అంకిత్ కొయ్య, మానస చౌదరి హీరో హీరోయిన్లుగా యూజీ క్రియేషన్స్ బ్యానర్ లో “సమ్మతమే” ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి రూపొందిస్తున్న సినిమా “లవ్ జాతర”. ఈ చిత్రాన్ని ప్రొడ్యూసర్ కంకణాల ప్రవీణ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ రోజు న్యూ ఇయర్ సందర్భంగా తెలుగు ఆడియెన్స్ అందరికీ విశెస్ తెలియజేసింది “లవ్ జాతర” మూవీ టీమ్.

కంప్లీట్ రోలర్ కోస్టర్ లవ్ ఎంటర్ టైనర్ గా “లవ్ జాతర” సినిమా రూపొందుతోంది. ఈ చిత్రానికి చేతన్ భరద్వాజ్ మ్యూజిక్ అందిస్తుండగా..సుజాత సిద్ధార్థ్ డీవోపీగా వ్యవహరిస్తున్నారు. ఈ న్యూ ఇయర్ లో “లవ్ జాతర”కు సంబంధించిన క్రేజీ అప్డేట్స్ రాబోతున్నాయి.
నటీనటులు – అంకిత్ కొయ్య, మానస చౌదరి, తదితరులు
టెక్నికల్ టీమ్
డీవోపీ – సుజాత సిద్ధార్థ్
మ్యూజిక్ – చేతన్ భరద్వాజ్
బ్యానర్ – యూజీ ప్రొడక్షన్స్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
మార్కెటింగ్ – హౌస్ ఫుల్
ప్రొడ్యూసర్ – కంకణాల ప్రవీణ
రచన , దర్శకత్వం – గోపీనాథ్ రెడ్డి

