ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం లవ్ టుడే. ఇవనా హీరోయిన్‌గా నటించింది. తమిళంలో విడుదలైన ఈ చిత్రం ఫన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తి ఘన విజయాన్ని అందుకుంది. ఇప్పుడీ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించటానికి సక్సెస్‌ఫుల్ నిర్మాత దిల్‌రాజు సిద్ధమయ్యారు.రోమ్ కామ్ మూవీగా రూపొందిన లవ్ టుడే సినిమాను దిల్ రాజు తెలుగులో విడుదల చేయనుండటంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. నవంబర్ మూడో వారం తెలుగు రాష్ట్రాల్లో లవ్ టుడే సినిమా భారీ విడుదల చేయటానికి దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నారు.
2019లో రిలీజై బ్లాక్ బస్టర్ అయిన కోమాలి సినిమాను ప్రదీప్ రంగనాథ్ తెరకెక్కించారు. లవ్ టుడే అయన రెండో సినిమా. ఈ సినిమాకు దర్శకత్వం వహించటంతో పాటు హీరోగానూ ఆయనే నటించారు. తమిళంలో గత శుక్రవారం విడుదలైన లవ్ టుడే చిత్రం హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. సత్యరాజ్, రాధికా శరత్ కుమార్ పోషించిన ప్రధాన పాత్రలు సినిమాకు ప్రధాన బలంగా మారాయి. సినిమా బడ్జెట్ కంటే పది రెట్లు లాభాన్ని సాధిస్తుందని కోలీవుడ్ సినీ వర్గాలంటున్నాయి. యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్‌కు సినిమా బాగా కనెక్ట్ అయ్యింది.ఎ.జి.ఎస్.ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై లవ్ టుడే చిత్రాన్ని కల్పతి అఘోరాం, కల్పతి ఎస్.గణేష్ నిర్మించారు. మ్యూజిక్ సంచలనం యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…