లైలా ఫ్యామిలీ అంతా కలసి ఎంజాయ్ చేసే క్లీన్ ఎంటర్ టైనర్:విశ్వక్సేన్

మాస్ కా దాస్ విశ్వక్సేన్, ఆకాంక్ష శర్మ, రామ్ నారాయణ్, సాహు గారపాటి, షైన్ స్క్రీన్స్ లైలా నుంచి యూత్ ఫుల్ నంబర్ ఇచ్చుకుందాం బేబీ లాంచ్

మాస్ కా దాస్ విశ్వక్సేన్ అప్ కమింగ్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘లైలా’. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించారు. ఈ రోజు మేకర్స్ సెకండ్ సింగిల్ ఇచ్చుకుందాం బేబీని లాంచ్ చేశారు. లియోన్ జేమ్స్ స్వరపరిచిన ఈ ట్రాక్ అప్ బీట్ మోడ్రన్ స్టయిల్ బ్లెండ్ తో ఆకట్టుకుంది.

ఈ పాటని ఆదిత్య ఆర్కే , ఎంఎం మానసి ఎనర్జిటిక్ వోకల్స్ ఆలపించారు. పూర్ణాచారి అందించిన సాహిత్యం లీడ్ పెయిర్ కెమిస్ట్రీని ప్రెజెంట్ చేసింది. యూత్ ఫుల్ ఎనర్జీతో సాంగ్ వైరల్ గా మారింది. విశ్వక్సేన్, ఆకాంక్ష శర్మల కెమిస్ట్రీ అదిరిపోయింది. బీచ్ బ్యాక్ డ్రాప్ పాట వైబ్‌ను మరింతగా పెంచుతోంది. ఆకాంక్ష శర్మ తన చార్మ్ తో సన్నివేశానికి అదనపు గ్లామర్‌ను తెస్తుంది, విశ్వక్సేన్ చరిస్మాటిక్ గా కనిపించాడు.

ఫుట్ ట్యాపింగ్ నెంబర్ ఇచ్చుకుందాం బేబీ మ్యూజిక్, విజువల్స్ రెండింటిలోనూ కట్టిపడేసింది. ఫస్ట్ సింగిల్ సోను మోడల్ లాగానే, ఇచ్చుకుందాం బేబీ కూడా సూపర్ హిట్ అవుతుంది.

ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే వాసుదేవ మూర్తి రాశారు, రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్. లైలా ఫిబ్రవరి 14న థియేటర్లలో విడుదల కానుంది.

సాంగ్ లాంచింగ్ ఈవెంట్ లో మాస్ కా దాస్ విశ్వక్సేన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్తే. యాక్టర్ గా నా విష్ లో వున్న సినిమా ‘లైలా’. ఇలాంటి కథ క్యారెక్టర్ చేయాలని ఎప్పటినుంచో వుండే. డైరెక్టర్ రామ్ నారాయణ్ కథ చెప్పగానే నేను చేస్తానని చెప్పాను. ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చిన సాహు అన్న థాంక్ యూ. ఫిబ్రవరి 14న వస్తున్నాం. వాలెంటైన్స్ డే కి సింగిల్స్ తమకు ఎవరూ లేరని బాధపడుతుంటారు. ఈ వాలెంటైన్స్ డే కి మీకు లైలా వుంది. అమ్మాయిలు సింగిల్ అని అనుకుంటే మీకు సోను మోడల్ వున్నాడు.(నవ్వుతూ) నా కెరీర్ లో యాక్షన్ టచ్ తో అవుట్ అండ్ అవుట్ కామెడీ ఫిల్మ్ ఇదే. న్యూ ఏజ్ ఫిలిం. మీరంతా ఎంజాయ్ చేస్తారు. ఫిబ్రవరి 14కి కలుద్దాం. అప్పటివరకూ ఇచ్చుకుందాం బేబీని ఎంజాయ్ చేయండి. ఇది అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఫిల్మ్. చాలా క్లీన్ ఫిల్మ్ తీశాం. లైలా మీకు నచ్చుతుంది. లైలా కోసం రెడీ అవ్వడానికి రెండేసి గంటలు పట్టేది. నిజంగా అమ్మాయిలకు హ్యాట్సప్ చెప్పాలి. ఫిబ్రవరి 1న రాయలసీయ మాస్ సాంగ్ ఓహో రత్తమ్మ రిలీజ్ చేస్తున్నాం. అది కూడా అదిరిపోయింది’ అన్నారు.

డైరెక్టర్ రామ్ నారాయణ్ మాట్లాడుతూ.. ఇలాంటి సబ్జెక్ట్ చేయడం ఒక ఛాలెంజ్. ఇలాంటి సబ్జెక్ట్ ని ఒప్పుకున్నందుకు సాహు గారికి చాలా థాంక్స్. ఈ కథ ఇద్దరు ముగ్గురు హీరోలు చెప్పాను. లేడి గెటప్ వేయడం అంత ఈజీ కాదు. సినిమా అంటే పిచ్చి వున్నాడే చేయాలి. అలాంటి పిచ్చి వున్న విశ్వక్ నాకు దొరికారు. తనకు లైఫ్ లాంగ్ రుణపడి వుంటాను. నా టీం అందరి టెక్నికల్ బ్రిలియన్స్ మీకు స్క్రీన్ పై కనిపిస్తుంది’ అన్నారు.

నిర్మాత సాహు గారపాటి మాట్లాడుతూ.. రామ్ కథ చెప్పిన తర్వాత కొందరు హీరోలకు అప్రోచ్ అయ్యాను. లేడి క్యారెక్టర్ ని చేయగలుగుతామా లేదా అనుకునే టైంలో విశ్వక్ ఇలాంటి క్యారెక్టర్ కోసం తను ఎదురుచూస్తున్నాని చెప్పి సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఇది మంచి క్యారెక్టర్ గా తన కెరీర్ లో నిలిచిపోతుంది. యూత్ ట్యాలెంట్ తో ఈ సినిమా కోసం పని చేశారు. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది’ అన్నారు.

లిరిక్ రైటర్ పూర్ణచారి మాట్లాడుతూ… ధమ్కి లో ఆల్ మోస్ట్ పడిపోయిందే పిల్లా సాంగ్ నేనే రాశాను, అది వంద మిలియన్స్ కొట్టింది. ఇప్పుడీ ఈ సాంగ్ కి రెండు వందల మిలియన్స్ కి మించి రావాలని కోరుకుంటున్నాను. ఈ పాట రాసే అవకాశం ఇచ్చిన విశ్వక్ గారికి, నిర్మాత సాహు గారికి, డైరెక్టర్ రామ్ గారికి థాంక్ యూ. ఈ సినిమాని పెద్ద చేస్తారని కోరుకుంటున్నాను’ అన్నారు.

తారాగణం: విశ్వక్సేన్, ఆకాంక్ష శర్మ
సాంకేతిక సిబ్బంది:
బ్యానర్: షైన్ స్క్రీన్స్
నిర్మాత: సాహు గారపాటి
దర్శకత్వం: రామ్ నారాయణ్
రైటర్: వాసుదేవ మూర్తి
సంగీతం: లియోన్ జేమ్స్
సినిమాటోగ్రాఫర్: రిచర్డ్ ప్రసాద్
ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

6 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

6 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

6 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago