విజయ్ ఆంటోనీ “లవ్ గురు” సినిమా ప్రేక్షకులకు ఫ్యామిలీ టూర్ ఆఫర్

విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ “లవ్ గురు” ప్రేక్షకుల ఆదరణతో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకుంటోంది. ఈ సినిమా నుంచి ఓ ఎగ్జైటింగ్ ఆఫర్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. “లవ్ గురు” సినిమా చూసే ప్రేక్షకుల్లో విజేతలను ఫ్యామిలీతో సమ్మర్ హాలీడే టూర్ తీసుకెళ్తామని ప్రకటించారు. ఫస్ట్ ప్రైజ్ విన్నర్ కు మలేషియా, సెకండ్ ప్రైజ్ విజేతకు కాశ్మీర్, థర్డ్ ప్రైజ్ విన్నర్ కు ఊటీ హాలీడే ట్రిప్ ను తీసుకెళ్తామని “లవ్ గురు” టీమ్ తెలిపింది.

ఇవాళ్టి నుంచి ఈ ఆఫర్ అందుబాటులోకి రానుంది. “లవ్ గురు” సినిమా చూసిన ప్రేక్షకులు మీ పేరు, ఫోన్ నెంబర్, టికెట్ వివరాలు రాసి థియేటర్స్ దగ్గర ఏర్పాటు చేసిన బాక్సుల్లో వేయాలి. ఆన్ లైన్ టికెట్ కొన్న ప్రేక్షకులు 9963466334 నెంబర్ కు మీ టికెట్ ఫొటోను వాట్సాప్ చేయాలి. ఈ సమ్మర్ హాలీడేస్ వెకేషన్ ను పూర్తి ఉచితంగా ఎంజాయ్ చేసే అవకాశం “లవ్ గురు” సినిమా టీమ్ కల్పిస్తోంది.

“లవ్ గురు” సినిమాను రంజాన్ పండుగ సందర్భంగా ఈ నెల 11న రిలీజ్ చేశారు. తెలుగులో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేసింది. “లవ్ గురు” సినిమా సక్సెస్ ఫుల్ గా థియేట్రికల్ రన్ కంటిన్యూ చేస్తోంది. ఈ సినిమాలో మృణాళిని రవి హీరోయిన్ గా నటించగా..విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై మీరా విజయ్ ఆంటోనీ సమర్పణలో విజయ్ ఆంటోనీ నిర్మించారు. వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహించారు.

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

1 week ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

1 week ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

1 week ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

1 week ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

1 week ago