ఉషా ప‌రిణ‌యం చిత్రం నుంచి లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల

Must Read

తెలుగు సినీ రంగంలో ద‌ర్శ‌కుడిగా త‌న‌కంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న ద‌ర్శ‌కుల్లో ఒక‌రైన కె.విజ‌య్‌భాస్క‌ర్ మ‌ళ్లీ ఓ స‌రికొత్త ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రానికి శ్రీ‌కారం చుట్టాడు. నువ్వేకావాలి, మ‌న్మ‌థుడు, మ‌ల్లీశ్వ‌రి వంటి క్లీన్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన ఆయ‌న స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో ఉషా ప‌రిణ‌యం బ్యూటిఫుల్ టైటిల్‌తో ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు.


ఈ చిత్రానికి ల‌వ్ ఈజ్ బ్యూటిఫుల్ అనేది ఉప‌శీర్షిక‌. విజ‌య్‌భాస్క‌ర్ క్రాఫ్ట్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపైకె.విజ‌య్‌భాస్క‌ర్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో విజ‌య్‌భాస్క‌ర్ త‌న‌యుడు శ్రీ‌క‌మ‌ల్ హీరోగా న‌టిస్తుండ‌గా, తాన్వీ ఆకాంక్ష అనే అచ్చ‌తెలుగ‌మ్మాయి ఈ చిత్రంతో హీరోయిన్‌గా ప‌రిచ‌యం కాబోతుంది. చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం నిర్మాణానంత‌ర ప‌నుల‌ను జరుపుకుంటోంది. ఇటీవ‌ల ఈ చిత్రం టీజ‌ర్‌ను విడుదల చేసింది చిత్ర‌బృందం. తాజాగా ఈ చిత్రం నుంచి ఆకాశానికే జాబిలి అందం.. భూగోళానికే నా చెలి అందం అంటూ కొన‌సాగే ఓ ప్రేమ‌గీతాన్ని ఈ చిత్రం నుంచి తొలి లిరిక‌ల్ సాంగ్‌గా విడుద‌ల చేశారు. ఆర్‌.ఆర్‌. ధ్రువ‌న్ సంగీత సార‌థ్యంలో రూపొందిన ఈ పాట‌కు అల‌రాజు సాహిత్యం అందించారు. ఆర్‌.ఆర్‌. ధ్రువ‌న్ ఈ ప్రేమ‌గీతాన్ని ఆల‌పించారు.


ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌క‌, నిర్మాత విజ‌య్ భాస్క‌ర్ మాట్లాడుతూ ఇటీవ‌ల విడుద‌లైన టీజ‌ర్‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. ప్రేమ‌క‌థ‌లో స‌రికొత్త‌గా వుండే విధంగా ఉషా ప‌రిణ‌యం తెర‌కెక్కుతోంది. ఈ చిత్రం ప్రేమ‌కు నేనిచ్చే డెఫినేష‌న్‌. ఇదొక మంచి ల‌వ్‌స్టోరి, సినిమా ల‌వ‌ర్స్‌కు విందుభోజ‌నం లా వుంటుంది. అన్ని ఎమోష‌న్స్ ఈ చిత్రంలో వున్నాయి. ఈ సినిమా సంగీతంలో ధ్రువ‌న్ విశ్వ‌రూపం చూస్తారు* అన్నారు.
శ్రీ‌క‌మ‌ల్, తాన్వి ఆకాంక్ష‌, సూర్య‌, ర‌వి, శివ‌తేజ‌, అలీ, వెన్నెల‌కిషోర్‌, శివాజీ రాజా, ఆమ‌ని, సుధ‌, ఆనంద్ చ‌క్ర‌పాణి, ర‌జిత‌, బాల‌క్రిష్ణ‌, సూర్య, మ‌ధుమ‌ణి ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. కుటుంబ స‌మేతంగా చూడ‌ద‌గ్గ ల‌వ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్క‌నున్న ఈ సినిమాకి సంగీతం : ఆర్ ఆర్ ధ్రువ‌న్‌, డీఓపీ: స‌తీష్ ముత్యాల‌, ఎడిటింగ్‌: ఎమ్ ఆర్ వ‌ర్మ‌, ద‌ర్శ‌క‌త్వం-నిర్మాత :కె.విజ‌య్‌భాస్క‌ర్

Latest News

తెలంగాణ ప్రభుత్వం అనుమతితో శ్రీతేజ్‌ను పరామర్శించిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌

సంధ్య థియేటర్‌ తొక్కిసలాటలో గాయపడి కిమ్స్‌ హస్పటల్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ ఈ రోజు (బుధవారం) పరామర్శించారు. శ్రీతేజ్‌ యోగా...

More News