‘లాఠీ’ టీజర్, ఫస్ట్ సింగిల్, గ్లింప్స్ ఈ 13న స్క్రీనింగ్

Must Read

యాక్షన్ హీరో విశాల్ కథానాయకుడిగా ఏ వినోద్ కుమార్ దర్శకత్వంలో రానా ప్రొడక్షన్స్‌పై రాబోతోన్న హై ఆక్టేవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘లాఠీ’.  రమణ, నంద సంయుక్త నిర్మాణంలో భారీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ మెటిరీయల్ సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి.‘లాఠీ’ మూవీ మేకర్స్ మరో బిగ్ అప్డేట్ తో వచ్చారు. ‘లాఠీ’ టీజర్, ఫస్ట్ సింగిల్, గ్లింప్స్ ను 

నవంబర్ 13వ తేది సాయంత్రం 6.30 గంటలకు జేఆర్సీ కన్వెన్షన్ హాల్ వేదికగా ప్రదర్శిస్తున్నట్లు తెలిపిన మేకర్స్ ఈ మేరకు ఆహ్వానం పలికారు. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో విశాల్ సరసన సునయన హీరోయిన్‌గా నటిస్తోంది.లాఠీలో అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్‌లు ఉండబోతోన్నాయి. ద్వితీయార్థంలో ఉండే 45 నిమిషాల యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే హైలెట్ అవ్వనుంది. దిలీప్ సుబ్బరాయణ్ అద్భుతమైన ఫైట్ సీక్వెన్స్‌లను కంపోజ్ చేశారు.సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి బాలసుబ్రమణ్యన్ కెమెరామెన్‌గా, పార్థిబన్  రచయితగా పని చేస్తున్నారు.

నటీనటులు : విశాల్, సునయన

సాంకేతిక విభాగం :

నిర్మాతలు : రమణ, నంద

దర్శకత్వం : ఏ వినోద్ కుమార్

బ్యానర్ : రానా ప్రొడక్షన్స్

రచయిత : పొన్ పార్థీబన్

మ్యూజిక్ : సామ్ సీఎస్

సినిమాటోగ్రఫీ : బాలసుబ్రమణ్యన్

స్టంట్ డైరెక్టర్ : దిలీప్ సుబ్బరాయణ్

ఎక్స్‌క్యూటివ్ ప్రొడ్యూసర్ : బాల గోపి

పీఆర్వో : వంశీ-శేఖర్

Latest News

‘పొలిమేర 3’ నుంచి యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ‘విరావి’ ఫస్ట్ లుక్ విడుదలతెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలకు సిద్ధమవుతున్న ‘పొలిమేర 3..!

మిస్టిక్ థ్రిల్లర్ ఫ్రాంచైజీలో ప్రేక్షకులను ఆకట్టుకున్న 'పొలిమేర' సిరీస్ నుంచి మూడో చిత్రంగా వస్తున్న 'పొలిమేర 3'పై అంచనాలు పెరుగుతున్నాయి. తాజాగా ఈ చిత్రంలో యాక్షన్...

More News