అంగరంగ వైభవంగా “లగ్గం” టీజర్ లాంచ్ !!!

సుభిషి ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ పై వేణుగోపాల్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా లగ్గం. ఈ సినిమాకు రమేశ్ చెప్పాల
కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం వహిస్తున్నారు. పెళ్లిలో ఉండే విందు,చిందు, కన్నుల విందుగా చూపించబోతున్నారు. ఇది తెలంగాణ నేపథ్యంలో జరిగే తెలుగు సినిమా. రెండు రాష్ట్రాల వాళ్ళు ఈ చిత్రం చూసి మాట్లాడుకుంటారు. ఈ చిత్ర టీజర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ తో పాటు హీరో ఆది సాయికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్బంగా హీరో ఆది సాయికుమార్ మాట్లాడుతూ…
“లగ్గం టీజర్ చాలా బాగుంది, విజువల్స్ అదిరిపోయాయి, డైరెక్టర్ రమేష్ చెప్పాల గారు మంచి టేస్ట్ తో ఈ సినిమాను తీశారనిపిస్తుంది. నిర్మాత వేణు గారికి, చిత్ర యూనిట్ సభ్యులందరికి బెస్ట్ విషెస్. ఈసినిమాలో నటించిన రాజేంద్రప్రసాద్ గారితో, రోహిణి గారితో, కృష్ణుడు గారితో నాకు మంచి ట్రావెల్ ఉంది. నాకు బాగా దగ్గరివారందరు ఈ సినిమాలో ఉండడం సంతోషంగా ఉంది, ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

డైరెక్టర్ రమేష్ చెప్పాల మాట్లాడుతూ…
లగ్గం సినిమా ఇంత అద్భుతంగా రావడానికి కారణమైన అందరికి ధన్యవాదాలు, ముఖ్యంగా నిర్మాత వేణు గోపాల్ రెడ్డి గారు ఈ సినిమా కథను నమ్మి ఈ సినిమాను నిర్మించారు. కథ, కథనం ఈ సినిమాకు బలం. కుటుంబం మొత్తం కలిసి చూసేలా ఈ సినిమా ఉంటుంది, టీజర్ కు వస్తోన్న రెస్పాన్స్ చాలా బాగుంది.” అన్నారు.

నిర్మాత వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ…
“మంచి సినిమా చెయ్యాలనే ఆలోచనలో ఉన్నప్పుడు డైరెక్టర్ రమేష్ చెప్పాల గారు తీసిన భీమదేవరపల్లి సినిమా చూసాను, చాలా బాగా నచ్చి వెంటనే రమేష్ గారితో సినిమా చేయాలని అనుకున్నాను, ఈ క్రమంలో రమేష్ గారు లగ్గం కథ చెప్పడం జరిగింది, కథ నచ్చి వెంటనే సినిమా స్టార్ట్ చేశా, మంచి స్టోరీ, స్క్రీన్ ప్లే, ఫీల్ గుడ్ సాంగ్స్ లగ్గం సినిమాలో ఉన్నాయి, ఈ సినిమా మీ అందరికి నచ్చుతుందని భావిస్తున్నాను” అన్నారు.

నటి రోహిణి మాట్లాడుతూ…
“రాజేంద్రప్రసాద్ గారితో కలిసి నటించడం ఒక ఛాలెంజింగ్ గా అనిపించింది, లగ్గం సినిమా కోసం డైరెక్టర్ రమేష్ చెప్పాల రాసిన డైలాగ్స్ అద్భుతంగా ఉంటాయి, చాలా సున్నితమైన సంభాషణలు ప్రేక్షకులని ఆలోచింపజేస్తాయి. బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ సినిమాకు పెద్ద అసెట్ అని చెపొచ్చు. ఈ సినిమాకు అన్ని చక్కగా కుదిరాయి, సంగీతం, సాహిత్యం, హృదయాన్ని కదిలించే సన్నివేశాలు ఈ సినిమాలో చాలా ఉన్నాయని” అన్నారు.

సాయి రోనక్ మాట్లాడుతూ…
“లగ్గం సినిమా చెయ్యడం అదృష్టంగా భావిస్తున్నాను, మంచి సినిమా చేశానన్న సంతృప్తి కలిగింది, నన్ను మొదటి నుండి ఎంకరేజ్ చేస్తున్న మీడియాకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. లగ్గం సినిమా నాకు మంచి డైరెక్టర్ రమేష్ చెప్పాల గారిని, కెమెరామెన్ బాల్ రెడ్డి గారిని నాకు పరిచయం చేసింది.చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా మీ అందరికి నచ్చుతుందని గట్టిగా చెప్పగలను” అన్నారు.

