డబుల్ ఇస్మార్ట్ నుంచి క్యా లఫ్డా సాంగ్ రిలీజ్

డబుల్ ఇస్మార్ నుంచి మొదటి రెండు సింగిల్స్ ఆడియన్స్ ని అద్భుతంగా అలరించి వైరల్ హిట్స్ అయ్యాయి. లీడ్ పెయిర్ రామ్ పోతినేని, కావ్య థాపర్‌ ల థర్డ్ సింగిల్ క్యా లఫ్డా విడుదలతో ఈ మాన్‌సూన్ మరింత రొమాంటిక్ మారింది.

క్యా లఫ్డా ఒక అద్భుతమైన ట్రాక్, డిఫరెంట్ అండ్ యూనిక్ కంపోజిషన్ తో ఇన్స్టంట్ ఇంపాక్ట్ చూపిస్తుంది. డైనమిక్ వోకల్స్ తో   పెర్ఫార్మెన్స్  టెక్నో బీట్‌లను అద్భుతంగా  బ్లెండ్ చేశారు సంగీత దర్శకుడు మణి శర్మ. ఈ పాట ఇన్స్టంట్ గా లిజినర్స్ కు ఎనర్జీ ఇస్తుంది. వెరీ లైవ్లీ మూడ్ లో అలరించింది.

ట్రాక్ బ్యాలెన్స్ హుక్ లైన్‌ను కలిగి ఉంది, ప్రోగ్రామింగ్ సూపర్ కూల్ ఫ్లెయిర్‌తో వుంది. పాట మొత్తం చార్మ్ ని యాడ్ చేసింది. క్యా లఫ్డా  ఎంజాయ్ బుల్ మాత్రమే కాకుండా మెమరబుల్ ఎక్స్ పీరియన్స్ ని అందిస్తోంది.

ధనుంజయ్ సీపాన, సింధూజ శ్రీనివాసన్ రొమాంటిక్ టచ్‌తో తమ వోకల్స్ అందించారు. శ్రీ హర్ష ఈమాని సాహిత్యం కూడా అంతే ఆకట్టుకుంది. ఈ సీజన్‌లో రొమాంటిక్ మెలోడీగా ‘క్యా లఫ్డా’ రామ్, కావ్యా థాపర్ మధ్య అద్భుతమైన కెమిస్ట్రీని ప్రజెంట్ చేసింది. వారి కెమిస్ట్రీ పాటకు విజువల్ ఎట్రాక్షన్ యాడ్ చేసింది.

టీజర్‌కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభించడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి, విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ, మేకర్స్ రెగ్యులర్ అప్‌డేట్‌లు, ప్రమోషన్‌లతో దూకుడు పెంచారు.

పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ నిర్మించిన ఈ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా చిత్రంలో సంజయ్ దత్ పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు.

ఈ చిత్రానికి సామ్ కె నాయుడు, జియాని జియాన్నెలి ఆకట్టుకునే సినిమాటోగ్రఫీ అందించారు.

డబుల్ ఇస్మార్ట్ ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం రోజున తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.  

నటీనటులు: రామ్ పోతినేని, సంజయ్ దత్, కావ్య థాపర్, అలీ, గెటప్ శ్రీను తదితరులు.

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: పూరి జగన్నాధ్
నిర్మాతలు: పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్
బ్యానర్: పూరి కనెక్ట్స్
వరల్డ్ వైడ్ రిలీజ్: ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ (నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి)
సీఈఓ: విషు రెడ్డి
సంగీతం: మణి శర్మ
సినిమాటోగ్రఫీ: సామ్ కె నాయుడు, జియాని జియాన్నెలి
స్టంట్ డైరెక్టర్: కేచ, రియల్ సతీష్
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా

Tfja Team

Recent Posts

‘దండోరా’ చిత్రం అద్భుతంగా ఉంటుంది.. మంచి అనుభూతితో థియేటర్ నుంచి బయటకు వస్తారు – దర్శకుడు మురళీకాంత్

వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాల‌ను నిర్మించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన‌ లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్…

21 minutes ago

డిసెంబర్ 19న రాబోతోన్న ‘జిన్’ మూవీ పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి

సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్‌ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…

25 minutes ago

‘ఎర్రచీర’పక్కాగా ఫిబ్రవరి 6న విడుదల

బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…

28 minutes ago

ఫిబ్రవరి 13న ‘ఫంకీ’.. వాలెంటైన్స్ వీకెండ్‌కు ఫుల్ ఫన్ గ్యారంటీ!

వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…

31 minutes ago

‘దేఖ్‌లేంగే సాలా’ పాటతో పవన్ కళ్యాణ్ అభిమానుల ఆకలి తీర్చిన దర్శకుడు హరీష్ శంకర్

శ్రోతలను ఉర్రుతలూగిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' తొలి గీతం ‘దేఖ్‌లేంగే సాలా’ 24 గంటల్లోనే 29.6 మిలియన్లకు పైగా వీక్షణలతో…

35 minutes ago

కథాకేళి నుండి రెండవపాటగా ‘‘కొత్తగా ఓ రెండు తారలే’’..

ఈషా రెబ్బ, అనన్య నాగళ్ల, నందిని రాయ్, దినేశ్‌ తేజ్, అజయ్‌ కతుర్వార్, యశ్విన్‌ వేగేశ్నలు ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం…

39 minutes ago