టాలెంటెడ్ హీరో లెజెండ్ శరవణన్ “లీడర్” సినిమా టీజర్ రిలీజ్, ఏప్రిల్ లో గ్రాండ్ రిలీజ్ కు రాబోతున్న మూవీ

లెజెండ్ శరవణన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “లీడర్”. ఈ చిత్రాన్ని లెజెండ్ శరవణ స్టోర్స్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. దర్శకుడు ఆర్ ఎస్ దురై సెంథిల్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తోంది. “లీడర్” సినిమా ఏప్రిల్ లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు.

“లీడర్” మూవీ టీజర్ ఎలా ఉందో చూస్తే – నా కూతురితో పాటే నేనుండాలి, దాని కోసం ఈ ప్రపంచాన్ని ఎదిరించమన్నా ఎదిరించి గెలుస్తాను అనే పవర్ ఫుల్ డైలాగ్ తో టీజర్ ప్రారంభమవుతుంది. తన కుటుంబం కోసం చేసిన పోరాటంలో హీరో ఖైదీగా మారడం, జైలులో కూతురినే గుర్తు తెచ్చుకుంటూ బాధపడటం టీజర్ లో చూపించారు. హీరో భార్య క్యారెక్టర్ లో పాయల్ రాజ్ పుత్ నటిస్తోంది. ఈ అందమైన కుటుంబంలో ఎవరు తమ స్వార్థం కోసం చిచ్చు పెట్టారు అనేది టీజర్ లో ఆసక్తి కలిగిస్తోంది. తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకునే శక్తివేల్ అనే క్యారెక్టర్ లో హీరో శరవణన్ ఇంటెన్స్ పర్ ఫార్మెన్స్ కనబర్చారు. ఆయన చేసిన భారీ యాక్షన్ సీక్వెన్సులు టీజర్ కు ఆకర్షణగా నిలుస్తున్నాయి. మాస్, యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో “లీడర్” సినిమా ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేయబోతున్నట్లు టీజర్ తో తెలుస్తోంది.

నటీనటులు – పాయల్ రాజ్ పుత్, శ్యామ్, ఆండ్రియా, సంతోష్ ప్రతాప్, లాల్, బాహుబలి ప్రభాకర్, అమృత అయ్యర్, వీటీవీ గణేష్, ఐశ్వర్య, అరంతంగి నిశా, ఐయాల్, జయమిశ్రా, పత్మాన్, యోగిరామ్, ఓక్ సుందర్, మహానది శంకర్, మరియమ్ జార్జ్, ఆదిత్య కతియార్, వేల్ అరుణాచలం, నిరంజన్, శోభన్ బాబు, అశోక్ పాండియన్, తదితరులు

టెక్నికల్ టీమ్

కాస్ట్యూమ్ డిజైనర్ – దీప్తి ఆర్.జి, పూర్తి ప్రవీణ్
ఆర్ట్ డైరెక్షన్ – జి.దురైరాజ్
స్టంట్స్ – మహేశ్ మాథ్యూ
ఎడిటింగ్ – ప్రదీప్ ఇ.రాఘవ్
సినిమాటోగ్రఫీ – ఎస్. వెంకటేష్
మ్యూజిక్ – జిబ్రాన్ వైభోద
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
బ్యానర్ – లెజెండ్ శరవణ స్టోర్స్ ప్రొడక్షన్స్
స్టోరీ, డైరెక్షన్ – ఆర్ ఎస్ దురై సెంథిల్ కుమార్

TFJA

Recent Posts

శ్రీరామనవమి సందర్భంగా మార్చి 26న విడుదల కాబోతోన్న ‘బ్యాండ్ మేళం’

‘కోర్ట్’ చిత్రంతో మెప్పించిన హర్ష్ రోషన్, శ్రీదేవీ జంట మళ్లీ ‘బ్యాండ్ మేళం’ అంటూ ఆడియెన్స్ ముందుకు రానుంది. బ్లాక్…

14 minutes ago

ముందుగానే పవర్ స్టార్ తుఫాన్.. మార్చి 19న థియేటర్లలో అడుగుపెట్టనున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’

థియేటర్లో పవర్ స్టార్ తుఫాన్ కాస్త ముందుగానే రాబోతోంది. సినీ ప్రియులంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్'…

7 hours ago

హోలీ శుభాకాంక్షలతో కంప్లీట్ ఎంటర్ టైనర్ “క్రేజీ కల్యాణం” మూవీ నుంచి బాల్ రాజ్ గా తరుణ్ భాస్కర్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

నరేష్ వీకే, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, రాజ్ వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న…

1 day ago

సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని చిత్రాన్ని ఫ్యామిలీ అంతా కలిసి థియేటర్‌లో ఎంజాయ్‌ చేయాలి: ప్రీరిలీజ్‌ వేడుకలో అతిథులు.

మిస్సమ్మ’, ‘అదిరందయ్యా చంద్రం’, ‘టాటా బిర్లా మధ్యలో లైలా’ లాంటి క్లాసిక్ ఎంటర్‌టైనర్స్ తర్వాత శివాజీ, లయ జంటగా నటించిన…

1 day ago

‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ అవుట్‌ అండ్‌ అవుట్‌ ఎంటర్‌టైనర్‌గా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది: హీరోయిన్‌ లయ

మిస్సమ్మ’, ‘అదిరందయ్యా చంద్రం’, ‘టాటా బిర్లా మధ్యలో లైలా’ లాంటి క్లాసిక్ ఎంటర్‌టైనర్స్ తర్వాత శివాజీ, లయ జంటగా నటించిన…

2 days ago

’మిషన్ సి -1000‘’ – గ్రాండ్ రిలీజ్ మార్చి 6.

ఎస్వి క్రియేషన్ తమ ప్రతిష్టాత్మక పాన్-ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘’మిషన్ సి1000‘’ మార్చి 6న దేశవ్యాప్తంగా ఘనంగా విడుదల చేయనున్నట్లు…

2 days ago