చరణ్ అర్జున్ మాట్లాడుతూ…
“నన్ను ఎంకరేజ్ చేస్తున్న రమేష్ చెప్పాల గారికి కృతజ్ఞతలు, లగ్గం సినిమా పాటలకు వస్తోన్న స్పందన చాలా బాగుంది, అందరూ సాంగ్స్ రిపీటెడ్గా వింటుంటే సంతోషంగా ఉంది” అన్నారు.

ఎడిటర్ బొంతల నాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ…
“లగ్గం సినిమాకు ఎడిటరుగా చెయ్యడం సంతోషంగా ఉంది. ఒక మంచి ఫ్యామిలీ సినిమాకు వర్క్ చెయ్యడం సంతృప్తినిచ్చింది.” అన్నారు. లగ్గం టీజర్ ఆదిత్య మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్లో ప్లే అవుతుంది.

నటీనటులు:
సాయి రోనక్, ప్రగ్యా నగ్రా, రాజేంద్రప్రసాద్,రోహిణి,సప్తగిరి, ఎల్బి.శ్రీరామ్, కృష్ణుడు, రఘుబాబు, రచ్చ రవి, కనకవ్వ, వడ్లమని శ్రీనివాస్, కావేరి, చమ్మక్ చoద్ర, చిత్రం శ్రీను, సంధ్య గంధం, టి. సుగుణ ,లక్ష్మణ్ మీసాల, ప్రభావతి. కంచరపాలెం రాజు, ప్రభాస్ శ్రీను, సత్య ఏలేశ్వరం, అంజిబాబు, రాదండి సదానందం, కిరీటి, రవి వర్మ, వివా రెడ్డి తదితరులు ప్రముఖ పాత్ర పోషించారు.

ఈ చిత్రానికి కథ – మాటలు- స్క్రీన్ ప్లే- దర్శకత్వం రమేశ్ చెప్పాల, నేపద్య సంగీతం: మణిశర్మ, కెమెరామెన్: బాల్ రెడ్డి.
సంగీతం:చరణ్ అర్జున్. ఎడిటర్: బొంతల నాగేశ్వర రెడ్డి. కొరియోగ్రఫీ. అజయ్ శివశంకర్.

Tfja Team

Recent Posts

జియో స్టార్ బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘సేవ్ ది టైగర్స్ – సీజన్ 3’ .. పోస్టర్ రిలీజ్

సీజన్ 1, సీజన్ 2లతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను న‌వ్వుల్లో ముంచెత్తి భారీ విజయాలు సాధించిన అతి పెద్ద ఫ్యామిలీ ఎంట‌ర్‌టైనింగ్…

12 hours ago

“అగ్లీ స్టోరీ” చిత్రానికి వచ్చిన అనూహ్య స్పందనకు చిత్ర టీం థాంక్యూ మీట్

నందు, అవికా గోర్ జంటగా నటిస్తూ నిన్న ప్రేక్షకుల ముందుకువచ్చిన 'అగ్లీ స్టోరీ' చిత్రానికి వచ్చిన అనూష స్పందనకు ఈ…

14 hours ago

ఫీల్ గుడ్ ఎమోషన్‌తో రాబోతోన్న విజయ్ ఆంటోనీ ‘నాన్న కుట్టి’

ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్‌తో ము. మారన్ దర్శకత్వంలో విజయ్ ఆంటోనీ హీరోగా చేస్తున్న చిత్రం ‘నాన్న కుట్టి’. యాక్షన్,…

2 days ago

కార్మికులకు ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు మరో వరం, ఫిలిం ఫెడరేషన్ కు భవనం నిర్మించి ఇస్తానని హామీ

సినీ కార్మికులకు అండగా నిలబడటంలో ఎప్పుడూ ముందుంటారు ప్రముఖ నిర్మాత, దర్శకులు చదలవాడ శ్రీనివాసరావు. చిత్రపురి కాలనీకి కోట్లాది రూపాయల…

2 days ago

యంగ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ “సమవర్తి” మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్

వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు యంగ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్. ఆయన హీరోగా…

2 days ago

రాకింగ్ మంచు మనోజ్, అనిల్ సుంకర ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ కాంబినేషన్ లో ‘వడ్డీ కాసుల వాడ’ టైటిల్ లాంచ్

రాకింగ్ మంచు మనోజ్ స్టైలిష్‌ కమ్‌బ్యాక్‌కు రంగం సిద్దమైంది. ఏటీవీ సమర్పణలో ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ పై 'వడ్డీ కాసుల…

4 days ago