న‌వ‌దీప్ 2.O ల‌వ్, మౌళి జూన్‌ 7న విడుదల

Must Read

సూప‌ర్ టాలెంటెడ్ యాక్టర్ నవదీప్  సరికొత్త అవతార్‌లో న‌వ‌దీప్ గా  2.Oగా క‌నిపించ‌బోతున్న చిత్రం లవ్,మౌళి.  ఇప్పటికే ఈ సినిమా ప్రచార చిత్రాలు, ప్రమోషన్‌ కంటెంట్‌లో అందరిలోనూ సినిమా చూడాలనే ఆసక్తిని పెంచాయి. ఈ విభిన్న‌మైన, వైవిధ్య‌మైన ఈ చిత్రానికి అవ‌నీంద్ర ద‌ర్శ‌కుడు. ఈ చిత్రాన్ని నైరా క్రియేషన్స్  మరియు శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్ తో క‌లిసి  నిర్మాణ పనులు టాలీవుడ్ టాలెంటెడ్ టెక్నిషియన్స్ కి అడ్డాగా మారిన  సి స్పేస్  భాధ్యతలు తీసుకుంది. ఇటీవల సింగిల్‌ కట్‌ లేకుండా సెన్సారును పూర్తిచేసుకున్న ఈ చిత్రానికి సెన్సారు వారు ‘ఏ’ సర్టిఫికెట్‌ను అందజేశారు. కాగా నిర్మాణానంతర పనులు తుదిదశకు చేరుకున్న ఈ చిత్రాన్ని జూన్‌ 7న  విడుద‌ల చేస్తున్నట్లు ప్ర‌క‌టించింది చిత్ర‌యూనిట్‌. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ ఈ చిత్రంలోచాలా డిఫ‌రెంట్‌గా  నవదీప్ కనిపించడంతో ఈ సినిమా న‌వ‌దీప్ 2.Oగా  అభిమానులంతాఒక ఢిఫరెంట్ కాన్నెప్ట్ తొ వుంటుంద‌ని మంచి అంచ‌నాల‌తో ఈ సినిమా గురించి ఎదురుచూస్తున్నారు. సినిమా ప్రమోషన్‌ కంటెంట్‌  చూస్తుంటే వీరి  అంచ‌నాల‌ను మ‌రింత పెంచే విధంగా వుంది.  ఎందుకుంటే  న‌వ‌దీప్‌ను స‌రికొత్త‌గా  చూసిన వాళ్లంతా ఈసినిమాతో ఆయ‌న కొత్త ట్రెండ్ క్రియేట్ చెయ్య‌బోతున్నాడ‌ని అంటున్నారు. నా లైఫ్ లో జ‌రిగిన  ప్రేమ‌క‌థ‌ల‌కు ఫ‌లిత‌మే ఈ సినిమా క‌థ‌. నేను పాన్ ఇండియా లెవ‌ల్‌లో ప్రేమించేవాడ్ని. ప్రేమ అనే టాపిక్‌లో సో మెనీ వెరియేష‌న్స్ వున్నాయి. నా స్వీయ అనుభ‌వాలే  ఈ సినిమా క‌థ, జూన్‌ 7న చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నాం. విభిన్న ప్రేమ‌క‌థ‌లు కోరుకునే ప్రేక్ష‌కులంద‌రికి మా ల‌వ్‌, మౌళి మ‌న‌సుల‌కు హ‌త్తుకుంటుంది. అన్నారు

నటీనటులు: నవదీప్, పంఖురి గిద్వానీ, భావన సాగి, మిర్చి హేమంత్, మిర్చి కిరణ్ తదితరులు
బ్యానర్.. నైరా క్రియోషన్స్ అండ్ శ్రీకర స్టూడియోస్
నిర్మాణం .. సి స్పేస్
ర‌చ‌న -దర్శకత్వం, సినిమాటోగ్రఫీ,  ఎడిటింగ్ : అవనీంద్ర
సంగీత దర్శకులు: గోవింద్ వసంత
పాట‌ల రచన.. అనంత శ్రీరామ్
ఆర్ట్.. కిరణ్ మామిడి
పిఅర్ఓ :  ఏలూరు శ్రీను- మధు మడూరి

Latest News

తెలంగాణ ప్రభుత్వం అనుమతితో శ్రీతేజ్‌ను పరామర్శించిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌

సంధ్య థియేటర్‌ తొక్కిసలాటలో గాయపడి కిమ్స్‌ హస్పటల్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ ఈ రోజు (బుధవారం) పరామర్శించారు. శ్రీతేజ్‌ యోగా...

More News