్‌, మ‌నోబాల‌, అశ్వినీ తంగ‌రాజ్ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

క‌థ‌, ద‌ర్శ‌క‌త్వం: ఎస్‌.శంక‌ర్‌, స్క్రీన్ ప్లే: ఎస్‌.శంక‌ర్‌, బి.జ‌య‌మోహ‌న్‌, క‌బిల‌న్ వైర‌ముత్తు, ల‌క్ష్మీ శ‌ర‌వ‌ణ కుమార్‌, మ్యూజిక్ : అనిరుద్ ర‌విచంద్ర‌న్‌, ఎడిటింగ్: ఎ.శ్రీక‌ర్ ప్ర‌సాద్‌, సినిమాటోగ్ర‌ఫీ: ర‌వివ‌ర్మ‌న్‌, ఆర్ట్‌: ముత్తురాజ్‌, స్టంట్స్‌: అన‌ల్ అర‌సు, అన్బ‌రివు, రంజాన్ బుల‌ట్‌, పీట‌ర్ హెయిన్స్‌, స్టంట్ సిల్వ‌, డైలాగ్ రైట‌ర్‌: హ‌నుమాన్ చౌద‌రి, వి.ఎఫ్‌.ఎక్స్ సూప‌ర్ వైజ‌ర్‌: వి.శ్రీనివాస్ మోహ‌న్‌, కొరియోగ్ర‌ఫీ: బాస్కో సీజ‌ర్‌, బాబా భాస్క‌ర్‌, పాట‌లు: శ్రీమ‌ణి, సౌండ్ డిజైన‌ర్‌: కునాల్ రాజ‌న్‌, మేక‌ప్ : లెగ‌సీ ఎఫెక్ట్‌-వాన్స్ హర్ట్‌వెల్‌- ప‌ట్ట‌ణం ర‌షీద్‌, కాస్టూమ్ డిజైన్‌: రాకీ-గ‌విన్ మ్యూగైల్‌- అమృతా రామ్‌-ఎస్‌బి స‌తీష‌న్‌-ప‌ల్లవి సింగ్-వి.సాయి, ప‌బ్లిసిటీ డిజైన‌ర్: క‌బిల‌న్ చెల్ల‌య్య ,పి.ఆర్‌.ఒ (తెలుగు): నాయుడు సురేంద్ర కుమార్‌, ఫ‌ణి కందుకూరి (బియాండ్ మీడియా), ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: సుంద‌ర్ రాజ్‌, హెడ్ ఆఫ్ లైకా ప్రొడ‌క్ష‌న్స్‌: జి.కె.ఎం.త‌మిళ్ కుమ‌ర‌న్‌, రెడ్ జైంట్ మూవీస్‌: సెన్‌బ‌గ మూర్తి, నిర్మాత‌: సుభాస్క‌ర‌న్‌.

Tfja Team

Recent Posts

విశాల్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మకుటం’.. యాక్షన్ మోడ్‌లో అదిరిన టీజర్‌

'మార్క్ ఆంటోనీ', 'మద గజ రాజా' చిత్రాలతో విశాల్ మంచి విజయాల్ని అందుకున్నారు. విశాల్ కెరీర్‌లోనే ‘మకుటం’ ఓ స్పెషల్…

5 hours ago

సుహాస్, సూరి ప్రధాన పాత్రల్లో ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ నిర్మించిన ‘మండాడి’ .. సెప్టెంబర్ 4న గ్రాండ్ రిలీజ్

సుహాస్, సూరి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మండాడి’. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్లు, టైటిల్ పోస్టర్లతో బజ్ క్రియేట్…

5 hours ago

“దీవాన” మీ మనసును హత్తుకునే బ్యూటిఫుల్ లవ్ స్టోరీ మూవీ – ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్

శుభం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ టాలెంటెడ్ యాక్టర్ హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "దీవాన".…

7 hours ago

సినీ ప్రముఖుల చేతుల మీదుగా‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’ టీజర్, ట్రైలర్ లాంచ్

తెలుగు సిల్వ‌ర్ స్క్రీన్‌పైకి బ్యూటీఫుల్ యూత్ ఫుల్ లవ్ స్టోరీ రాబోతోంది. మోహన్ సిద్ధి, మహన్, శృతి శంకర్ హీరోహీరోయిన్లుగా,…

2 days ago

‘సింగ్ గీతం’ విడుదల తేదీలో ఒక రోజు మార్పు: జూన్ 12న రిలీజ్

సింగీతం శ్రీనివాసరావు-నాగ్ అశ్విన్ మోస్ట్ అవైటెడ్ మూవీ 'సింగ్ గీతం' విడుదల తేదీలో ఒక రోజు మార్పు: జూన్ 12న…

2 days ago

అంగరంగ వైభవంగ మహేంద్రగిరి వారాహి టీజర్ విడుదల కార్యక్రమం !!!

రాజశ్యామల ‌ఎంటర్టైన్మెంట్స్ & బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై సుమంత్ హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో మధు కాలిపు, లక్ష్మణ్…

2 days ago